Asianet News TeluguAsianet News Telugu

ఒమిక్రాన్ వేరియంట్‌.. కేంద్రం కీల‌క వ్యాఖ్య‌లు

యావ‌త్ ప్ర‌పంచం ఇప్పుడు క‌రోనా మ‌హ‌మ్మారితో పోరాడుతోంది.  తాజాగా ద‌క్షిణాఫ్రికాలో వెగులుచేసిన క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై స‌ర్వ‌త్రా ఆందోళ‌న‌లు వ్య‌క్తవ‌ముతున్నాయి. ఈ నేప‌థ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒమిక్రాన్ వేరియంట్, టీకాలపై పలు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. 
 

No evidence to suggest existing vaccines don't work on Omicron
Author
Hyderabad, First Published Dec 3, 2021, 5:08 PM IST

క‌రోనా మ‌హ‌మ్మారిని (COVID-19) ఎదుర్కొవ‌డానికి టీకాలు సైతం అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా ఈ వైర‌స్ యావ‌త్ ప్ర‌పంచాన్ని గ‌జ‌గ‌జ వ‌ణికిస్తోంది. ఇప్ప‌టికీ కొట్లాది మందికి సోకిన క‌రోనా.. ల‌క్ష‌లాది మంది ప్రాణాలు బ‌లితీసుకుంది. టీకాలు అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత దీని ప్ర‌భావం కాస్త త‌గ్గిన‌ట్టు క‌న‌బ‌డింది. కానీ వైర‌స్ అనేక మార్పులు చెందుతూ మానవ స‌మాజాన్ని స‌వాలు చేస్తోంది. ఇప్ప‌టికే అనేక మార్పులకు లోనై ప‌లు ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్లు విజృంభిస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ద‌క్షిణాఫ్రికాలో న‌వంబ‌ర్‌లో వెలుగుచూసిన క‌రోనా ఒమిక్రాన్ వేరియంట్‌పై  (Omicron variant)స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. దీనికి ప్ర‌ధాని కార‌ణం ఈ వేరియంట్ ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్లుగా గుర్తించిన వాటికంటే అధికంగా పంజా విస‌ర‌డ‌మే. దీని కార‌ణంగా ఇప్ప‌టికే అనేక దేశాలు ఆంక్ష‌లు విధించాయి. 

Also Read: కాంగ్రెస్‌..బీజేపీల‌తోనే స్థానిక‌ సంస్థల నిర్వీర్యం: మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి

ఇక ఒమిక్రాన్ వేరియంట్ కేసులు భార‌త్ లోనూ న‌మోదుకావ‌డంతో క‌ల‌వ‌రం మొద‌లైంది. వైర‌స్ క‌ట్ట‌డికి త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్న ప్ర‌భుత్వం.. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్‌.. క‌రోనా టీకాల‌పై ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. SARS-CoV-2 ఒమిక్రాన్ వేరియంట్‌పై ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్‌లు పనిచేయవని సూచించడానికి ఎటువంటి ఆధారాలు లేవని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. అయితే, కొన్ని ఉత్ప‌రివ‌ర్త‌నాల కార‌ణంగా కొద్దిమేర సామ‌ర్థ్యం త‌గ్గవ‌చ్చున‌ని పేర్కొంది.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఒమిక్రాన్‌పై భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్న‌ప్ప‌టికీ.. కొత్త వేరియంట్ కు సంబంధించి పూర్తి డేటా అందుబాటులో లేద‌ని తెలిపింది. ఒమిక్రాన్ వ్యాప్తి, ప్ర‌భావం వంటి ప‌లు అంశాల‌కు సంబంధించిన డేటా కోసం చేస్తున్నామ‌ని వెల్ల‌డించింది. ఒమిక్రాన్‌ను ఆందోళ‌న‌ర‌మైన వేరియంట్‌గా WHO  ప్ర‌క‌టించింది. ఈ కొత్త వేరియంట్ కేసులు క‌ర్నాట‌క‌లో రెండు న‌మోద‌య్యాయ‌ని తెలిపింది.  ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్‌లు ఒమిక్రాన్ వేరియంట్‌కు వ్యతిరేకంగా పనిచేస్తాయా? లేదా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, "ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్‌లు ఒమిక్రాన్‌కు వ్య‌తిరేకంగా పని చేయవని సూచించడానికి ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ, స్పైక్ జన్యువుల గురించి నివేదించబడిన కొన్ని ఉత్పరివర్తనలు ఇప్పటికే ఉన్న వ్యాక్సిన్‌ల సామర్థ్యాన్ని తగ్గించవచ్చు" అని మంత్రిత్వ శాఖ తెలిపింది. 

Also Read: ఇది ప్రాజాస్వామ్యమా? అవ్వను అవమానించారు: రాష్ట్ర సర్కారుపై టీడీపీ ఫైర్

ఒమిక్రాన్‌పై ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న ప్రాథ‌మిక డేటా ప్ర‌కారం.. ఇది అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్ అని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇందులో స్పైక్ జ‌న్యులు అధికంగా ఉండ‌టం వ‌ల్ల ఇది వ్యాక్సిన్ల‌ను త‌ట్టుకోవ‌డంతో పాటు రెట్టింపు వేగంతో వ్యాప్తి చేందే అవ‌కాశ‌ముంద‌ని అంచ‌నాలున్నాయి. ఏదేమైన‌ప్ప‌టికీ.. స‌హ‌జంగా ఉన్న రోగ నిరోధ‌క శ‌క్తి, టీకాలు తీసుకోవ‌డం వ‌ల్ల వైర‌స్ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది కాబ‌ట్టి వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల్సిన అవ‌స‌రాన్ని నొక్కి చెబుతున్నారు. ప్ర‌జ‌లంద‌రికీ టీకాలు ఇవ్వ‌డం వ‌ల్ల మ‌ర‌ణాల‌ను త‌గ్గించ‌వ‌చ్చ‌ని నిపుణులు సూచిస్తున్నారు.  అర్హులైన అంద‌రూ టీకాలు వేసుకోవాల‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. 

Also Read: హీట్ పుట్టిస్తున్న పంజాబ్ రాజ‌కీయం.. పొత్తుల్లో అమరీందర్ దూకుడు

ఒమిక్రాన్ వ్యాధి తీవ్ర‌త ఏ స్థాయిలో ఉంటుందో ఇంకా తెలియ‌లేద‌ని మంత్రిత్వ శాఖ పేర్కొంది.  ప్ర‌స్తుతం ఉప‌యోగిస్తున్న క‌రోనా ప‌రీక్ష‌లు ఈ వేరియంట్‌ను గుర్తించవ‌చ్చా? అనే ప్ర‌శ్న‌కు SARS-CoV2 నిర్ధారణకు అత్యంత ప్ర‌మాణికంగా ఆమోదించబడిన, సాధారణంగా ఉపయోగించే RT-PCR పద్ధతి స‌రిపోతుంద‌ని పేర్కొంది. ప్ర‌స్తుత ప‌రిస్థితులో క‌రోనా మార్గ‌ద‌ర్శ‌కాలు పాటించ‌డం, మాస్కులు ధ‌రించ‌డం ముఖ్య‌మ‌ని తెలిపింది. అంద‌రూ జాగ్ర‌త్తలు తీసుకోవాలనీ, టీకాలు సైతం వేయించుకోవాల‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. 

Also Read: రైతు ఉద్యమం ఆగదు.. పెండింగ్ డిమాండ్లు నెరవేర్చాల్సిందే..

Follow Us:
Download App:
  • android
  • ios