Asianet News TeluguAsianet News Telugu

ముస్లింల కోసం భారత ఉలేమాలు ఒక కొత్త ఒరవడిని సృష్టించాలి

భారత ఉలేమాలు ముస్లింల కోసం ఒక కొత్త ఒరవడి సృష్టించాలి. జాతీయ సమస్యలకు అందరినీ ఏకం చేయడమే కాదు.. ముస్లింల అభ్యున్నతికి కూడా పాటుపడాలి. శాస్త్రీయ వృద్ధి, ఆర్థిక జ్ఞానంతో పరుగు పెడుతున్న వేళ.. ఉలేమాలు సంస్కరించి ముస్లిం సమాజాన్ని సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యతను కలిగి ఉంటారు.
 

indian muslims should build new narrative for indian muslims kms
Author
First Published Sep 12, 2023, 5:52 PM IST

ఇటీవలి కాలంలో సంతృప్తికర ధోరణి ఒకటి కనిపిస్తున్నది. తీవ్రవాద భావజాలాన్ని ఇక్కడ ఎవరూ స్వీకరించడం లేదు. కొందరు వాచాలులు తప్పితే వాటినెవరూ ఖాతరు చేయడం లేదు. భారత్‌లో పాగా వేయాలని భావించిన ఐఎస్ఐఎస్, అల్ ఖైదా వంటి ఉగ్రవాద సంస్థల భావజాలాలు ఇక్కడ వేళ్లూనుకోలేదు.

జాతీయ సమస్యలు, సవాళ్ల కోసం ముఖ్యంగా వలసవాదుల పాలన కాలంలో ప్రజలను ఏకతాటి మీదికి తీసుకురావడంలో ఉలేమాలు గొప్ప పని చేశారన్న సంగతి విధితమే. జీవిత కాలం కారాగారాల్లోకి వెళ్లడానికీ సిద్ధపడి ఈ పని చేశారు. ముస్లిం లీగ్ ద్విజాతి సిద్ధాంతాన్ని తెచ్చినప్పుడూ ఉలేమాలు దానికి ఎదురుగా నిలబడి వేర్పాటువాదాన్ని వ్యతిరేకించి పాకిస్తాన్‌కు బదులు హిందుస్తాన్‌ను ఎంచుకున్నారు.

1980ల కాలంలో అఫ్ఘనిస్తాన్‌లో గ్లోబల్ జిహాద్ పిలుపు వచ్చినప్పుడూ ప్రపంచవ్యాప్తంగా సుమారు ఒక లక్షల మంది వాలంటీర్లు రెస్పాండ్ అయ్యారు. అందులో ఒక్కరు కూడా భారత్ నుంచి లేరు. ఇది ఉలేమాల పని వల్లే సాధ్యమైందని చెప్పొచ్చు. కానీ, ఉలేమాల బాధ్యత ఇంత వరకేనా? ముస్లింలను సన్మార్గంలో నడపడమే కాదు.. ముస్లింల అభ్యున్నతి, ఇస్లాం అభివృద్ధికి ఒక కొత్త ఒరవడిని తయారు చేయాల్సిన అవసరం లేదా?

ఔను. కచ్చితంగా ఉన్నది.

180 మిలియన్ల జనాభాతో రెండో అత్యధిక ముస్లింలు గల దేశంగా భారత్ నిలుస్తున్నది. కాబట్టి, భారత ముస్లింల అభిప్రాయాలు, వైఖరులు ప్రపంచవ్యాపితంగా వినిపిస్తాయి. భారత ముస్లింల నుంచి తీవ్రవాద భావజలానికి వ్యతిరేకత ఎక్కడి నుంచి జనిస్తున్నది? అది అసాధారణ భారత బహుళత్వ సంస్కృతిలో నుంచి వస్తున్నది. ఈ విలువలు భారత రాజ్యాంగంలో ఉన్నాయి. అందుకే భారత్ లౌకిక, ప్రజాస్వామిక దేశంగా ఎదిగింది. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉన్నది. భారత ముస్లింల జీవితాలకు సంబంధఇంచి మరో ముఖ్య విషయం ఏమిటంటే.. వీరు 75 ఏళ్లపాటు నిరంతరాయ మత స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తున్నారు.

Also Read: మిలిటెంట్లతో పోరాడి 32 ఏళ్ల క్రితం మరణం.. అసోం పోలీసును అమరవీరుడిగా ప్రకటించిన ప్రభుత్వం

భారత్, ప్రపంచం శాస్త్రీయ పురోగతి, ఆర్థిక జ్ఞానం వైపు పరుగు తీస్తున్నప్పుడు ఉలేమాలు కూడా వారి బాధ్యతలను సీరియస్‌గా తీసుకోవాల్సి ఉన్నది. ఇస్లాం ఆధునిక విద్యను, ప్రజాస్వామ్యాన్ని కచ్చితంగా బలపరుస్తుందని స్పష్టంగా చెప్పాల్సి ఉన్నది. ప్రజాస్వామ్యం, శాస్త్రీయ విద్య రెండూ అభివృద్ధి చెందుతున్న సమాజాలకు చాలా ముఖ్యం.

ఉలేమాలు ఈ బాధ్యతలు తీసుకోవాలి. ఇప్పటికీ తిరోగమనం వైపుగా ఉన్న మద్రాసాలను ఆధునీకరించాలి. ముస్లింల ఆలోచనలను ఉన్నతమార్గానికి పట్టించాలి. ఆధునిక సంస్థలకు దీటుగా మద్రాసాలను ఆధునీకరించాలి. ఇందుకు ప్రభుత్వాలు ఏమో చేయాలి అని ఎదురుచూడరాదు. ఉలేమాలు ప్రతి రాష్ట్రంలో ఒక మద్రాసా బోర్డును ఏర్పాటు చేసుకోవాలి.

ఉలేమాలు ఎన్నికల రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు వారు ఇస్లాం, ఇస్లాంలోని ప్రముఖుల పేర్లను చెప్పి ఓట్లు సంపాదించుకోకుండా వ్యవహరించడానికి అంగీకరించాలి. భారత్ వైవిధ్య, బహుళత్వ దేశం. వైవిధ్య సమాజంలో ఉండటం భారత ముస్లింల ప్రత్యేకత. అందుకే ఉలేమాలు బహుళత్వాన్ని ఎత్తిపట్టేలా ఉండాలి. ఇప్పటికీ వేరే మతాల పండుగలు, వేడుకలను అంగీకరించడం లేదా అందులో పాల్గొనడాన్ిన చాలా మంది వ్యతిరేకిస్తారు. ఇది చాలా సార్లు ఉద్రిక్తంగానూ ఉంటాయి. ఇలాంటి ఉద్రిక్తతల నుంచి భారత్ విముక్తి కావాల్సి ఉన్నది.

ఈ బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని కమ్యూనిటీ, దేశం పురోగతి కోసం కృషి చేయాలి.

---డాక్టర్ షుజాత్ అలీ ఖాద్రి

Follow Us:
Download App:
  • android
  • ios