Asianet News TeluguAsianet News Telugu

Manikka Vinayagam: సినీ పరిశ్రమలో మ‌రో విషాదం.. ప్రముఖ సింగర్, నటుడు మాణిక్య వినాయగం మృతి

Manikka Vinayagam: సినీ పరిశ్రమలో మ‌రో  తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్ర‌ముఖ సింగర్, నటుడు మాణిక్య వినాయగం (73) క‌న్నుముశారు. గ‌త కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న ఆరోగ్యం మ‌రింత‌గా క్షీణించ‌డంతో ఆదివారం నాడు తుదిశ్వాస విడిచారు. 
 

Playback singer & actor Manikka Vinayagam passes away
Author
Hyderabad, First Published Dec 27, 2021, 3:23 AM IST

Manikya Vinayagam: సినీ పరిశ్రమలో మ‌రో  తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత సింగర్, నటుడు మాణిక్య వినాయగం  క‌న్నుముశారు. 73 సంవ‌త్స‌రాల మాణిక్య వినాయ‌గం గ‌త కొంత కాలంగా తీవ్ర అనారోగ్యం బాధ‌ప‌డుతున్నారు. ఆయ‌న ఆరోగ్యం మ‌రింత‌గా క్షీణించ‌డంతో ఆదివారం తుదిశ్వాస విడిచారు.  నేప‌థ్య గాయ‌కుడిగానే కాకుండా అనేక చిత్రాల్లో న‌టించి మంచి న‌టుడిగా గుర్తింపు పొందారు. ద‌క్షిన భార‌త రాష్ట్రమైన త‌మిళ‌నాడులోని మైలాడుతురైలో  1943 డిసెంబరు 10న మాణిక్య విన‌య‌గం జన్మించారు. అత‌ని మేన‌మామ‌, ప్రమఖ సింగర్ ఎస్‌ జయరామన్ వ‌ద్ద  సంగీతం నేర్చుకున్నాడు. 2001 నుంచి సినీ రంగంలో తన సత్తా చాటుతూ.. ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

Also Read: Bandi Sanjay: కేసీఆర్‌ నియంత పాలనకు నిదర్శన‌మిది.. ప్ర‌భుత్వంపై బండి సంజయ్ ఫైర్

2001లో సియాన్ విక్రమ్ క‌థానాయ‌కుడిగా వ‌చ్చిన దిల్ అనే త‌మిళం సినిమాలోని సూపర్ హిట్ పాట "కన్నుక్కుల్ల కెలుతి"తో మాణిక్య వినాయగం ప్లేబ్యాక్ సింగర్‌గా అరంగేట్రం చేశారు.  సినీ ప‌రిశ్ర‌మ‌లో అప్ప‌టి నుంచి సింగ‌ర్ గా త‌న‌దైన ముద్ర‌వేస్తూ..  దాదాపు దక్షిణాది అన్ని భాషల్లో తన గాత్రాన్ని వినిపించారు. ఇప్పటి వరకు సుమారు 800లకిపైగా సాంగ్స్ పాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఒక్క‌ సినిమా పాటలే కాకుండా  ఆధ్యాత్మిక, జానపద గీతాలను కూడా మాణిక్య వినాయ‌గం పాడారు. జానపద పాటలు, ఆధ్యాత్మిక పాటలతో కలిపి 15,000 పాటలకు పైగా  పాడారు. దిల్, తవసి,  కన్నతిల్ ముత్తమిట్టల్, రన్,  రోజా కూట్టం, జయం,  ఇయార్కై,  ఒట్రాన్, పార్థిబన్ కనవు, అరుల్, చంద్ర‌ముఖి, సింగం వంటి సూప‌ర్ హిట్ చిత్రాలకు ఆయ‌న గాత్రం అందించారు. ఇక తెలుగుతో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ సినిమాలో ‘పట్టుపట్టు చేయ్యే పట్టు’ పాటతో ఆకట్టుకున్నారు. ఇదే కాకుండా తెలుగులో చాలా పాట‌లే పాడారు.

Also Read: మ‌హారాష్ట్ర మాజీ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై బిగుస్తున్న ఉచ్చు.. ఈ వారంలోనే ఛార్జిషీట్ దాఖ‌లు !

మాణిక్య వినాయ‌గం సినీ ప‌రిశ్ర‌మ‌లో కేవ‌లం పాట‌లు పాడ‌టానికే ప‌రిమితం కాలేదు.  నటుడిగాను తన సత్తా చూపించి ప్రేక్షకులను మెప్పించారు.  అనేక చిత్రాలలో న‌టించి మంచి నటుడిగానూ గుర్తింపు తెచ్చుకున్నారు. ధనుష్, విశాల్, విజయ్, సూర్య, జయం రవి, అర్జున్ వంటి అనేక మంది ప్రముఖ నటీనటుల‌తో క‌లిసి న‌టించాడు. 2003లో ధనుష్ హీరోగా వ‌చ్చిన  తిరుడ తిరుడి చిత్రంలో ధనుష్ తండ్రి పాత్రలో న‌టించి అద్భుతమైన నటుడని నిరూపించుకున్నారు మాణిక్య వినాయ‌గం. కంబిరం, పెరళగన్, గిరి, అరివుమణి, బోస్, కాల్వనిన్ కడలి వంటి చిత్రాల్లో నటించారు. ప్లేబ్యాక్ సింగర్, యాక్టర్, మంచి వ్య‌క్తిత్వం ఉన్న వ్య‌క్తిగా పేరు సంపాదించుకున్న మాణిక్య వినాయ‌గం చివరిగా 2017లో వెండితెర‌పై క‌నిపించారు. అప్ప‌టి నుంచి అనారోగ్యం కార‌ణంగా సినిమాల‌కు దూరంగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న ఆరోగ్యం మ‌రింత‌గా క్షీణించి క‌న్నుమూశార‌నే షాకింగ్ న్యూస్ విని అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.  మాణిక్య వినాయగం మృతి పట్ల తమిళనాడు సీకం స్టాలిన్‌‌తోపాటు సినీ రంగానికి చెందిన ఎంతోమంది సోషల్ మీడియాలో తమ సంతాపం తెలియజేశారు.

Also Read: Libya: సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చిన 27 మృతదేహాలు..

Follow Us:
Download App:
  • android
  • ios