ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న బస్సును ఢీకొన్న ట్రక్కు.. 11 మంది మృతి
రాజస్థాన్ లోని భరత్‌పూర్ జిల్లాలోని హంత్రా ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై ఆగి ఉన్న బస్సును ఓ ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరో 12 మందికి గాయాలు అయ్యాయి.

రాజస్థాన్ లోని జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బస్సును వెనకాల నుంచి వచ్చి ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది మృతి అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో అనేక మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు హాస్పిటల్ కు తరలించారు.
వివరాలు ఇలా ఉన్నాయి. గుజరాత్ నుంచి ఓ ప్యాసింజర్ బస్సు పలువురిని ఎక్కించుకొని మథుర వెళ్తోంది. అయితే ఆ బస్సు జైపూర్-ఆగ్రా రోడ్డులో ప్రయాణిస్తున్న సమయంలో భరత్‌పూర్ జిల్లాలోని హంత్రా సమీపంలో అదుపుతప్పింది. దీంతో ఆ బస్సును హైవేపై ఉంచారు. అయితే వెనకాల నుంచి వేగంగా వచ్చిన ఓ ట్రక్కు ఆ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో భారీ ప్రాణనష్టం జరిగింది.
ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే 11 మంది మరణించారు. 12 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను రక్షించి హాస్పిటల్ కు తరలించారు. అలాగే మృతదేహాలను హాస్పిటల్ లోని మార్చురీకి తీసుకెళ్లామని ఎస్పీ భరత్‌పూర్ మృదుల్ కచావా వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో తెలిపారు.
ఇదిలా ఉండగా.. రాజస్థాన్ లోని హనుమాన్ గఢ్ జిల్లాలో మంగళవారం జీపు, బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. హనుమాన్ గఢ్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లఖోవలి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులను నంద్రామ్ జాట్ (70), నీతూ జాట్ (60), దీపు జాట్ (13), అర్జున్ జాట్ (40)గా గుర్తించారు.