కాంగ్రెస్ నుంచి మరో కొత్త పార్టీ రానుందా?.. సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుందో చెప్పలేము. శత్రువులు మిత్రులు కావడం, స్నేహితులు విరోధులవ్వడం మాములే. మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రతిసారి జరుగుతున్నదే. అయితే, ఇప్పటికే అంతర్గత కలహాలతో డీలా పడిన కాంగ్రెస్ పార్టీకి మరో సీనియర్ నేత గుడ్‌బై చెప్పనున్నారా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కొత్త పార్టీని ప్రారంభించడం లేదు.. కానీ.. అంటూ కాంగ్రెస్ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
శ్రీనగర్: కాంగ్రెస్ పార్టీలో ఆయనొక సీనియర్ నేత. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ సమయంలోనూ కీలక నేతగా పార్టీకోసం పనిచేశారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ సీనియర్ నేతగా కొనసాగుతున్నారు. అయితే, ఇటీవలి కాలంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో రెబల్ నేతగా ముందుకు సాగుతూ పార్టీని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిందని తెలుస్తోంది. ఆయనే కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్. గత కొంత కాలంగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని ఆగ్రహానికి గురిచేస్తున్నదని సమాచారం. అలాగే, పార్టీ సీనియర్ నేత ఇలా మాట్లాడుతుండటం పార్టీని కొత్త చిక్కుల్లో పడేస్తోంది. అయితే, పార్టీలో అత్యంత సీనియర్ నేత కావడంతో డైరెక్టుగానే ఆయనను హెచ్చరించడంలో అధినాయకత్వం వెనకడుగు వేస్తున్నదని తెలుస్తోంది.
Also Read: పెగాసస్.. ఎన్ఎస్ వో నిషేధంపై కేంద్రం కీలక వ్యాఖ్యలు
గులాం నబీ ఆజాద్ ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లో వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. కరోనా మహమ్మారి తర్వాత అక్కడి రాజకీయ పరిస్థితులు, పార్టీని మరింతగా ముందుకు తీసుకుపోవడానికే ఈ సమావేశాలు అని చెప్తున్నప్పటికీ.. అసలు విషయం ఇది కాదనీ రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకాశ్మీర్ లో కొత్త పార్టీని పెట్టే ఉద్దేశం తనకు లేదని చెప్తుతూనే .. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని చెప్పడం సంచలనంగా మారింది. జమ్మూకాశ్మీర్ అంతటా ఆజాద్ నిర్వహించిన వరుస సమావేశాలు అతను కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నారనే ఊహాగానాలకు ఈ వ్యాఖ్యలు ఆజ్యం పోశాయి. దీనికి తోడు ఇటీవల ఆయన విధేయులైన 20 మంది కాంగ్రెస్ పదవులకు రాజీనామా చేయడం కూడా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న ఈ చర్యలు గులాం నబీ ఆజాద్ త్వరలోనే కొత్త పార్టీని ప్రారంభించడమో లేదా మరో పార్టీలోకి వెళ్లడమో చేస్తారనే ప్రచారం నడుస్తోంది.
Also Read: ఆర్థిక చాణక్యుడు.. అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోశయ్య
అలాగే, గత నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో కీలక పదవులు నిర్వహించిన ఆజాద్.. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ కాలం మాదిరిగా నేడు విమర్శలకు తావు లేదని అన్నారు. "నాయకత్వాన్ని ఎవరూ సవాలు చేయడం లేదు. బహుశా ఇందిరాగాంధీ మరియు రాజీవ్‌జీ విషయాలు తప్పుగా ఉన్నప్పుడు ప్రశ్నించడానికి నాకు చాలా స్వేచ్ఛ ఇచ్చారు. వారు విమర్శలను ఎప్పటికీ పట్టించుకోరు. వారు దానిని అభ్యంతరకరంగా చూడరు. కానీ ప్రస్తుత నాయకత్వం దానిని అభ్యంతరకరంగా చూస్తోంది,'' అని రాంబన్‌లో జరిగిన బహిరంగ సభలో గులాం నబీ ఆజాద్ చెప్పుకురావడం సంచనలంగా మారింది. అలాగే, రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చినప్పటి పరిస్థితులను కూడా ఆయన ప్రస్తావించారు.
Also Read: ఆర్థిక చాణక్యుడు.. అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోశయ్య
తాను సొంత పార్టీ పెట్టడం లేదని చెబుతూనే.. "రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు, ఎప్పుడు చనిపోతారో ఎవరికీ తెలియదు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు, కానీ పార్టీ పెట్టే ఉద్దేశం నాకు లేదు అని అన్నారు. అలాగే, తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకున్నానని, అయితే లక్షలాది మంది మద్దతుదారుల కోసం కొనసాగాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. "గత రెండేళ్లుగా ప్రజలకు మరియు నాయకత్వానికి మధ్య కనెక్షన్ తెగిపోయింది. ఆర్టికల్ 370 రద్దు, కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని రాజకీయ కార్యకలాపాలు ఆగిపోయాయి, వేలాది మంది జైలు పాలయ్యారు. బయట ఉన్నవారిని రాజకీయ కార్యకలాపాలు చేయకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు.
Also Read: ఆర్థిక మంత్రిగా సరికొత్త ఒరవడిని తీసుకొచ్చిన కొణిజేటి రోశయ్య.. రాజకీయ ప్రస్థానం..