Asianet News TeluguAsianet News Telugu

టీకా వేసుకోకుంటే నో పెట్రోల్.. నో రేషన్.. డెడ్‌లైన్ ఈ నెల 30

మహారాష్ట్రలో ఔరంగాబాద్ టీకా పంపిణీలో వెనుకంజలో ఉన్నది. ప్రధాన మంత్రే స్వయంగా ఇక్కడ టీకా పంపిణీ వేగం పెంచాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వమూ ఈ నెలాఖరులోగా అర్హులైన వారందరికీ టీకా వేయాలని నిర్దేశించింది. ఈ నేపథ్యంలోనే టీకా వేసుకోని వారికి పెట్రోల్, గ్యాస్, రేషన్ అందబోదని, జిల్లా దాటే ఆస్కారం ఉండదని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.
 

unvaccinated people will not get ration, petrol, gas in aurangabad
Author
Mumbai, First Published Nov 10, 2021, 4:14 PM IST

ముంబయి: Coronavirus మహమ్మారిని అంతం చేయడానికి అందుబాటులో ఉన్న అస్త్రం Vaccineనే. ఇప్పటికీ కరోనా ముప్పు ప్రబలే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. పండుగల సీజన్ నేపథ్యంలో మూడో వేవ్ ముప్పు కూడా ఉందని నిపుణులు హెచ్చరించారు. మనదేశంలో కరోనా టీకా పంపిణీ చెప్పుకోదగ్గ వేగంతో జరుగుతున్నా.. కొన్ని చోట్ల అనుకున్న స్థాయిలో Vaccination లేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి.

కరోనా టీకా పంపిణీ మనదేశంలో జనవరిలో ప్రారంభమైంది. కానీ, ఇప్పటికీ కొన్ని చోట్లా కరోనా వ్యాక్సిన్‌లపై అపనమ్మకం పోలేదు. టీకా వేసుకోవడానికి జంకుతున్నారు. అవగాహన కార్యక్రమాలు చేపట్టిన అలాంటి ప్రాంతాల్లో మార్పు అంతంతగానే వచ్చింది. Maharashtraలోని Aurangabad జిల్లాలోనూ ఇదే పరిస్థితి. మహారాష్ట్ర మొత్తంగా టీకా పంపిణీ రేటు 74శాతంగా ఉండగా, ఔరంగాబాద్‌లో మాత్రం 55శాతమే ఉన్నది. ఈ జిల్లాలో టీకా పంపిణీ వేగం పెంచాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ మోడీ సూచనలు చేశారు. 

ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంది. ఈ నెలాఖరులోగా ఔరంగాబాద్ జిల్లాలో వంద శాతం అర్హులైన వారందరికీ టీకా వేయడం పూర్తవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నెల ఆఖరులోగా వంద శాతం టీకా పంపిణీ టార్గెట్ ఛేదించాలని లక్షించింది. ఇందుకోసమే అర్హులైన వారందరూ తప్పకుండా టీకా వేసుకోవాలని జిల్లా అధికారులు ఆదేశించారు. కరోనా టీకా ఒక్క డోసు అయినా తీసుకోని వారికి పెట్రోల్, గ్యాస్, రేషన్ అందుకోలేరని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. అంతేకాదు, వారు జిల్లాలోని టూరిస్టు స్పాట్‌లకు వెళ్లలేరని వివరించింది. రాష్ట్రం, జిల్లాను దాటి వెళ్లే అవకాశమూ ఉండదని తెలిపింది. ఈ ఆదేశాలు ఈ నెల 9వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి.

Also Read: No Vaccine No Salary: కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోని ఉద్యోగులకు జీతాలు బంద్.. ఎక్కడంటే..

టూరిస్టు స్పాట్‌లలో ఉన్న హోటల్స్, రిసార్టులు, షాపులలో పని చేసే వాంరదరూ టీకా తీసుకోవడాన్ని తప్పనిసరి చేసింది. 

18ఏళ్లు పైబడి ఫస్టు డోసు తీసుకోని వారు.. రెండు డోసుకూ అర్హత ఉండి కూడా వేసుకోని వారిని జిల్లాలోని పర్యాటక ప్రాంతాలైనా బీబీ కా మక్బారా, అజంతా గుహలు, దౌలతాబాద్ కోట, ఎల్లోరా గుహలకు వెళ్లడాన్ని నిషేధింది. ఒక్క డోసు కూడా తీసుకోని వారు జిల్లా విడిచి బయట అడుగు పెట్టడానికి వీలు లేదని నిబంధన విధించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులు, టూర్ నిర్వాహకులు కచ్చితంగా రెండు డోసులూ తీసుకుని ఉండాలని నిర్దేశించింది.

Follow Us:
Download App:
  • android
  • ios