AP: మా ఇళ్లల్లో మేం బతుకుతుంటే ఎందయ్య మీ లొల్లి.. పోలీసులపై చింతమనేని ఫైర్

AP:  తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత, దెంద‌లూరు మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్త చేశారు. మా ఇళ్లల్లో మేం బతుకుతుంటే ఎందయ్య మీ లొల్లి.. అంటూ ఫైర్ పోలీసుల‌పై ఫైర్ అయ్యారు. 
 

Chintamaneni Prabhakar Fires On Ap  police

AP:  తెలుగుదేశం పార్టీ సీనియ‌ర్ నేత, దెంద‌లూరు మాజీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్త చేశారు. మా ఇళ్లల్లో మేం బతుకుతుంటే ఎందయ్య మీ లొల్లి.. అంటూ ఫైర్ పోలీసుల‌పై ఫైర్ అయ్యారు.  ప్ర‌తి చిన్న విష‌యానికి పోలీసులు త‌మ ఇంటికి వ‌స్తుండ‌టంపై ఆయ‌న అసంతృప్తిని వ్య‌క్త చేశారు. త‌న‌దైన శైలీలో పోలీసుల పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  నెలలో ఎన్నిసార్లు వస్తారయ్యా మా ఇంటికి.. మా ఇళ్లల్లో మేం బతుకుతుంటే.. ఎందీ మీ లొల్లి. మీరు మమ్మల్ని ఆపడమేంటంటూ పోలీసుల తీరుని ప్రశ్నించారు చింత‌మ‌నేని. అలాగే, పోలీసులు వ‌చ్చి వెళ్తుండ‌టంపై.. మీరు  ఇక్కడే ఉండండీ.. మాతో పాటూ మీకూ భోజనాలు పెడతామంటూ.. ఎందుకు ఊరికే పోయి రావ‌డం అంటూ త‌నదైన శైలిలో చింతమనేని ప్రభాక‌ర్ పోలీసుల‌తో అన్నారు. ఈ క్ర‌మంలోనే పోలీసుల‌కు, చింత‌మ‌నేనికి మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Also Read: Nara Lokesh | జగన్ పాలన నియంత పాలనకు నిదర్శనం: నారా లోకేష్

ఇదిలావుండ‌గా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిర్మిస్తున్న పోల‌వ‌రం ప్రాజెక్టు నేప‌థ్య‌ంలో వేలాది మంది నిర్వాసితుల‌య్యారు. ఇప్ప‌టికీ అనేక మందికి న‌ష్ట‌ప‌రిహారం, సాయ‌మూ అంద‌ని వారు ఉన్నారు. ఈ నేప‌థ్యంలో తెలుగు దేశం పార్టీ పోల‌వ‌రం నిర్వాసితులకు అండ‌గా నిలుస్తూ.. ప‌లు నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టింది. టీడీపీ చేప‌ట్టిన సంఘీభావ యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్ర‌మంలో పోలీసులు అనేక మంది నాయ‌కుల‌ను అదుపులోకి తీసుకుంటున్నారు.  పశ్చిమగోదావరి జిల్లాలోని టీడీపీ ముఖ్య నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేశారు. ఈ క్ర‌మంలోనే దుగ్గిరాలలో ఉన్న దెందలూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంటికి పోలీసులు వెళ్లారు.  అక్క‌డ పోలీసులకు చింతమనేనికి మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఆయ‌న‌ను హౌస్ అరెస్టు చేస్తుండ‌టంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఎలాంటి ముంద‌స్తు నోటీసులు ఇవ్వ‌కుండా ఇంటికి రావొద్దంటూ చింత‌మ‌నేని పోలీసుల‌పై  ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: NGT: రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణం ఆపండి.. జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఎన్జీటీ షాక్‌

చిత‌మ‌నేని పోలీసుల‌తో "ఎందుకు ఆపుతారు.. ఏం తప్పు చేశారని ఆపుతారు.. " అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఎక్కడైనా  ఉందా ఇదీ.. మా ఇళ్లల్లో మేం బతుకుతుంటే.. మా పనులు మేం చేసుకుంటుంటే మమ్మల్ని ఆపడమేంటండీ.. మీకు వేరే పనుల్లేవా.. మా ఇంటికి ఇలా రావడం మీ ఉద్యోగ ధర్మం కాదు" అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  అలాగే, పోలీసుల  ఉద్యోగ ధర్మం ఇదే అయితే.. ఇక్కడే  మా ఇంట్లో ఉండండి.  మీక్కూడా భోజనం పెడతా.. నెలకి ఎన్నిసార్లు వస్తారు మా ఇళ్లకీ.. అరెస్ట్ చేస్తారా వ్యాన్ ఎక్కుతా తీసుకెళ్లండి" అంటూ పోలీసుల తీరుపై ఫైర్ అయ్యారు. ఈ క్ర‌మంలోనే చింత‌మ‌నేని మీడియాతో మాట్లాడుతూ..  రాజధాని రైతుల ముగింపు సభ, పోలవరం నిర్వాసితులకు సంఘీభావం తెలుపుతామనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇలా ముంద‌స్తు  హౌస్ అరెస్టు చేయడం దుర్మార్గమైన చ‌ర్య అని అన్నారు. త‌మ‌ను ఎలాంటి కార్య‌క్ర‌మాల‌కు వెళ్ల‌కుండా అడ్డుకోవ‌డ‌మేంట‌ని ప్ర‌భుత్వ‌న్ని ప్ర‌శ్నించారు. రానున్న ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు వైకాపాకు  బుద్ది  చెబుతార‌ని చింతమనేని  అన్నారు. 

Also Read: Data protection Bill: పార్లమెంట్ ముందుకు డేటా ప్రొటెక్షన్ బిల్లు.. కీల‌క అంశాలివిగో..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios