Asianet News TeluguAsianet News Telugu

సుశాంత్ తో కలిసి గంజాయి దట్టించిన సిగరెట్లు తాగేదాన్ని: రియా

గంజాయి దట్టించిన సిగరెట్లను తను సుశాంత్ రాజ్ పుత్ తో కలిసి తాగేదాన్ననని రియా చక్రవర్తి వెల్లడించింది. ఎన్సీబీ విచారణలో రియా ఆ విషయాన్ని వెల్లడించింది. 

I used to take drugs filled cigarette with Sushant: Rhea confesses
Author
New Delhi, First Published Sep 8, 2020, 2:28 PM IST

న్యూఢిల్లీ: బాలివుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుత్ కేసు ప్రధానమైన మలుపు తీసుకుంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో కలిసి తాను గంజాయి దట్టించిన సిగరెట్లు తాగేదాన్నని రియా చక్రవర్తి నేషనల్ క్రైమ్ బ్యూరో (ఎన్ సీబీ) ముందు అంగీకరించింది. విచారణ సందర్భంగా ఆమె ఆ విషయాన్ని వెల్లడించింది. 

సుశాంత్ సింగ్ 2016 నంచి డ్రగ్స్ తీసుకుంటున్నాడని విచారణలో ఆమె చెప్పింది. రియా ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా ఆ విషయాన్ని రాబట్టారు. రియా పాత మొబైల్ ఫోన్, ల్యాప్ టాప్, ట్యాబ్లెట్ ల ఫోరెన్సిక్ పరీక్షల్లో ఎన్ సీబీ పలు విషయాలు తెలిశాయి. 

Also Read: సుశాంత్‌ ప్రేమ కోసమే ఆ తప్పు చేశాః రియా

రియా 2017, 2018, 2019ల్లో డ్రగ్స్ సర్కిల్ లో చాలా చురుగ్గా ఉన్నట్లు ఆమె ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న గాడ్జెట్స్ ద్వారా వెల్లడైంది. ఆ గాడ్జెట్స్ నుంచి దర్యాప్తు సంస్థలు మత్తుపదార్థాలకు సంబంధించిన పలు ఫొటోగ్రాప్ లను, వీడియోలను, వాట్సప్ సందేశాలను, ఎస్ఎంస్ లను రాబట్టారు. వీడియోల్లో, ఫొటోల్లో పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు ఉన్నాయి. వారి గురించి ఎన్ సీబీ ఆరా తీస్తోంది. వారిని ఎన్ సీబీ అధికారులు విచారిస్తారా లేదా అనేది తెలియదు. 

కాగా, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసులో డ్రగ్స్ కు సంబంధించి పలు అరెస్టులు జరుగుతాయని భావిస్తున్నారు. సుశాంత్ పని మనిషి నీరజ్ కు సంబంధించి రియా, సౌవిక్, శామ్యూల్ కొన్ని విషయాలు వెల్లడించారు. దాంతో నీరజ్ ను ప్రశ్నించాలని ఎన్ సీబీ అధికారులు భావిస్తు్నారు. సీఎ శ్రుతి మోడీకి కూడా సమన్లు జారీ చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. 

Also Read: సుశాంత్‌ ప్రేమ కోసమే ఆ తప్పు చేశాః రియా

ఎన్ సీబీ అడిగిన పలు ప్రశ్నలకు సోమవారంనాటి విచారణలో సరైన సమాధానాలు ఇవ్వలేదు. డ్రగ్స్ ఇంటికే వచ్చేవా, డ్రగ్స్ కొనుగోలుకు ఎవరి డబ్బులు వాడేవారు, ముంబైలోని హోటల్లో సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడా వంటి ప్రశ్నలకు ఆమె జవాబులు ఇవ్వలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios