india pakistan: పాకిస్థాన్ దాడులపై తీవ్రంగా స్పందించిన మాజీ జమ్మూ కాశ్మీర్ డీజీపీ ఎస్పీ వైద్.. ఇది పూర్తి స్థాయి యుద్ధంలా కనిపిస్తోందని అన్నారు.
india pakistan: భారత సరిహద్దుల వద్ద పాకిస్థాన్ చర్యలపై మాజీ జమ్మూ కాశ్మీర్ డీజీపీ ఎస్పీ వైద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పాకిస్థాన్ చేపట్టిన చర్యలు సంపూర్ణ యుద్ధానికి సంకేతంగా కనిపిస్తున్నాయని అన్నారు
ఇది సాధారణంగా జరగే దాడుల కంటే ఎక్కువ. ఇది ఒక దేశం ప్రకటించే సంపూర్ణ యుద్ధంలా కనిపిస్తోందని వైద్ పేర్కొన్నారు.
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం మే 7 వ తేదీ ఉదయం, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)తో పాటు పాకిస్థాన్ లోపల 9 ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని హై-ప్రెసిషన్ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం.
వీటికి ప్రతిస్పందనగా పాకిస్థాన్ వైమానిక దళాలు డ్రోన్లు, మిసైళ్లతో భారత సైనిక స్థావరాలపై దాడి చేయాలని యత్నించాయి. అయితే భారత వైమానిక నిరోధక వ్యవస్థ (Air Defence System) వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. అంతేకాకుండా, లాహోర్‌లోని ఓ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను కూడా భారత్ నిర్వీర్యం చేసినట్లు రక్షణ శాఖ ప్రకటించింది.
ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, భారత భద్రతా వ్యవస్థ మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇది చిన్నపాటి ఘటన కాదని ఎస్పీ వైద్ హెచ్చరించారు.
ప్రస్తుతం పంజాబ్, జమ్మూ ప్రాంతాల్లో రాత్రిపూట బ్లాక్‌ఔట్ అమలులో ఉంది. పాఠశాలలు, కాలేజీలు మూసివేయబడ్డాయి. ప్రజలను ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అంతరాష్ట్ర రవాణా పాక్షికంగా నిలిపివేయబడిన విషయం తెలిసిందే.


