బీహార్ సీఎం అవ్వాలనే కోరిక తనకు లేదని ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ అన్నారు. ఈ విషయంలో పార్టీ నాయకులు ఎలాంటి కామెంట్స్ చేయకూడదని సూచించారు. 

బీహార్ అత్యున్నత అధికార పీఠాన్ని ఆక్రమించుకోవడానికి తొందరపడడం లేదని ఆర్జేడీ నేత‌, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తేజస్వీ ప్రసాద్ యాదవ్ అన్నారు. ఈ అంశంపై మాట్లాడటం మానుకోవాలని ఆయన త‌న పార్టీ నాయ‌కుల‌కు సూచించారు. వచ్చే ఏడాది నాటికి యువనేత ముఖ్యమంత్రి అవుతారని ఆర్జేడీ రాష్ట్ర అధ్యక్షుడు జగదానంద్ సింగ్ ఇటీవల ఢిల్లీలో చేసిన ప్రకటనపై యాదవ్ ఆయ‌న ఈ విధంగా స్పందించారు. 

దారితప్పి వచ్చిన బాలిక కిడ్నాప్, సామూహిక అత్యాచారం.. రూ.50వేలకు అమ్మేసి.. దారుణం...

జ‌గ‌దానంద్ సింగ్ చేసిన కామెంట్స్ నితీష్ కుమార్ పార్టీ అయిన జేడీ(యూ)లోని కొంతమంది నేతలను కలవరపరిచింది. అందుకే దీనిపై తేజ‌స్వీ యాద‌వ్ క్లారిటీ ఇస్తూ.. ‘‘ నాకు వ్యక్తిగత ఆశయం లేదు. నేను తొందరపడటం లేదు. మద్దతుదారులు అతిగా ఆలోచిస్తున్నారు. కానీ భవిష్యత్తులో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో మనం ఆలోచించాల్సిన సమయం ఇది కాదు ’’ అని ఆయ‌న మీడియాతో అన్నారు.

రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి మల్లికార్జున్ ఖర్గే రాజీనామా

‘‘బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఫాసిస్ట్ శక్తులను అధికారం నుండి తరిమికొట్టడంపై మనం దృష్టి పెట్టాలి. బీహార్‌లో మనం దానిని సాధించాము. అదే జాతీయంగా సాధించాల్సిన అవసరం ఉంది ’’ అని తేజస్వీ యాదవ్ అన్నారు. నితీష్ కుమార్ సీఎం అని, ఆయన మహాఘటబంధన్ కు నాయకుడు అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. బీహార్ సీఎం కూడా బీజేపీని ఓడించాల‌ని కోరుకుంటున్నార‌ని అన్నారు. అంద‌రూ సంద‌ర్భానికి త‌గిన‌ట్టు ఎదగాల‌ని చెప్పారు.

ఆటో డ్రైవ‌ర్ యూ ట‌ర్న్.. కేజ్రీవాల్ కు ఇంట్లో విందు ఇచ్చిన కొద్ది రోజుల‌కే.. మోడీ ర్యాలీలో ప్ర‌త్య‌క్ష్యం..

కాగా.. గురువారం ఓ స‌మావేశంలో ఆర్జేడీ రాష్ట్ర అధ్య‌క్షుడు జగదానంద్ సింగ్ మాట్లాడుతూ.. 2023 నాటికి త‌న వార‌సుడికిగా తేజ‌స్వీ యాద‌వ్ బాధ్య‌త‌లు నాటికి నితీష్ కుమార్ జాతీయ రాజకీయాలకు అంకితమవుతారని చెప్పారు. దీంతో తేజస్వీ సీఎం కావొచ్చ‌ని అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. అయితే ఈ వ్యాఖ్య‌ల‌పై జేడీ(యూ) పార్లమెంటరీ బోర్డు చీఫ్ ఉపేంద్ర కుష్వాహ మండిప‌డ్డారు. ‘‘ జగదానంద్ సింగ్ ప్రకటనపై మాకు అభ్యంతరం ఏమీ లేదు. ఆయ‌న మాట‌లు వింటుంటే తండ్రి తన పిల్లలకు పెళ్లి చేసి కుటుంబాన్ని సెటిల్ చేయాలని చింతించే తండ్రిలా క‌నిపిస్తున్నాయి’’ అని అన్నారు.

పీఎఫ్ఐతో సంబంధం క‌లిగిన మ‌ద‌ర్సాను సీల్ చేసిన అధికారులు

అయితే ఆర్జేడీ రాష్ట్ర అధ్యక్షుడి మాటలు జేడీ(యూ)తో విభేదాలను సూచించడం లేదని కుష్వాహ నొక్కిచెప్పారు. ఇద్దరు మహాగత్బంధన్ భాగస్వాముల మధ్య ‘‘ఒప్పందం’’ కుదిరిందని మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ వంటి బీజేపీ నేతల వాదనను తోసిపుచ్చారు. ఇదిలా ఉండ‌గా.. బీజేపీని వీడిన తర్వాత కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌తో ‘‘డీల్’’ చేసుకొని అధికారం చేపట్టారని ఆరోపించారు.