Asianet News TeluguAsianet News Telugu

18 నెలల తర్వాత టూరిస్టులకు మళ్లీ గ్రీన్ సిగ్నల్.. 99 దేశాల పర్యాటకులకు క్వారంటైన్ అక్కర్లేదు

పర్యాటక రంగానికి దన్ను ఇచ్చే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. 99 దేశాల నుంచి మన దేశానికి వస్తున్న పర్యాటకులకు క్వారంటైన్ ఎత్తేస్తున్నది. 18 నెలల తర్వాత తొలిసారిగా ఈ దేశాల నుంచి పర్యాటకులు రెగ్యులర్ కమర్షియల్ ఫ్లైట్‌లలో భారత్‌కు వస్తారు. అంతేకాదు, సుమారు 5 లక్షల ఉచిత వీసాలను మంజూరు చేసి పర్యాటకాన్ని పెంచాలని కేంద్రం యోచిస్తున్నది.
 

india resumes commercial flights to tourists
Author
New Delhi, First Published Nov 15, 2021, 4:32 PM IST

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం విదేశీ Touristలకు శుభవార్త తెలిపింది. భారత పర్యాటక రంగానికి ఉత్తేజకరమైన నిర్ణయం తీసుకుంది. రెండు డోసుల Vaccine తీసుకున్నవారిని రెగ్యులర్ కమర్షియల్ Flights ద్వారా India పర్యటించడానికి అనుమతులు ఇచ్చింది. సోమవారం(ఈ రోజు) నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తున్నాయి. కరోనా కేసులు తగ్గిపోవడం, వ్యాక్సినేషన్ పెరిగిన తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

భారత్ వచ్చే పర్యాటకులు రెండు డోసులు తీసుకుని ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఫ్లైట్ ఎక్కడానికి 72 గంటల ముందు చేసుకున్న టెస్టులో నెగెటివ్ రిపోర్టు కలిగి ఉండాలని, అన్ని కరోనా నిబంధనలు పాటించాలని తెలిపింది.  అంతేకాదు, చాలా దేశాల పర్యాటకులు మనదేశంలో విమానాశ్రయంలో దిగిన తర్వాత కూడా కరోనా టెస్టు చేసుకోవాలని వివరించింది. అయితే, భారత్‌తో వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ధ్రువీకరణ ఒప్పందాలున్న దేశాల పర్యాటకులు మన దేశంలో అడుగుపెట్టిన తర్వాత కరోనా టెస్టు చేసుకోవాల్సిన అవసరం లేదని మినహాయింపు ఇచ్చింది. యూఎస్, యూకే సమా చాలా యూరప్ దేశాలు.. మొత్తం 99 దేశాల నుంచి భారత్‌కు వచ్చే పర్యాటకులు మన దేశంలో ఎయిర్‌పోర్టులో కరోనా టెస్టు చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే, వీరికి క్వారంటైన్ నిబంధననూ ఎత్తేసింది. మిగతా దేశాల నుంచి పర్యాటకులు మాత్రం క్వారంటైన్ పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. భారత స్థానిక టీకా సర్టిఫికేట్‌ను గుర్తించే దేశాలు.. లేదా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన టీకాలను ఆమోదించే దేశాల పర్యాటకులకు కేంద్రం ఈ అవకాశాన్ని ఇచ్చింది.

Also Read: టీకా వేసుకోకుంటే నో పెట్రోల్.. నో రేషన్.. డెడ్‌లైన్ ఈ నెల 30

గతేడాది మార్చిలో భారత ప్రభుత్వం కఠిన లాక్‌డౌన్ విధించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన దేశానికి కమర్షియల్ విమానాల్లో పర్యాటకుల రాకపై నిషేధం విధించింది. రెండు డోసులు వేసుకున్న పర్యాటకులు చార్టర్డ్ ఫ్లైట్ ద్వారా భారత దేశంలో అడుగుపెట్టడానికి గత నెల నుంచి అనుమతి ఇచ్చింది. అంతేకాదు, పర్యాటకులను ఆకర్షించడానికి ప్రత్యేక ప్రణాళికలు చేస్తున్నది. వచ్చే ఏడాది మార్చి కల్లా ఐదు లక్షల ఉచిత వీసాలను అందించే అంశంపై ఆలోచనలు చేస్తున్నది. దీని ద్వారా పర్యాటకులను ఆకర్షించి కరోనాతో దెబ్బ తిన్న పర్యాటక రంగానికి కొత్త ఊపును తేవాలని భావిస్తున్నది.

కరోనా కేసుల్లో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానానికి వెళ్లిన సంగతి తెలిసిందే. అత్యధిక కేసులు అమెరికాలో రిపోర్ట్ అయ్యాయి. 35 మిలియన్ కేసులతో భారత్ రెండో స్థానానికి చేరింది. అయితే, ఇప్పుడు కేసులు తగ్గుముఖం పట్టాయి. గత నెల రోజులుగా పది వేలకు అటూ ఇటూగా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1.34 లక్షలు ఉన్నాయి. 17 నెలల్లో ఇదే అత్యల్పం అని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Also Read: కొత్త చరిత్ర సృష్టించాం,ప్రపంచం చూపు మనవైపే : 100 కోట్ల కరోనా వ్యాక్సిన్ పంపిణీపై మోడీ

నేడు మన దేశంలో కనీసం ఒక్క డోసు అయినా తీసుకున్న వయోజనులు 79శాతానికి చేరారు. కాగా, 39 శాతం మంది వయోజనులు రెండు డోసులూ తీసుకున్నారు. టీకా పంపిణీ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయడానికి డోర్ టు డోర్ క్యాంపెయిన్‌లకూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది.

2019లో పర్యాటక రంగం 30 బిలియన్ డాలర్లు ఆర్జించాయి. కానీ, 2020లో ఇది భారీగా పడిపోయింది. 75శాతం పర్యాటకుల రాక తగ్గిపోయింది. 2020లో కేవలం 30 లక్షల మంది టూరిస్టులు మాత్రమే దేశానికి వచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios