Bandi Sanjay: కేసీఆర్ నియంత పాలనకు నిదర్శనమిది.. ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్
Bandi Sanjay: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వెంటనే చేపట్టాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఒక్కరోజు నిరుద్యోగ దీక్షకు పిలుపునిచ్చారు. అయితే, ఉద్యోగాల భర్తీ కోసం బీజేపీ చేపట్టిన నిరుద్యోగ దీక్షకు తరలివస్తున్న విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Bandi Sanjay: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వెంటనే చేపట్టాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఒక్కరోజు నిరుద్యోగ దీక్షకు పిలుపునిచ్చారు. అయితే, ఉద్యోగాల భర్తీ కోసం బీజేపీ చేపట్టిన నిరుద్యోగ దీక్షకు తరలివస్తున్న విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం దుర్మార్గమని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్షకు అడ్డంకులు సృష్టిస్తున్నదంటూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కరోనా వైరస్ నిబంధనలకు లోబడి పార్టీ కార్యాలయంలో దీక్ష చేస్తామంటే ప్రభుత్వానికున్న అభ్యంతరమేంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం నడుచుకుంటున్న తీరును ఆయన ఖండించారున ఈ నేపథ్యంలోనే ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పలు విమర్శలు గుప్పించారు.
Also Read: మహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై బిగుస్తున్న ఉచ్చు.. ఈ వారంలోనే ఛార్జిషీట్ దాఖలు !
ట్విట్టర్ రాష్ట్ర ప్రభుత్వ తీరును ఖండిస్తూ.. ‘‘నిరుద్యోగ దీక్షతో పీఠం కదిలిపోతుందనే భయంతోనే ఈ దుందుడుకు చర్యలకు పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్యబద్దంగా చేపడుతున్న దీక్షకు రాకుండా అడ్డుకోవడం కేసీఆర్ నియంత, అహంకార పాలనకు నిదర్శనం. ఏళ్ల తరబడి ఉద్యో్గాలు రాక దాదాపు 600 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నా కేసీఆర్ కళ్లకు కనిపించడం లేదు. ఉద్యోగం, ఉపాధి కరవై లక్షలాది మంది యువత అల్లాడుతున్నా కళ్లుండి చూడలేని కబోధిలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. మేధావులు, విద్యావేత్తలు, ప్రజాస్వామిక వాదులంతా ఈ చర్యను ముక్తకంఠంతో ఖండించాలి. నిరోద్యగ యువతీ, యువకుల పక్షాన భాజపా చేపడుతున్న నిరుద్యోగ దీక్షకు రాజకీయాలకు అతీతంగా మద్దతివ్వాలని ప్రజాస్వామిక వాదులను కోరుతున్నా’’ అని బండి సంజయ్ తెలిపారు.
Also Read: Libya: సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చిన 27 మృతదేహాలు..
ఇదిలావుండగా, తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వెంటనే చేపట్టాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఒక్కరోజు నిరుద్యోగ దీక్ష లో మార్పులు చేశారు. దీక్షను ముందుగా ప్రకటించినట్టుగా ఇందిరాపార్కు వద్ద కాకుండా నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయానికి మార్చినట్టు వెల్లడించారు. భాజపా కార్యాలయం ఆవరణలో నిరుద్యోగ దీక్ష చేయనున్నామనీ, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని సంజయ్ ప్రకటించారు. కాగా, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) నిరుద్యోగుల కోసమంటూ తలపెట్టి దీక్ష.. సిగ్గులేని దీక్ష అని టీఆర్ఎస్ (TRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KTR) మండిపడ్డారు. ఉపాధి కల్పనలో మా నిబద్ధతను ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీ (BJP)కి లేదని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాల కల్పనపై టీఆర్ఎస్ (trs) ప్రభుత్వ చిత్తశుద్ధి, ఉపాధి అవకాశాల విషయంలో బీజేపీ వైఫల్యాలపై మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాసారు. ఇందులో ఆయనపై ఘాటు వ్యాఖ్యలు సైతం చేశారు.
Also Read: నకిలీ అధికారుల డ్రగ్ కేసు బెదిరింపులు.. భయంతో యువ నటి ఆత్మహత్య