బుర్రపాడు.. రూ. 50 వేలకు ఇంత సూపర్ బైక్ ఏంటి భయ్యా. లక్కీ ఛాన్స్
దేశంలో సెకండ్ హ్యాండ్ టూవీలర్ మార్కెట్ రోజురోజుకీ పెరుగుతోంది. కొన్ని రకాల ప్లాట్‌ఫామ్స్ వెరిఫైడ్ బైక్‌లను విక్రయిస్తున్నాయి. ఇలాంటి వాటిలో బైక్‌వాలా ఒకటి. ఈ వెబ్‌సైట్ తాజాగా ఒక మంచి బైక్‌ను తీసకొచ్చింది.

హోండా సీబీ హారెంట్ 160 ఆర్
హోండా కంపెనీ తీసుకొచ్చిన బెస్ట్ స్పోర్ట్స్ బైక్‌లో హోండా సీబీ హారెంట్ ఒకటి. యూత్‌ను టార్గెట్ చేసుకొని కంపెనీ ఈ బైక్‌ను తీసుకొచ్చింది. ఈ బైక్ లాంచింగ్ సమయంలో దాదాపు రూ. లక్ష వరకు ఉంది. అయితే బైక్ వాలాలో ఈ బైక్‌పై బెస్ట్ డీల్ లభిస్తోంది. ఈ బైక్‌ను కేవలం రూ. 50 వేలకే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు.
బండి కండిషన్ ఎలా ఉందంటే.?
బైక్‌వాలా వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఈ బైక్ 16వేల కిలోమీటర్లు తిరిగింది. ఈ బండిని 2017లో మ్యానిఫ్యాక్చరింగ్ చేశారు. ఈ బైక్‌కు సింగిల్ ఓనర్ ఉన్నారు. ప్రస్తుతం బైక్ హైదరాబాద్‌లోని ఏజీ ఆఫీసులో ఉంది. 28 రోజుల క్రితం ఈ బైక్‌ను బైక్‌వాలా వెబ్‌సైట్‌లో అప్డేట్ చేశారు. వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసిన ఫొటోల ప్రకారం బైక్ కండిషన్ బాగుంది. అయితే ఈ బైక్ రిజిస్ట్రేషన్ మాత్రం మహారాష్ట్రలో చేసింది ఉంది. కాబట్టి కొనుగోలు చేసిన తర్వాత మార్చుకోవాల్సి ఉంటుంది.
స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయి.?
* బైక్ డిస్‌ప్లేస్‌మెంట్ 162.71 సీసీగా ఉంది.
* మ్యాగ్జిమం పవర్ 15.04 బీహెచ్‌పీ@8500 ఆర్‌పీఎమ్‌గా ఉంది.
* మ్యాగ్జిమం టార్క్ 14.76 ఎన్ఎమ్@6500 ఆర్‌పీఎమ్‌గా ఉంది.
* బైక్ టాప్ స్పీడ్ 110 కి.మీలుగా ఉంది.
* వెబ్‌సైట్‌లో తెలిపిన వివరాల ప్రకారం ఈ బైక్ లీటర్‌కు 48 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
* బీఎస్4 ఎమిషన్ స్టాండర్డ్.
* ఈ బైక్‌లో 12వీ-4ఏహెచ్ (ఎమ్ఎఫ్) బ్యాటరీని అందించారు.
* 63 ఎమ్ఎమ్ స్ట్రోక్ ఈ బైక్ సొంతం.
ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.?
* ఈ బైక్‌లో స్పీడో మీటర్‌ను అందించారు.
* ఆడోమీటర్ ఉంది.
* టాకోమీటర్, ట్రిప్‌మీటర్, లో ఫ్యూయల్ ఇండికేటర్, క్లాక్ వంటి అధునాతన ఫీచర్లను అందించారు.
* పాస్ లైట్ ఫీచర్‌ను ఇందులో అందించారు.
ఈ విషయాలు గుర్తుంచుకోండి
సెకండ్ హ్యాండ్ బైక్‌ను కొనుగోలు చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా బైక్‌ను నేరుగా చూసిన తర్వాత కొనేందుకు ముందుకు రావాలి. ముందస్తుగా ఎలాంటి చెల్లింపులు చేయకూడదు. అలాగే సెకండ్ హ్యాండ్ బైక్‌ను విక్రయించే ముందు ఎట్టి పరిస్థితుల్లో కొన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఆ వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.