1965లో 2 గేదెలు, దూడ దొంగతనం కేసు.. 58 ఏళ్ల తరువాత 78 ఏళ్ల వ్యక్తి అరెస్ట్
58 ఏళ్ల క్రితం జరిగిన పశువుల దొంగతనం కేసులో కర్ణాటకలోని బీదర్ పోలీసులు తాజాగా 78 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. అతడు మరో వ్యక్తితో కలిసి 1965లో 2 గేదెలు, దూడ దొంగతనం చేశాడు. పాత కేసును రీఓపెన్ చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కోర్టులో ప్రవేశపెట్టారు.

అది 1965 సంవత్సరం. కర్ణాటకలోని బీదర్ జిల్లాలోని మెహకర్ గ్రామం. మురళీధర్ రావు కులకర్ణి అనే వ్యక్తి రెండు గేదెలు, ఒక దూడల చోరీ జరిగింది. దీంతో అతడు పోలీసుకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అందులో ఈ దొంగతానికి పాల్పడింది సరిహద్దున ఉణ్న మహారాష్ట్ర మరఠ్వాడా ప్రాంతంలోని ఉదగిర్‌కు చెందిన 30 ఏళ్ల కిషన్ చందర్, 20 ఏళ్ల గణపతి వాఘ్మోర్‌లు అని పోలీసులు గుర్తించారు. పశువులను వాటి యజమానికి అప్పగించారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న బస్సును ఢీకొన్న ట్రక్కు.. 11 మంది మృతి
అనంతరం వారిద్దరిని అరెస్టు చేశారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం వారిద్దరూ బెయిల్ పొంది బయటకు వచ్చారు. తరువాత వారిపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. అయినప్పటికీ వారిద్దరూ కోర్టుకు హాజరుకాలేదు. దీంతో నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. కానీ వారు తప్పించుకొని తిరిగారు. కాగా.. 2006లో కిషన్ చందర్ మరణించాడు. దీంతో అతడిపై పోలీసులు కేసు కొట్టివేశారు.
ఐదేళ్లుగా ప్రేమ.. పెళ్లికి నిరాకరించిన యువతి.. నిప్పంటించుకున్న యువకుడు..
కానీ గణపతిపై కేసు అలాగే ఉంది. అప్పటి నుంచి అతడు పోలీసుల నుంచి తప్పించుకుంటూ, చాలా ఏళ్లుగా అజ్ఞాతంలో జీవిస్తున్నాడు. అయితే పెండింగ్ లో ఉన్న కేసుపై తాజాగా బీదర్ పోలీసులు దృష్టి సారించారు. అందులో భాగంగా ఏ కేసును రీఓపెన్ చేసిన పోలీసులు.. నిందితుడైన గణపతి ఎక్కడున్నాడో గుర్తించారు. ప్రస్తుతం అతడి వయస్సు 78కి చేరుకుంది. అయినప్పటికీ అతడిని అదుపులోకి తీసుకొని పోలీసులు కోర్టులో హాజరుపర్చారు.
కాలేజీ నుంచి తిరిగివస్తున్న విద్యార్థినికి లిఫ్ట్ ఇస్తామని చెప్పి.. సామూహిక అత్యాచారం..
దీనిపై బీదర్ పోలీసు సూపరింటెండెంట్ చన్నబసవన్న ఎస్‌ఎల్ మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న కేసులు పై దృష్టి పెట్టామని తెలిపారు. అందులో భాగంగా కోర్టుకు హాజరుకాని ఎల్‌పీఆర్ కేసుల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ఆ బృందం 58 ఏళ్ల నాటి కేసులో నిందితుడిని అరెస్టు చేసిందని అన్నారు. ఇలాంటి కేసుల్లో ఆ బృందం మొత్తం ఏడుగురిని కనుగొనడంలో విజయం సాధించిందని తెలిపారు. గేదెల దొంగతనం కేసులో ఒకరు మరణించారని చెప్పారు. అయితే గణపతి వాఘ్మోర్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడి వయస్సు దృష్ట్యా బెయిల్ వచ్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.