హిమాచల్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. వాహనం లోయలో పడి ఐదుగురు మృతి, నలుగురికి గాయాలు

హిమాచల్ ప్రదేశ్ లో మరో వాహనం లోయలో పడిపోయింది. మండి జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. మరో నలుగురికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన తరువాత డ్రైవర్ అక్కడి నుంచి పారారయ్యాడు.

In a serious road accident in Himachal Pradesh, five people were killed and four were injured when the vehicle fell into the valley..ISR

హిమాచల్ ప్రదేశ్ లోని ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం రాత్రి మండి జిల్లాలోని సుందర్‌నగర్-కర్సోగ్ రహదారిపై ఖుషాలా సమీపంలో ఓ వాహనం లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతులను సుందర్ నగర్ కు చెందిన లాలా రామ్ (50), రూప్ లాల్ (55), సునీల్ కుమార్ (35), గోవింద్ రామ్ (60), మోహ్నా (55)గా గుర్తించారు.

భవిష్యత్తులో చంద్రుడిపై నివసించవచ్చు - చంద్రయాన్ - 3 ప్రయోగం నేపథ్యంలో ప్రధాని మోడీ

ఈ వాహనం లో ఉన్న వారందరూ సుందర్ నగర్ లోని కమ్రునాగ్ ఆలయాన్ని సందర్శించి తిరిగి తమ ఇళ్లకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడని దీంతో ప్రమాదం జరిందని తెలుస్తోంది. అయితే ఆ డ్రైవర్ గాయాలతో ప్రాణాప్రాయం నుంచి బయటపడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. 

ఇదెక్కడి విడ్డూరం.. 35 రోజుల కిందట గుండెపోటుతో ఎస్ఐ మృతి.. బదిలీ కావాలంటూ ఇప్పుడు ఆర్డర్స్

గురువారం రాత్రి సిమ్లా జిల్లాలోని కుమార్‌సైన్ తహసీల్‌లోనూ ఓ ప్రమాదం జరిగింది. కుమార్‌సైన్-కీర్తి లింక్ రోడ్డులో ఓ వాహనం లోయలో పడిపోయింది. ఈ ఘటనలో రాకేష్ కుమార్ (32) అనే వ్యక్తి మరణించాడు. గత నెల 28వ తేదీన ఇదే జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు చనిపోయారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సిమ్లాలోని రాంపూర్ ప్రాంతంలో 28వ తేదీన ఉదయం సమయంలో ఓ కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు.

ప్రధాని మోడీకి అరుదైన గౌరవం.. అత్యున్నత పౌర, సైనిక పురస్కారాన్ని ప్రదానం చేసిన ప్రాన్స్..

ఇందులో ఓ బాలిక కూడా ఉంది. అయితే ఆ కారు భద్రాష్-రోహ్రు లింక్ రోడ్డులో షాలున్ కైచీ సమీపానికి చేరుకోగానే ఓ లోతైన లోయలో పడిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఈ లోపు స్థానికులు కూడా అక్కడికి వచ్చారు. స్థానికుల సాయంతో కారులో ఇరుక్కొని ప్రాణాలతో ఉన్న బాలికను బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయారని పోలీసులు గుర్తించారు. గాయపడిన బాలికను సమీపంలోని హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం తీసుకెళ్లామని రాంపూర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ జైదేవ్ సింగ్ తెలిపారు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios