ప్రధాని మోడీకి అరుదైన గౌరవం.. అత్యున్నత పౌర, సైనిక పురస్కారాన్ని ప్రదానం చేసిన ప్రాన్స్..

ప్రధాని నరేంద్ర మోడీకి ప్రాన్స్ తన అత్యున్నత పౌర, సైనిక పురస్కారం అయిన ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ హానర్’ను ఇచ్చి సత్కరించింది. ఈ అవార్డు అందుకున్న తొలి భారత ప్రధానిగా ఆయన చరిత్ర నెలకొల్పారు. 

A rare honor for Prime Minister Modi.. France awarded its highest civilian and military award..ISR

ప్రధాని నరేంద్ర మోడీకి అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్ తన అత్యున్నత పౌర, సైనిక పురస్కారం ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ హానర్’ ను అందజేసింది. ఈ అవార్డును ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రదానం చేశారు. ఈ అవార్డు అందుకున్న తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ రికార్డు సృష్టించారు. దీంతో భారత ప్రజల తరఫున ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ కు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. ఎలిసీ ప్యాలెస్ లో జరిగిన ఈ అవార్డు ప్రదానోత్సవంలో మాక్రాన్ ప్రధాని మోడీకి విందు ఇచ్చారు.

భవిష్యత్తులో చంద్రుడిపై నివసించవచ్చు - చంద్రయాన్ - 3 ప్రయోగం నేపథ్యంలో ప్రధాని మోడీ

‘‘ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ హానర్ ను 13 జూలై 2023 న ఫ్రాన్స్ రిపబ్లిక్ అధ్యక్షుడు గౌరవనీయులు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రదానం చేశారు. భారత ప్రజల తరఫున ఈ అరుదైన గౌరవం ఇచ్చినందుకు అధ్యక్షుడు మాక్రాన్ కు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

భారత-ఫ్రాన్స్ భాగస్వామ్య స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు. ‘‘ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చేతుల మీదుగా ఫ్రాన్స్ లో అత్యున్నత పురస్కారం గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ హానర్ ను ప్రధాని నరేంద్ర మోడీ అందుకున్నారు.’’ అని పేర్కొన్నారు.

గతంలో గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ హానర్ ను ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖ నాయకులు అందుకున్నారు. ఇందులో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా, కింగ్ చార్లెస్ - అప్పటి వేల్స్ ప్రిన్స్, జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ బౌత్రోస్ బౌత్రోస్-ఘాలి తదితరులు ఉన్నారు.

ప్రధాని మోడీకి వివిధ దేశాలు ప్రదానం చేసిన అత్యున్నత అంతర్జాతీయ అవార్డులు, గౌరవాల పరంపరలో ఫ్రాన్స్ ఇచ్చిన ఈ గౌరవం కూడా చేరింది. ప్రధాని నరేంద్ర మోడీ 2023 జూన్ లో ఈజిప్టు ఆర్డర్ ఆఫ్ ది నైల్, 2023లో పపువా న్యూగినియా రాసిన కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ లోగోహు, 2023 మేలో కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజీ, 2023 మేలో రిపబ్లిక్ ఆఫ్ పలావు, 2021లో భూటాన్ ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ గ్యాల్పో, 2020లో అమెరికా ప్రభుత్వం లీజియన్ ఆఫ్ మెరిట్,  2019లో బహ్రెయిన్ నుంచి కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రినైసాన్స్, 2019లో మాల్దీవుల నుంచి ఆర్డర్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూటెడ్ రూల్ ఆఫ్ నిషాన్ ఇజ్జుద్దీన్, 2019లో రష్యా నుంచి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ అవార్డు, 2019లో యూఏఈ నుంచి ఆర్డర్ ఆఫ్ జాయెద్ అవార్డు, 2018లో గ్రాండ్ కాలర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ పాలస్తీనా అవార్డు, 2016లో ఆఫ్ఘనిస్తాన్ నుంచి స్టేట్ ఆర్డర్ ఆఫ్ ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్, 2016లో సౌదీ అరేబియా నుంచి ఆర్డర్ ఆఫ్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ అవార్డులు అందుకున్నారు.

చంద్రయాన్-3.. జూలైలోనే చంద్రుడిపైకి ఎందుకీ ప్రయాణం..? ప్రయోగాన్ని మనం లైవ్ లో చూడాలంటే ఎలా ? పూర్తి వివరాలు

కాగా.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గురువారం (స్థానిక కాలమానం ప్రకారం) పారిస్ లోని తన అధికారిక నివాసం ఎలిసీ ప్యాలెస్ లో ప్రధాని నరేంద్ర మోడీకి విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధానికి మాక్రాన్, ఫ్రెంచ్ ప్రథమ మహిళ బ్రిగిట్టే మాక్రాన్ స్వాగతం పలికారు. రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం గురువారం పారిస్ చేరుకున్న ప్రధానికి విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. విమానాశ్రయంలో ఆయనకు ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బోర్న్ స్వాగతం పలికారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios