World Inequality Report: భారత్ లో ఆదాయ, సంపదపరంగా అసమానతలు పెరుగుతున్నాయని వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ రిపోర్టు పేర్కొంది. సగానికి పైగా ఆదాయం 10 శాతం మందిలో కేంద్రీకృతమైన ఉన్నదని పేర్కొంది. పేదల ఆదాయాలు దారుణంగా తగ్గిపోతున్నాయని తెలిపింది.
World Inequality Report: భారత్ లో ఆదాయ, సంపదపరంగా అసమానతలు పెరుగుతున్నాయని వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ రిపోర్టు పేర్కొంది. సగానికి పైగా ఆదాయం 10 శాతం మందిలో కేంద్రీకృతమైన ఉన్నదని పేర్కొంది. ఉన్నత వర్గాల వారి సంపద పెరుగుతుంటే పేదల ఆదాయాలు క్రమంగా తగ్గిపోతున్నాయని వెల్లడించింది. ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రపంచ అసమానతల అధ్యయన సంస్థ (వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్) 2022 నివేదిక వెల్లడించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.. భారత సమాజంలో ఉన్నత వర్గాల సంపద, ఆదాయాలు పెరుగుతుంటే, పేదల ఆదాయాలు, సంపద క్రమంగా తగ్గిపోతున్నది. 2021లో మొత్తం జాతీయ ఆదాయంలో 22 శాతాన్ని భారతదేశంలోని ఒక శాతం సంపన్నులు కలిగి ఉన్నారని నివేదిక పేర్కొంది. అగ్రశ్రేణిలోని మొదటి పది శాతం మంది ఆదాయంలో 57 శాతం కలిగి ఉన్నారని తెలిపింది. వారిలోనూ అత్యున్నత స్థాయిలోని ఒక శాతం 22శాతాన్ని సొంతం చేసుకుంది. దిగువ శ్రేణిలోని 50శాతం కేవలం 13శాతం వాటాతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని నివేదిక తెలిపింది.
Also Read: మొదటగా బూస్టర్ డోసులు అందుకునేది వీళ్లే.. 20 రకాల్లో ఏ వ్యాధి ఉన్నాబూస్టర్ డోసు !
అలాగే, భారతీయుల సగటు ఆదాయాలు సైతం ఆయా వర్గాల్లో భారీ స్థాయిలో వ్యత్యాసాలు ఉన్నాయని వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ 2021 రిపోర్టు పేర్కొంది. దిగువ శ్రేణిలోని 50శాతం జనాభా సగటు ఆదాయం రూ.53,610 ఉండగా, ఉన్నత శ్రేణిలోని 10శాతం దానికన్నా 20 రెట్లు అధికంగా ఉంది. అంటే వీరి సగటు ఆదాయం రూ.11,66,520 గా ఉంది. మొత్తంగా దేశంలో సంపన్నుల తక్కువగా ఉండి.. ఆదాయం అధికంగా వారి వద్దే ఉండటం, పేదలు అత్యధికంగా ఉండి.. వారి వద్ద ఆదాయం తగ్గిపోతుండటం భారత్ లో జరుగుతున్నది. ఈ రెండు వర్గాల మధ్య అసమానతలు భారీ పెరుగుతూ.. తీవ్ర అసమానతల దేశంగా భారత్ నిలుస్తున్నదని ఈ నివేదిక వెల్లడించింది. దీనికి గల కారణాలను సైతం ఈ నివేదిక ప్రస్తావించింది. ఈ క్రమంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సంపన్నులు, పేదల ఆదాయ అసమానతలు భారత్ లో పెరగడానికి 1980ల నుంచి దేశంలో చేపట్టిన ఆర్థిక సంస్కరణల పరిస్థితికి కారణమని వ్యాఖ్యానించింది. 1980తో పోలిస్తే భారత్‌లో ప్రయివేటు వ్యక్తలు సంపద రెట్టింపు అయిందనీ, పేద ప్రజల సంపద మాత్రం తగ్గిపోయిందని వెల్లడించింది.
Also Read: Manikka Vinayagam: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ సింగర్, నటుడు మాణిక్య వినాయగం మృతి
వరల్డ్ ఇనీక్వాలిటీ ల్యాబ్ 2022 నివేదిక భారత కుటుంబాల ఆదాయాలను సైతం ప్రస్తావించింది. దేశంలో కుటుంబాల సగటు సంపద చైనాతో పోలిస్తే సగానికి తక్కువగా ఉంది. దాదాపు భారత కుటుంబ సగటు సంపద రూ.9,83,010. భారతీయ సమాజంలో అగ్రశ్రేణిలోని 10శాతం సగటు సంపద రూ.63,54,070 ఉండగా, వారిలో అత్యున్నత స్థాయిలో ఉన్న ఒక శాతం సంపద రూ.3.25 కోట్లు ఉందని తెలిపింది. అలాగే, మధ్యతరగతి కుటుంబాల సగటు సంపద రూ.7,23,930 గా ఉండగా, దిగువ అంచెలోని 50శాతం సగటు సంపద రూ.66,280 మాత్రమే నంటూ షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఇక కరోనా మహమ్మారి కారణంగా అసమానతలు మరింతగా పెరిగాయని ఈ నివేదిక పేర్కొంది. 2019-21 మధ్య ప్రపంచ కుబేరుల సంపద 50శాతానికిపైగా పెరిగింది. అయితే, పేద, మధ్యతరగతుల ఆదాయాలు దారుణంగా తగ్గిపోయాయి. కరోనా వైరస్ కారణంగా ప్రభుత్వాలకు ఆరోగ్యసంరక్షణ ఖర్చులు అధికంగా పెరిగాయి. లాక్‌డౌన్ల వల్ల పన్నుల ఆదాయాలు తగ్గిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆదాయ, సంపద అసమానతలు తగ్గించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? అవి ఫలితాలిస్తాయ అనేదానిపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Bandi Sanjay: కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనమిది.. ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్
