భారత్‌లో లక్షదిగువకు క్రియాశీల కేసులు.. మరోవైపు ఒమిక్రాన్ ఆందోళనలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా (Coronavirus) విజృంభణ కొనసాగుతోంది. మరీ ముఖ్యంగా ఇటీవల వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ (Omicron) కారణంగా సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పలు దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటం కలకలం రేపుతోంది. అయితే, భారత్‌లో క్రియాశీల కేసులు లక్ష దిగువకు చేరడం ఊరట కలిగిస్తోంది.
కరోనా మహమ్మారి (Coronavirus) అన్ని దేశాల్లోనూ తన ప్రభావాన్ని పెంచుకుంటున్నదని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. మరీ ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో వెగులుచూసిన ఒమిక్రాన్ (Omicron) కేసులు గణనీయంగా పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్‌లోనూ ఈ రకం కేసులు వెగులు చూడటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమై వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి. అయితే, ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసులు లక్ష దిగువకు చేరటం కొద్దిగా ఊరట కలిగించే అంశం. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన కరోనా వైరస్ వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 8,603 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజుతో పోలిస్తే కొత్త కేసుల్లో తగ్గుముఖం పట్టాయి. తాజాగా నమోదైన కోవిడ్ కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,24,360 చేరింది.
Also Read: ఆర్థిక చాణక్యుడు.. అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన రోశయ్య
అలాగే, గత 24 గంటల్లో కరోనా వైరస్‌తో పోరాడుతూ 415 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య 4,70,530కి పెరిగింది. ఇదే సమయంలో కొత్తగా 8,190 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో కోవిడ్-19 నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,40,53,856కు పెరిగింది. క్రియాశీల కేసులు సైతం తగ్గుతుండటం కొద్దిగా ఊరట కలిగించే అంశం. ప్రస్తుతం దేశంలో 99,974 యాక్టివ్ కేసులు ఉన్నాయి. క్రియాశీల రేటు 0.29 శాతానికి చేరగా.. రికవరీ రేటు 98.35 శాతంగా ఉందని కేంద్రం వెల్లడించింది. మరణాల రేటు 1.36 శాతంగా ఉంది. ఇక దేశంలో ఇప్పటివరకు మొత్తం 64,60,26,786 కరోనా శాంపిళ్లను పరీక్షించినట్టు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) వెల్లడించింది. శనివారం ఒక్కరోజే 12,52,596 కరోనా పరీక్షలు నిర్వహించినట్టు తెలిపింది. ఇక ఒమిక్రాన్ వేరియంట్ ఇతర దేశాల్లో పంజా విసురుతుండటంతో భారత్ అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. ఇప్పటివరకు మొత్తం 73.6 లక్షల మంది టీకాలు వేశారు. మొదటి, రెండు డోసులు కలిపి మొత్తం 126 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశారు.
Also Read: ఆర్థిక మంత్రిగా సరికొత్త ఒరవడిని తీసుకొచ్చిన కొణిజేటి రోశయ్య.. రాజకీయ ప్రస్థానం..
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ భయాందోళనలు..
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ భయాందోళనలు నెలకొన్నాయి. దక్షిణాఫ్రికాలో వెగులుచూసిన కరోనా మహమ్మారి (PANDEMIC) కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రెట్టింపు వేగంతో వ్యాపిస్తున్నదని నిపుణులు చెబుతున్నారు. రోజుల వ్యవధిలోనే దక్షిణాప్రికాలు కొత్త కేసులు రెట్టింపు స్థాయికి పెరిగాయనీ, నాల్గోవేవ్ సైతం వచ్చే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. ఇదిలావుండగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం క్రమంగా పెరుగుతున్నది. అన్ని దేశాల్లో కలిపి ఇప్పటివరకు మొత్తం 265,228,748 కేసులు నమోదయ్యాయి. అలాగే, 5,258,927 మంది వైరస్‌తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారినపడ్డ 239,023,337 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా (COVID-19) కేసులు, మరణాలు అధికంగా నమోదైన దేశాల జాబితాలో అమెరికా, భారత్, బ్రెజిల్, యూకే, రష్యా, టర్కీ, ఫ్రాన్స్, ఇరాన్, జర్మనీ, అర్జెంటీనాలు టాప్-10లో ఉన్నాయి.
Also Read: ఒమిక్రాన్ వేరియంట్.. కేంద్రం కీలక వ్యాఖ్యలు
Also Read: కాంగ్రెస్..బీజేపీలతోనే స్థానిక సంస్థల నిర్వీర్యం: మంత్రి జగదీష్ రెడ్డి