MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • మీ ఆధార్ కార్డులో ఈ మార్పు చేసుకోలేదా.? అయితే మీకు బ‌స్సులో ఫ్రీ టికెట్ లేన‌ట్లే

మీ ఆధార్ కార్డులో ఈ మార్పు చేసుకోలేదా.? అయితే మీకు బ‌స్సులో ఫ్రీ టికెట్ లేన‌ట్లే

తెలంగాణ‌లో ఇప్ప‌టికే ఉచిత బ‌స్సు ప్ర‌యాణం అందుబాటులో ఉండ‌గా తాజాగా కూట‌మి ప్ర‌భుత్వం స్త్రీ శ‌క్తి పేరుతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ ఫ్రీ టికెట్‌ను జారీ చేస్తోంది. అయితే ఇదే త‌రుణంలో మ‌హిళ‌ల‌కు ఓ స‌మ‌స్య త‌లెత్తుతోంది. అదేంటంటే.. 

1 Min read
Author : Narender Vaitla
Published : Aug 25 2025, 09:24 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆధార్ ప్ర‌మాణికం
Image Credit : Generated by google gemini AI

ఆధార్ ప్ర‌మాణికం

ఉచిత బ‌స్సు ప్ర‌యాణానికి ఆధార్ కార్డును ప్ర‌మాణికంగా తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. బ‌స్సు ఎక్కిన మ‌హిళ‌లు ఆధార్ కార్డును చూపిస్తే కండ‌క్ట‌ర్లు జీరో టికెట్‌ను జారీ చేస్తున్నారు. ఇత‌ర ఐడీ ప్రూఫ్‌ల‌ను స్వీక‌రిస్తున్నా మెజారిటీ మ‌హిళ‌లు మాత్రం ఆధార్ కార్డునే ఉప‌యోగిస్తున్నారు. అయితే ఆధార్ కార్డు వినియోగంలో తెలంగాణ‌లో మ‌హిళ‌ల‌కు ఓ స‌మ‌స్య త‌లెత్తుతోంది.

DID YOU
KNOW
?
ఫొటో కూడా
ఆధార్ కార్డులో పాత ఫొటోలు ఉంటున్నా కొంద‌రు కండ‌క్ట‌ర్లు ఫ్రీ టికెట్ ఇవ్వ‌డానికి నిరాక‌రిస్తున్నారు. కాబ‌ట్టి ఫొటోల‌ను కూడా అప్డేట్ చేసుకోవాల‌ని సూచిస్తున్నారు.
25
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉంటే నిరాక‌ర‌ణ
Image Credit : Gemini Ai

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉంటే నిరాక‌ర‌ణ

తెలంగాణ‌లో నివాసం ఉంటున్న కొంద‌రు ఇప్ప‌టికీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అడ్ర‌స్‌తోనే ఆధార్‌ను ఉప‌యోగించుకుంటున్నారు. నిజానికి తెలంగాణ‌లోని అడ్రస్ ఉన్నా రాష్ట్రం మాత్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌గా ఉంటుంది. ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోక‌పోవ‌డంతో కొన్ని బస్సుల్లో కండ‌క్ట‌ర్లు ఫ్రీ టికెట్ ఇవ్వ‌డానికి నిరాక‌రిస్తున్నారు. ఇదే అంశం ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశమైంది.

Related Articles

Related image1
గణపయ్య పండక్కి కావాల్సిన వస్తువులన్నీ ఒకేచోట.. అమెజాన్‌లో చ‌తుర్థి స్టోర్‌. 90 శాతం వ‌ర‌కు డిస్కౌంట్
Related image2
ఇంట్లో ఉండే నెలకు రూ. 50 వేలు సంపాదించే అవ‌కాశం.. బెస్ట్ బిజినెస్ ఐడియా
35
అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం లేదు
Image Credit : Getty

అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం లేదు

ఇదిలా ఉంటే ఉమ్మ‌డి రాష్ట్రంలో తీసుకున్న ఆధార్ కార్డుల్లో "ఆంధ్రప్రదేశ్" అని ఉంటే చెల్లుబాటు కాద‌న్న నిబంధ‌న‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్ర‌క‌న‌ట మాత్రం లేదు. అయితే కొందరు కండక్టర్లు మాత్రం "తెలంగాణ చిరునామా తప్పనిసరి" అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కొందరు బస్సుల్లో ఆధార్ అప్‌డేట్ తప్పనిసరి అని నోటీసులు కూడా అతికిస్తున్నారు.

45
ఏం చేయాలి.?
Image Credit : Freepik

ఏం చేయాలి.?

ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్టాలంటే ఆధార్ సేవా కేంద్రాల్లో సింపుల్‌గా కార్డును అప్డేట్ చేసుకుంటే స‌రిపోతుంది. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న ఆధార్ కార్డును అప్డేట్ చేసుకుంటే చిరునామా విభాగంలో ఉన్న‌ "ఆంధ్రప్రదేశ్" ఆటోమెటిక్‌గా తెలంగాణ‌లోకి మారిపోతుంది. ఇప్ప‌టికే చాలా మంది మ‌హిళ‌లు త‌మ ఆధార్ కార్డుల‌ను అప్డేట్ చేసుకుంటున్నారు.

55
ఫొటో కూడా
Image Credit : our own

ఫొటో కూడా

ఇక కొంద‌రు మ‌హిళ‌లు చాలా ఏళ్లుగా త‌మ ఆధార్ కార్డులో ఫొటోను అప్డేట్ చేసుకోవ‌డం లేదు దీంతో ఆధార్ కార్డులు మొదటగా తీసుకున్నప్పుడు చిన్నారుల ఫొటోలు ఉంటున్నాయి. ఇప్పటికీ ఆ పాత కార్డులనే వాడుతున్న వారు ఉన్నారు. వయసు పెరగడంతో ఆ ఫొటోలు వ్యక్తిని సరిగ్గా గుర్తించలేకపోవటంతో కండక్టర్లు "ఇది మీ కార్డేనా?" అని ప్రశ్నిస్తున్నారు. ఈ కారణంగా కూడా మహిళలు టికెట్ కొనాల్సి వ‌స్తోంది. దీంతో ఫొటో కూడా అప్డేట్ చేసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Rain Alert : హైదరాబాద్ లో ఆరెంజ్ అలర్ట్... ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Recommended image2
Now Playing
CPI (Maoist) Leaders Surrender: మావోయిస్టు లీడర్ దేవ్ జీ లొంగుబాటు | Asianet News Telugu
Recommended image3
తెలుగు యువతకు సూపర్ ఛాన్స్.. 3038 ఆర్టిసి ఉద్యోగాల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్
Related Stories
Recommended image1
గణపయ్య పండక్కి కావాల్సిన వస్తువులన్నీ ఒకేచోట.. అమెజాన్‌లో చ‌తుర్థి స్టోర్‌. 90 శాతం వ‌ర‌కు డిస్కౌంట్
Recommended image2
ఇంట్లో ఉండే నెలకు రూ. 50 వేలు సంపాదించే అవ‌కాశం.. బెస్ట్ బిజినెస్ ఐడియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved