ఆర్థిక చాణక్యుడు.. అత్య‌ధిక‌సార్లు బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన రోశ‌య్య‌

రాజ‌కీయాల్లో త‌న‌దైన ముద్ర‌వేసిన ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర మాజీ ముఖ్య‌మంత్రి, త‌మిళ‌నాడు, క‌ర్నాటక రాష్ట్రాల గవర్నర్ గా పనిచేసిన కొణిజేటి రోశయ్య (konijeti rosaiah) శనివారం ఉదయం 8 గంటల సమయంలో  కన్నుమూశారు. ఆర్థిక ఉద్ధండుడిగా, ఆర్థిక మంత్రిగా  చెక్కుచెద‌ర‌ని రికార్డులు (16 times) నెల‌కొల్పారు రోశ‌య్య‌. 
 

rosaiah presented budget for record 16 times

రోశయ్యగారి విశిష్ట వ్యక్తిత్వం, ఆయన రాజనీతిజ్ఞత, ఆరుదశాబ్దాల పరిమిత రాజకీయ అనుభవ విజ్ఞానాలు  కారణంగా ఆయనను అన్ని పదవులు అలంకరించేలా చేశాయి. ఆయన అందరిలా సాధారణ రాజకీయవేత్తకాదు. ఆయన రాజనీతిజ్ఞుడు. రాజకీయ చాణక్యుడు. రాజకీయ ఆర్థికవేత్త. తన రాజకీయ జీవితంలో ఆయన అనేక రికార్డులు సైతం నెలకొల్పారు.  ఒక రాష్ట్రంలో 16 బడ్జెట్టులు ప్రవేశపెట్టిన ఘనత కొణిజేటి రోశ‌య్య‌ది. ‘ఆంధ్రప్రదే శ్‌లో ఎప్పుడు కాంగ్రెసు ప్రభుత్వం వచ్చినా, దానిలో ఆర్థిక మంత్రి తప్పకుండా రోశయ్యనే' అనే విధంగా ఒక కొత్త వ‌ర‌వ‌డిని తీసుకువ‌చ్చారంటే ఆయ‌న ఘ‌నత ఎలాంటిదో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. రాష్ట్రంలో ఐదుగురు ముఖ్య‌మంత్రుల ప్ర‌భుత్వాలలో మంత్రిగా ప‌నిచేసిన ఘ‌న‌త ఆయ‌న‌ది. 

Also Read: ఆర్థిక మంత్రిగా సరికొత్త ఒరవడిని తీసుకొచ్చిన కొణిజేటి రోశ‌య్య.. రాజకీయ ప్రస్థానం..

ఇక ఉమ్మ‌డి ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, ఆర్థిక మంత్రిగా ప‌నిచేసిన కొణిజేటి రోశ‌య్య ప‌లు స‌రికొత్త రికార్డులు సృష్టించారు. ఆయ‌న నెల‌కోల్పిన  రికార్డులు గ‌మ‌నిస్తే..  దేశంలోనే అత్య‌ధిక స్థాయిలో రాష్ట్ర బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టిన ఘ‌న‌త రోశ‌య్యది. ఆయ‌న రాజ‌కీయ జీవితంలో  మొత్తం 16 సార్లు బ‌డ్జెట్‌ను  ప్ర‌వేశ‌పెట్టారు. ఇందులో రాష్ట్ర  ఆర్థిక మంత్రిగా 15 సార్లు బ‌డ్జెట్‌ను  ప్ర‌వేశ‌పెట్టారు. అలాగే, రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా కొన‌సాగుతున్న స‌మ‌యంలోనూ ఒక‌సారి రాష్ట్ర  బ‌డ్జెట్‌ను అసెంబ్లీలో ప్ర‌వేశ‌పెట్టారు. ఇక కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బ‌డ్జెట్‌ల‌ను ఇన్ని సార్లు ప్ర‌వేశ‌పెట్టిన మ‌రో నాయ‌కుడు లేరు. అత్య‌ధిక సార్లు బ‌డ్జెను ప్ర‌వేశ‌పెట్టిన ఘ‌న‌త రోశ‌య్య పేరిట ఉంది. ఆర్థిక మంత్రిగా త‌న‌దైన ముద్ర వేశారు. అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌స్తే ఆర్థిక మంత్రి ఎవ‌రూ?  అనే ప్ర‌శ్న‌కు తిరుగులేని స‌మాధానం కొణిజేటి రోశయ్య పేరును ప్ర‌స్తావించేవారు అంటే ఆర్థిక మంత్రిగా ఏ ప‌నితీరు ఏ స్థాయిలో ఉండేదో ఇట్టే అర్థ‌మ‌వుతుంది. 

Also Read: ఒమిక్రాన్ వేరియంట్‌.. కేంద్రం కీల‌క వ్యాఖ్య‌లు
 
అలాగే, ఆంధ‌ప్ర‌దేశ్ రాష్ట్ర బ‌డ్జెట్‌ను మొత్తం 16 సార్లు ప్ర‌వేశ‌పెట్టిన కొణిజేటి రోశ‌య్య..  ఓ ద‌శ‌లో వ‌రుస‌గా ఏడు సార్లు బ‌డ్జెట్‌ను స‌మ‌ర్పించ‌డం గ‌మ‌నార్హం.  రాష్ట్ర శాశ‌నమండ‌లి, శాశ‌స‌న స‌భ‌ల్లోనూ త‌న‌దైన  వాక్చాతూర్యంతో హుందాగా న‌డుచుకునేవారు. తనదైన వాగ్ధాటితో విమర్శలను తిప్పికొట్టేవారు. 1984లో ఉమ్మ‌డి రాష్ట్రంలో ఏర్ప‌డి నంద‌మూరి తార‌క‌రామ‌రావు  ప్ర‌భుత్వం.. శాశాన మండ‌లిని ర‌ద్దు చేయ‌డానికి రోశ‌య్య కూడా ఓ కార‌ణ‌మ‌ని రాజ‌కీయాల్లో మాట‌. ఎందుకంటే త‌న‌దైన శైలీలో వ్యంగ్యస్త్రాలు సంధిస్తూ.. నేత‌ల‌కు ద‌డ‌పుట్టించేవారు. మండ‌లిలో రోశ‌య్య‌ను ఎదుర్కోలేక‌నే.. ఎన్‌టీఆర్ మండ‌లిని ర‌ద్దు చేసిన‌ట్లు ఊహాగానాలు వినిపిస్తుంటాయి.  ఇక ఆయ‌న ఇటీవ‌ల త‌న రాజ‌కీయ జీవితం గురించి చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న అభిమానుల‌ను బాధించాయ‌నే చెప్పాలి. నేనిక రిటైర్‌మెంటు తర్వాత రాజకీయాల లోకి మళ్లీరాను అని ఆయ‌న ప్ర‌క‌టించారు.  దానికి అనుగుణంగానే రాజ‌కీయాలు గుడ్ బై చెప్పిన త‌ర్వాత వాటికి దూరంగానే ఉన్నారు. 

Also Read: కాంగ్రెస్‌..బీజేపీల‌తోనే స్థానిక‌ సంస్థల నిర్వీర్యం: మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి

ఆయ‌న ఆరోగ్యం క్షీణించ‌డంతో ఈ ఉద‌యం 8 గంట‌ల స‌మ‌యంలో తుదిశ్వాస విడిచారు. మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య మృతితో రాష్ట్రం ఒక ఆర్ధిక నిపుణుడిని కోల్పోయిందని రాజ‌కీయ నేత‌లు, ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌టిస్తున్నారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు సానుభూతి తెలియ‌జేస్తున్నారు.  ఆయ‌న అంత్య‌క్రియ‌లు ఆదివారం నాడు మ‌హాప్ర‌స్థానంలో నిర్వ‌హించ‌నున్నారు. 

Also Read: ఇది ప్రాజాస్వామ్యమా? అవ్వను అవమానించారు: రాష్ట్ర సర్కారుపై టీడీపీ ఫైర్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios