Asianet News TeluguAsianet News Telugu

ఇదెక్కడి విడ్డూరం.. 35 రోజుల కిందట గుండెపోటుతో ఎస్ఐ మృతి.. బదిలీ కావాలంటూ ఇప్పుడు ఆర్డర్స్

దాదాపు 35 రోజుల కిందట చనిపోయిన ఓ ఎస్ఐను మరో స్టేషన్ కు బదిలీ కావాలంటూ పోలీసులు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు పలు వాట్సప్ గ్రూపుల్లో బాగా సర్క్యులేట్ అయ్యింది. దీంతో అధికారులు ఆ ఉత్తర్వులను సవరించి, మళ్లీ విడుదల చేశారు. 

What is ironic here.. SI died of heart attack after 35 days.. Now orders for transfer..ISR
Author
First Published Jul 14, 2023, 9:36 AM IST

ఓ ఎస్ఐ 35 రోజుల కిందట గుండెపోటుతో మరణించాడు. అయితే ఆయనకు ఇప్పుడు తాజాగా బదిలీ ఉత్తర్వులు అందాయి. అందులో ఇప్పుడు పని చేస్తున్న పోలీస్ స్టేషన్ నుంచి మరో స్టేషన్ కు బదిలీ కావాలంటూ అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ ఉత్తర్వులు పోలీసు అధికారుల వాట్సప్ గ్రూపుల్లో బాగా సర్క్యులేట్ అయ్యింది.

ఆద్యంతం ఉత్కంఠభరితం.. నేడే చంద్రయాన్ - 3 ప్రయోగం.. శ్రీహరి కోట నుంచి నింగిలోకి.. పూర్తి వివరాలివే..

వివరాలు ఇలా ఉన్నాయి. బి. ప్రభాకర్ రెడ్డి అనే ఎస్ఐ దుండిగల్ పోలీసు స్టేషన్ లో విధులు నిర్వర్తించేవారు. అయితే ఆయనకు గుండెపోటు వడం వల్ల జూన్ 8వ తేదీన మరణించాడు. ఆయన మృతి చెంది దాదాపు నెల రోజులకు పైగా అయ్యింది. ఇదిలా ఉండగా.. తాజాగా సైబరాబాద్ పరిధిలోని పలువురు ఎస్ఐలను ట్రాన్స్ ఫర్ చేస్తూ పోలీసులు ఉన్నతాధికారులు ఉత్తర్వులు విడుదల చేశారు.

'ఢిల్లీ వాసులారా మేల్కోండి.. ఉచితాలకు పోతే.. పరిస్థితులు ఇలానే ఉంటాయి'

అధికారులు విడుదల చేసిన 83 మంది ఎస్ఐల జాబితాలో గత నెలలో చనిపోయిన బి.ప్రభాకర్ రెడ్డి పేరు కూడా ఉంది. ఆయనను జీనోమి వ్యాలీ స్టేషన్ కు బదిలీ చేస్తున్నట్టు అధికారులు తమ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఈ విషయం కొన్ని వాట్సప్ గ్రూపుల్లో బాగా సర్క్యులేట్ అయ్యింది. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలియడంతో వెంటనే దిద్దుబాటు చర్యలకు పూనుకున్నారు. అంతకు ముందు విడుదల చేసిన లిస్ట్ లో నుంచి ప్రభాకర్ రెడ్డి పేరును తొలగించారు. మరో సారి ఈ బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios