Omicron | అదే జరిగితే రోజుకు 14 లక్షల కేసులు.. ఒమిక్రాన్‌పై కేంద్రం హెచ్చరికలు

Omicron: ద‌క్షిణాఫ్రికాలో గ‌త నెల‌లో వెలుగచూసిన క‌రోనా మ‌హ‌మ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప‌లు దేశాల్లో పంజా విసురుతోంది. భార‌త్ లోనూ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు క్ర‌మంగా పెరుగుతుండ‌టంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. దేశంలో ప‌రిస్థితులు దిగ‌జారితే రోజుకు 14 ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యే అవ‌కాశ‌ముంద‌ని కేంద్రం హెచ్చ‌రింది. 

India could see 14 lakh cases per day

Omicron: ప్ర‌పంచ దేశాల్లో క‌రోనా మ‌హమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పంజా విసురుతోంది. ఈ ర‌కం కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. ప‌లు దేశాల్లో ప‌రిస్థితుల‌ను దారుణంగా మార్చింది. భార‌త్‌లోనూ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిత్యం ఈ కేసులు వెలుగుచూస్తూ.. రోజురోజుకూ పెరుగుతుండటంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే కేంద్ర ఆరోగ్య శాఖ ఒమిక్రాన్ విజృంభ‌ణ నేప‌థ్యంలో కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. దేశంలో రోజుకు 14 ల‌క్ష‌ల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యే అవ‌కాశాలున్నాయంటూ హెచ్చ‌రించ‌డంపై స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మవుతోంది. వివ‌రాల్లోకెళ్తే.. క‌రోనా వైర‌స్ కేసులు స్వ‌ల్పంగా పెరుగుతూ.. అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండ‌టంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఈ క్ర‌మంలోనే ప‌లు హెచ్చరిక‌లు చేస్తూ.. క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించాల‌నీ, జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించింది.

Also Read: CM KCR: 23న వ‌న‌ప‌ర్తికి కేసీఆర్‌.. సీఎం జిల్లా పర్యటన షెడ్యూల్‌లో మార్పులు

భార‌త్ లో ఇప్ప‌టివ‌ర‌కు 11 రాష్ట్రాల్లో 100కు పైగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు బయటపడ్డాయని వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ‌..  ప్రస్తుతం యూప‌ర్ దేశాలైన బ్రిటన్‌, ఫ్రాన్స్‌ తరహా పరిస్థితులు భారత్‌లోనూ ఏర్ప‌డితే దారుణ ప‌రిస్థితులు ఉంటాయ‌ని తెలిపింది. దీనిపై కోవిడ్ టాస్క్ ఫోర్స్ చీఫ్ డాక్ట‌ర్ వీకే పాల్ మాట్లాడుతూ.. నిత్యం ల‌క్ష‌ల్లో కేసులు వెలుగుచూసే అవ‌కాశ‌ముంద‌ని అన్నారు. యూకే తరహా పరిస్థితులు ఏర్పడితే భారత్‌లో రోజుకు 14 లక్షలకు పైగా క‌రోనా వైరస్  కేసులు న‌మోద‌వుతాయ‌ని తెలిపారు. అలాగే,  ఫ్రాన్స్‌లా  ప‌రిస్థితులు మారితే రోజుకు 13 లక్షల కేసులు వెలుగుచూస్తాయ‌ని వెల్ల‌డించ‌డంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. "యూకేలో క‌రోనా వ్యాప్తి ని  పరిశీలిస్తే.. అక్క‌డి ప‌రిస్థితులు భారత్‌లో  ఏర్ప‌డితే..  మన జనాభాను బట్టి ప్రతిరోజూ 14 లక్షల క‌రోనా కేసులు నమోదవుతాయి.. ఫ్రాన్స్‌లో రోజుకు 65,000 కేసులు బయటపడుతున్నాయి.. అదే స్థాయిలో వ్యాప్తి చెందితే భారత్‌లో మన జనాభాను బట్టి ప్రతిరోజూ 13 లక్షల కేసులు నమోదవుతాయి" అని వీకే పాల్ వెల్ల‌డించారు.  అలాగే, యూకేలో రోజువారీ కేసుల్లో కొత్త రికార్డులు నమోదవుతున్నాయ‌నీ, వైర‌స్ వ్యాప్తి అత్యంత వేగంగా ఉంద‌ని తెలిపారు.  శుక్రవారం ఒక్క‌రోజే  అక్కడ 88,042 మంది కొత్తగా వైరస్ బారినపడడగా.. వీటిలో ఒమిక్రాన్ కేసులు 2.4 శాతంగా ఉన్నాయ‌ని వీకే పాల్ వెల్ల‌డించారు. 

Also Read: Amit Shah | కొన్ని తప్పుడు నిర్ణయాలను తీసుకున్నాం.. కానీ.. : అమిత్ షా

యూరోపియ‌న్ దేశాల్లో వ్యాక్సినేష‌న్ ముమ్మ‌రంగా కొన‌సాగించార‌ని  వీకే పాల్ తెలిపారు. ఇప్ప‌టివ‌ర‌కు ఐరోపాలో 80 శాతం మేర పాక్షికంగా వ్యాక్సినేషన్ పూర్తయిన‌ప్ప‌టికీ.. క‌రోనా వైర‌స్  డెల్టా వేరియంట్ ఉద్ధృతి తగ్గడం లేదని అన్నారు. ఈ ర‌కం కేసులు పెరుగుతూనే ఉన్నాయ‌ని పేర్కొన్నారు.  వివిధ దేశాల్లోని ప్ర‌స్తుత క‌రోనా ప‌రిస్థితుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆయ‌న సూచించారు. అలాగే, అనవసర ప్రయాణాలు మానుకోవాలని ప్రజలకు తెలిపారు. క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాలు, నిబంధ‌న‌లు త‌ప్ప‌ని స‌రిగా పాటించానీ, అంద‌రూ టీకాలు తీసుకోవాల‌ని చెప్పారు.  మాస్క్‌ ధరించడం, శానిటైజర్ల వాడాలని వీకే పాల్ అన్నారు.  రద్దీ ప్రాంతాలు, పెద్ద సంఖ్యలో సమూహాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ఇప్ప‌టికే కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల‌కు ప్ర‌ణాళిక‌లు వేసుకుని ఉంటారు.. అయితే, ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో నూతన సంవత్సర వేడుకలను కొద్దిమంది సమక్షంలో జరుపుకొనేలా ఏర్పాట్లు చేసుకోడం అంద‌రికి మంచిద‌ని వీకే పాల్ అన్నారు. 

Also Read: AP: మా ఇళ్లల్లో మేం బతుకుతుంటే ఎందయ్య మీ లొల్లి.. పోలీసులపై చింతమనేని ఫైర్

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios