బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసు ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి చుట్టూ తిరుగుతుంది. ఆమె మెడకు గట్టిగా చుట్టుకుంటోంది. ఆమె చుట్టూతే కేసు విచారణ జరుగుతుంది. సుశాంత్‌ ఆత్మహత్య కేసులో డ్రగ్స్ కోణం బయటపడటంతో ఆ కోణంలో నార్కొటిక్స్ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) విచారణ జరుపుతోంది. 

ఎన్‌సీబీ ఇప్పటికే రియా సోదరుడు షోవిక్‌, సుశాంత్‌ మేనేజర్‌ శామ్యూల్‌ని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతుంది. వీరితోపాటు సోమవారం రియాని కూడా విచారిస్తోంది. ఈ సందర్భంగా రియా బాలీవుడ్‌లో డ్రగ్స్
తీసుకునే ఆలవాటున్న స్టార్స్ పేరు వెల్లడించినట్టు సమాచారం. 

అంతేకాదు మరో సంచలన విషయం వెల్లడించింది. తనకు డ్రగ్ తీసుకునే ఆలవాటు లేదట. కానీ సుశాంత్‌ కోసం డ్రగ్స్ తెప్పించినట్టు తెలిపింది. తాను ఏ తప్పు చేసినా సుశాంత్‌ ప్రేమ కోసమే అని తెలిపింది. తనకు కేవలం సిగరెట్‌ తాగే ఆలవాటుంది. కానీ డ్రగ్స తీసుకోలేదని, అందుకు టెస్ట్ కైనా సిద్ధమే అని తెలిపింది. 

మరోవైపు సోమవారం రియా.. సుశాంత్‌ సోదరిపై ఫోర్జరీ కేసు పెట్టింది. మానసిక ఒత్తిడికి సంబంధించిన మందులతో ఓ బోగస్‌ మందుల చీటీని సుశాంత్‌ సోదరి ప్రియాంక సింగ్‌ ఫోర్జరీ చేసిందని పోలీసులకు ఫిర్యాదు
చేసింది. ఆ మందులు వాడిన ఐదు రోజులకే సుశాంత్‌ మరణించాడని ఫిర్యాదులో తెలిపింది. దీనిపై ప్రియాంక సింగ్‌ని, ఢిల్లీలోని రామ్‌మనోహర్‌ లోహియా ఆస్పత్రి డాక్టర్‌ తరుణ్‌ కుమార్‌ని ప్రశ్నిస్తే అసలు నిజాలు బయటపడతాయని రియా తెలిపింది. దీంతో సుశాంత్‌ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకున్నట్టయ్యింది. మరి ఇది మున్ముందు ఇంకెన్ని టర్న్ లు తీసుకుంటుందో చూడాలి.