కరోనా పంజా.. ఒక్కరోజే 2,796 మంది మృతి
కరోనా ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. కొత్త వెలుగుచూసిన కోవిడ్-19 వేరియంట్ ఒమిక్రాన్ కేసులు సైతం భారత్‌లో నమోదవుతుండటం పై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంతకు ముందుతో పోలిస్తే.. దేశంలో కొత్త కేసులు, మరణాలు పెరుగుతున్నాయి.
దేశంలో కరోనా మహమ్మారి (Coronavirus) కొత్త వేరియంట్ కేసులు నమోదవుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతున్నది. అలాగే, కోవిడ్-19 కోత్త కేసులు సైతం క్రమంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజే 2,796 మంది కరోనా ప్రాణాలు కోల్పోవడం దేశంలో కరోనా ప్రభావం ఏ స్థాయిలో పెరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. నిన్నటితో పోలిస్తే దేశంలో కొత్త కేసుల్లో మూడు శాతం పెరుగుదల నమోదైందని ఆదివారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆ వివరాల ప్రకారం... గత 24 గంటల్లో దేశంలో 8,895 కరోనా (Coronavirus) కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,46,33,255 కు చేరింది.
Also Read: కాంగ్రెస్ నుంచి మరో కొత్త పార్టీ రానుందా?.. సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు
అలాగే, గత 24 గంటల్లో కరోనాతో పోరాడుతూ 2,796 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా (Coronavirus) మరణాల సంఖ్య 4,73,326కు పెరిగింది. ప్రస్తుతం 99,155 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం 3,40,60,774 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో 6,918 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక కొత్తగా నమోదైన కరోనా ( COVID-19) మరణాల్లో అత్యధికం బీహార్, కేరళలో నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు మొత్తం కేసులలో 1% కంటే తక్కువగా ఉన్నాయి. రికవరీ రేటు ప్రస్తుతం 98.35 శాతంగా ఉంది. మరణాల రేటు 1.36 శాతంగా ఉంది. గత వారం రోజుల కరోనా పాజిటివిటీ రేటు 5.4 శాతంగా ఉంది.
Also Read: ఆర్థిక మంత్రిగా సరికొత్త ఒరవడిని తీసుకొచ్చిన కొణిజేటి రోశయ్య.. రాజకీయ ప్రస్థానం..
కరోనా ( COVID-19) కేసులు, మరణాలు అధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ లు టాప్-10 లో ఉన్నాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 66,38,071 కరోనా కేసులు, 1,41,163 మరణాలు నమోదయ్యాయి. రెండో స్థానంలో ఉన్న కేరళలో 51,61,471 కేసులు, 41,439 COVID-19 మరణాలు నమోదయ్యాయి.
Also Read: పెగాసస్.. ఎన్ఎస్ వో నిషేధంపై కేంద్రం కీలక వ్యాఖ్యలు
దేశంలో కరోనా కొత్త కేసులు, మరణాలు క్రమంగా పెరుగుతుండటం కలకలం రేపుతున్నది. అలాగే, దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు సైతం భారత్‌లో నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే నాలుగు ఒమిక్రాన్ కేసుల నమోదు, విదేశాల నుంచి వచ్చినవారు అధికంగా ఉండటంపై ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కరోనా కట్టడి కోసం చర్యలను వేగవంతం చేశాయి. కరోనా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలనీ, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నాయి. పలు రాష్ట్ర ప్రభుత్వాలు మాస్కులు ధరించకపోతే వేయి రూపాయల వరకు జరిమాన విధిస్తున్నాయి. అలాగే, అందరూ టీకాలు వేసుకోవాలని సూచిస్తున్నాయి.
Also Read: ఆర్థిక చాణక్యుడు.. అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోశయ్య
Also Read: ఆర్థిక చాణక్యుడు.. అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోశయ్య