
Domestic LPG Cylinders Seized: బ్లాక్ లో అమ్ముతున్న గ్యాస్ సిలిండర్లు సీజ్
కర్ణాటకలోని యాదగిరి జిల్లాలో హోటళ్లపై అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో హోటళ్లలో అక్రమంగా ఉపయోగిస్తున్న 46 గృహ వినియోగ LPG సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. యాదగిరి అసిస్టెంట్ కమిషనర్ శ్రీధర్ గొటూర్ (KAS) ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలలో పలు హోటళ్లలో నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించారు.