Amit Shah | కొన్ని తప్పుడు నిర్ణయాలను తీసుకున్నాం.. కానీ.. : అమిత్ షా
Amit Shah : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వ ఏడేండ్ల పాలనలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్న మాట వాస్తవమేనంటూ కుండబద్దలు కొట్టారు. ఫిక్కీ 94వ వార్షిక సర్వసభ్య సమావేశంలో అమిత్ షా ఈ వ్యాఖ్యాలు చేశారు.
Amit Shah : కేంద్ర మంత్రి అమిత్ షా శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని తమ బీజేపీ ప్రభుత్వం ఏడేండ్ల పాలనలో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుందని అమిత్ షా అన్నారు. ప్రభుత్వపరంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నామని ఆయన అంగీకరించారు. Federation of Indian Chambers of Commerce and Industry (ఫిక్కీ) 94వ వార్షిక సర్వసభ్య సమావేశానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. పాలనాపరంగా కొన్ని తప్పుడు నిర్ణయాలను తాము తీసుకున్నామని పేర్కొన్న అమిత్ షా.. తమ ఉద్దేశం మాత్రం తప్పు కాదని స్పష్టం చేశారు. తమ ఉద్దేశం ఎప్పుడూ దేశ ప్రయోజనాలు సంబంధం కలిగి ఉంటాయని అన్నారు. దేశాన్ని కాదని వ్యక్తులు లేదా సంస్థలకు ప్రయోజనాలను కట్టబెట్టాలనేది తమ ఉద్దేశం కాదని పేర్కొన్నారు. ఇప్పటివరకు బీజేపీ మెరుగైన పాలన అందించిందని అన్నారు. అవినీతి రహితంగా పాలన సాగిస్తున్నామని పేర్కొన్నారు.
Also Read: AP: మా ఇళ్లల్లో మేం బతుకుతుంటే ఎందయ్య మీ లొల్లి.. పోలీసులపై చింతమనేని ఫైర్
కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి ఏడేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తమ పాలన విషయాలను కేంద్ర అమిత్ షా ప్రస్తావించారు. బీజేపీ ఏడు సంవత్సరాల ప్రభుత్వ పాలనలో ఏనాడు అవినీతి మాట వినిపించకుండా పాలన సాగించమన్నారు. తమ ప్రభుత్వంపై ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదని పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసే విధంగా తమ పాలన కొనసాగుతున్నదనీ.. అవినీతి మరకకు దూరంగా ఉన్నామని అన్నారు. మున్ముందు కూడా ఇదే తరహా పాలన సాగుతుందని చెప్పారు. కొన్ని నిర్ణయాలు తప్పే అయినప్పటికీ.. తమ ఉద్దేశం సరైనది కావడం వల్ల అవినీతి మరక అంటలేదని అన్నారు. కరోనా మహమ్మరి విజృంభిస్తున్న పరిస్థితుల్లో దేశ ప్రయోజనాలు, ప్రజల సంక్షేమం కోసం పలు విధానపరమైన నిర్ణయాలను తీసుకున్న విషయాలను అమిత్‌షా గుర్తు చేశారు. కరోనా వైరస్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడిందని చెప్పారు. అయితే, కరోనా ప్రభావం తగ్గిన తర్వాత భారత్ రెండంకెల వృద్ధి రేటును అందుకుంటుందని తాను ముందు నుంచీ ఆశిస్తున్నానని అమిత్ షా తెలిపారు.
Also Read: Nara Lokesh | జగన్ పాలన నియంత పాలనకు నిదర్శనం: నారా లోకేష్
కరోనా మహమ్మారి ప్రపంచంలోని అన్ని దేశాలను తీవ్రంగా దెబ్బకొట్టిందని అమిత్‌షా పేర్కొన్నారు. భారత్ పైనా తీవ్ర ప్రభావం చూపింది. అయితే, కరోనా బారిన పడి కోలుకున్న దేశాల్లో భారత్ శరవేగంగా ఆర్థికాభివృద్ధిని సాధించిందని అన్నారు. మరే దేశం కూడా రెండంకెల అభివృద్ధిని అందుకునే పరిస్థితులు లేవని పేర్కొన్నారు. తమ మెరుగైన పాలన కారణంగా ఇది సాధ్యమైందని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ, పారిశ్రామిక రంగం పురోగమించడానికి మూల స్తంభాలుగా భావించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోవడానికి అనేక పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న అనేక పథకాలను మున్ముందు కూడా కొనసాగిస్తామని అమిత్ షా తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఆర్థిక బడ్జెట్ ప్రతిపాదనల్లోనూ ఎంఎస్ఎంఈలకు ప్రాధాన్యత ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. దేశ స్థూల జాతీయోత్పత్తిలో పారిశ్రామిక రంగం వాటా కీలకమైదని అమిత్ షా పేర్కొన్నారు. భారతదేశానికి "ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ"గా మారే అవకాశం ఉందని కూడా ఆయన అన్నారు.
Also Read: NGT: రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణం ఆపండి.. జగన్ సర్కార్‌కు ఎన్జీటీ షాక్