కాలేజీ నుంచి తిరిగివస్తున్న విద్యార్థినికి లిఫ్ట్ ఇస్తామని చెప్పి.. సామూహిక అత్యాచారం..

కాలేజీని నుంచి తిరిగి వస్తున్న బాలికకు లిఫ్ట్ ఇస్తామని చెప్పి బైక్ ఎక్కించుకున్న ఇద్దరు దుండగులు.. మరో ముగ్గురితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని సహరాన్ పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.

A student who was returning from college was gang-raped after being told to give a lift..ISR

ఆ బాలిక ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కాలేజీకి వెళ్లడం, చదువుకోడం, ఇంటికి రావడం ఇదే ఆమె దినచర్య. అయితే ఎప్పటిలాగే ఆమె మంగళవారం కూడా కాలేజీకి వెళ్లి నడుచుకుంటూ ఇంటికి తిరిగి వస్తోంది. ఈ క్రమంలో తెలిసిన వ్యక్తులు బైక్ పై వచ్చారు. ఇంటి వరకు లిఫ్ట్ ఇస్తామని చెప్పారు. తెలిసిన వారే కదా అని ఆమె బెక్ ఎక్కగా.. ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ వారు మరో ముగ్గురికి తో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.

వివరాలు ఇలా ఉన్నాయి. యూపీలోని సహరాన్ పూర్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఓ బాలిక ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఆమె ప్రతీ రోజూ కాలేజీలో చదువుకునేందుకు జిల్లా కేంద్రానికి వచ్చి తరువాత ఇంటికి వెళ్లేది. మంగళవారం కూడా కాలేజీకి వచ్చి, ఇంటికి వెళ్తోంది. అయితే దారిలో ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చారు. ఇంటి దగ్గర దిగబెడతామని, బైక్ ఎక్కాలని సూచించారు. అంతకు ముందే తెలిసిన వ్యక్తులే కావడంతో వారి ఎలాంటి భయం లేకుండా బైక్ ఎక్కింది.

దీనిని వారు అవకాశంగా తీసుకున్నారు. బైక్ ను నేరుగా ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. కొంత సమయం తరువాత అక్కడికి మరో ముగ్గురు వ్యక్తులు వచ్చారు. వీరంతా కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం దుండగులు బాలికను బైక్‌పై తీసుకెళ్లి క్రాసింగ్ వద్ద వదిలివెళ్లారు, అక్కడ నుండి మైనర్ ఎలాగో సమీపంలోని పోలీసు అవుట్‌పోస్ట్‌కు చేరుకుంది. తనపై జరిగిన లైంగిక దాడిని వారి వివరించింది. 

దీంతో వారు బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకున్నారు. నిందితులపై ఫిర్యాదు చేయడంతో భారతీయ శిక్షాస్మృతిలోని 376 (అత్యాచారం), లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంతో సహా సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టు గంగోహ్ ఏఎస్పీ సాగర్ జైన్ తెలిపారు. బాలికను చికిత్స నిమిత్తం మీరట్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. అలాగే నిందితులైన అంకుర్, అమన్, షావేజ్, సాదిక్, సర్వేజ్‌లను మంగళవారం అరెస్టు చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios