Asianet News TeluguAsianet News Telugu

ఆర్థిక మంత్రిగా సరికొత్త ఒరవడిని తీసుకొచ్చిన కొణిజేటి రోశ‌య్య.. రాజకీయ ప్రస్థానం..


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు, క‌ర్నాట‌క రాష్ట్రాల గవర్నరుగా పనిచేసిన  కొణిజేటి రోశయ్య (konijeti rosaiah)  శనివారం ఉదయం  క‌న్నుమూశారు.  మంచి వక్తగా , ఆర్థిక, రాజ‌కీయా సంబంధ విష‌యాల్లో ఉద్దండుడిగా  పేరొందిన కొణిజేటి రోశయ్య రాజ‌కీయా ప్ర‌స్థానం ఎన్నో మ‌లుపులు తిరుగుతూ ప్రారంభ‌మైంది. 

rosaiah political journey
Author
Hyderabad, First Published Dec 4, 2021, 9:35 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా (former chief minister), తమిళనాడు, క‌ర్నాట‌క రాష్ట్రాల గవర్నరుగా పనిచేసిన  కొణిజేటి రోశయ్య  (konijeti rosaiah) శనివారం ఉదయం 8 గంటల సమయంలో క‌న్నుమూశారు. రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర‌వేశారు. కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాల లో కామర్స్ అభ్యసించారు.  వాణిజ్యశాస్త్రంలో డిగ్రీ పూర్తిచేశాడు. 1968లో తొలిసారిగా శాసనమండలికి ఎన్నికయ్యాడు. ఆయ‌న రాజ‌కీయా జీవిత ప్ర‌స్థానాన్ని గ‌మ‌నిస్తే.. ప్ర‌ముఖ స్వ‌తంత్య్ర‌  స‌మ‌రయోధులు,  రైతు నాయకుడు గా పేరొందిన ఎన్.జి.రంగా ద‌గ్గ‌ర కొణిజేటి రోశ‌య్య రా జ‌కీయ పాఠాలు నెర్చుకున్నారు. నిడుబ్రోలు లోని రామానీడు రైతాంగ విద్యాలయములో సహచరుడు తిమ్మారెడ్డితో బాటు రాజకీయ పాఠాలు సాగిస్తూ ముందుకు సాగారు.  1968లో తొలిసారిగా శాసనమండలికి ఎన్నికయ్యాడు. ఆ త‌ర్వాత  1979లో ఏప ముఖ్య‌మంత్రి టంగుటూరి అంజయ్య ప్రభుత్వంలో రవాణ, గృహనిర్మాణం, వాణిజ్య పన్నుల శాఖల మంత్రిగా బాధ్య‌త‌ల్లో కొన‌సాగారు. ఆ త‌ర్వాత 1982లో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలో హోం శాఖ మంత్రిగా ప‌నిచేశారు. 

Also Read: ఒమిక్రాన్ వేరియంట్‌.. కేంద్రం కీల‌క వ్యాఖ్య‌లు

ఇక 1989లో మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, రవాణ, విద్యుత్తు శాఖల మంత్రిగా బాధ్య‌త‌లు నెర‌వేర్చారు రోశయ్య. 1991లో నేదురుమల్లి జనార్ధనరెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలు మంత్రిగా ప‌నిచేశారు. మ‌ళ్లీ 1992లో కోట్ల విజయభాస్కర రెడ్డి ప్రభుత్వంలో ఆర్థిక, ఆరోగ్య, విద్య, విద్యుత్తు శాఖలకు మంత్రిగా పనిచేసారు. 2004, 2009లో వై.యస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వములో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.  ఆయ‌న రాజ‌కీయా జీవితంలో దాదాపు పాల‌న యంత్రాంగంలోని అన్ని కీల‌క‌మైన మంత్రిత్వ శాఖ‌ల‌కు మంత్రిగా ప‌నిచేశారు. త‌న‌దైన  చెర‌గ‌ని ముద్ర వేశారు. మ‌రీ ముఖ్యంగా ఆర్థిక మంత్రిగా త‌న‌దైన శైలీలో ముందుకు సాగుతూ.. కొత్త వ‌ర‌వ‌డిని తీసుకువ‌చ్చారు.   ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో  సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా పనిచేసిన రోశయ్య 2009-10 బడ్జెటుతో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును ప్రవేశపెట్టారు. ఇందులో చివరి 7 సార్లు వరుసగా ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఘనాపాటిగా పాటిగా, త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్నారు. 

Also Read: కాంగ్రెస్‌..బీజేపీల‌తోనే స్థానిక‌ సంస్థల నిర్వీర్యం: మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి

ఇక ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగ‌త నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో  ప్రాణాలు కోల్పోవ‌డంతో రోశ‌య్య రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 2009, సెప్టెంబర్ 3 న రోశయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు. పద్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబరు 24 వ తేదీన తన పదవికి రాజీనామా చేసారు. ఆ త‌ర్వాత ఆయ‌న త‌మిళ‌నాడు, క‌ర్నాట‌క రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్‌గా ప‌నిచేశారు.  ఇక ఆయన  ఆరోగ్యం విష‌మించ‌డంతో  శనివారం ఉదయం 8 గంట‌ల ప్రాంతంలో ఆయ‌న తుదిశ్వాస విడిచారు. 

Also Read: ఇది ప్రాజాస్వామ్యమా? అవ్వను అవమానించారు: రాష్ట్ర సర్కారుపై టీడీపీ ఫైర్

కొణిజేటి రోశ‌య్య రాజ‌కీయ జీవితం...

1968-85: శాసనమండలి సభ్యుడు.
1978-79: శాసనమండలిలో ప్రతిపక్ష నేత.
1979-83: రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి.
1985-89: తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడు.
1989-94: రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి.
2004-09: చీరాల అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడు.
2004 : రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిపదవి.
2009 : రాష్ట్ర శాసనమండలి సభ్యుడు.
2009 సెప్టెంబరు - 2010 నవంబరు 24: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి.
2011, ఆగస్టు 31: తమిళనాడు గవర్నరు.

Also Read: హీట్ పుట్టిస్తున్న పంజాబ్ రాజ‌కీయం.. పొత్తుల్లో అమరీందర్ దూకుడు

 

Follow Us:
Download App:
  • android
  • ios