Asianet News TeluguAsianet News Telugu

ఆటో డ్రైవ‌ర్ యూ ట‌ర్న్.. కేజ్రీవాల్ కు ఇంట్లో విందు ఇచ్చిన కొద్ది రోజుల‌కే.. మోడీ ర్యాలీలో ప్ర‌త్య‌క్ష్యం..

రాజకీయ నాయకులు ఎఫ్పుడు ఏ పార్టీలో ఉంటారో చెప్పలేం. ఒక రోజు ఒక పార్టీపై ఆరోపణలు గుప్పించిన నాయకుడు మరుసటి రోజు అదే పార్టీలో కనిపించిన ఉదంతాలు ఎన్నో చూశాం. నాయకులే కాదు వారి అభిమానులు కూడా ఆదే కోవలోకి వస్తారని గుజరాత్ లోని ఓ ఆటో డ్రైవర్ నిరూపించారు. 

Auto driver U-turn.. Few days after Kejriwal was given dinner at home.. Live in Modi rally..
Author
First Published Oct 1, 2022, 11:02 AM IST

ఇటీవ‌ల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి భోజనానికి ఆహ్వానించి, ఇంట్లో విందు ఇచ్చిన ఓ ఆటో డ్రైవ‌ర్ యూట‌ర్న్ తీసుకున్నారు. శుక్ర‌వారం గుజ‌రాత్ లోని అహ్మదాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన ర్యాలీలో ఆటో డ్రైవర్ విక్రమ్ దంతా బీజేపీ ర్యాలీలో క‌నిపించారు. బీజేపీకి సింబాలిక్ భావించే కాషాయ కండువా క‌ప్పుకున్నారు.

దేశంలో 5 జీ సేవలను ప్రారంభించిన ప్రధాని మోదీ.. తొలుత 13 నగరాల్లో అందుబాటులోకి..

ఈ సంద‌ర్భంగా విక్ర‌మ్ దంతా ‘‘మేము మోడీ సాహిబ్‌కు ప్రేమికులం’’ అని నిన‌దించారు. త‌మ కాల‌నీ అతా బీజేపీకే ఓటేస్తామని చెప్పారు. ఆటో యూనియన్ పిలుపు మేరకే తాను కేజ్రీవాల్ ను విందుకు ఆహ్వానించాన‌ని తెలిపారు. ‘‘ బీజేపీకి ఇప్పుడు ఏం చేస్తున్నామో ఇక ముందు అదే కొనసాగిస్తాం. నేను బీజేపీ కార్యక్రమాలకు వెళుతూనే ఉంటాను. ఇప్పటికే ఆ పార్టీతో అనుబంధం కలిగి ఉన్నాం’’ అని ఆయన అన్నారు. రాత్రి భోజనం చేసిన తర్వాత ఎవరితోనూ మాట్లాడలేదని, ఫోన్ చేయలేదని ఆటో ఆయ‌న చెప్పారు.

గుడ్ న్యూస్ : పండగసీజన్ లో భారీగా తగ్గిన వాణిజ్య సిలిండర్ ధరలు.. ఇది రెండోసారి...

ఈ ఏడాది చివరిలో గుజ‌రాత్ లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గ‌ట్టి పోటీ ఇవ్వాల‌ని భావిస్తోంది. అందులో భాగంగానే సెప్టెంబ‌ర్ 13వ తేదీన అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆటోరిక్షా డ్రైవర్లతో టౌన్ హాల్ సమావేశాన్ని చేప‌ట్టారు. ఈ క్ర‌మంలో ఆటో డ్రైవ‌ర్ అయిన విక్రమ్ దంతా లేచి మాట్లాడారు. కేజ్రీవాల్ తో సంభాషిస్తూ.. ‘‘ నేను మీ అభిమానిని. మీరు పంజాబ్ లో ఓ ఆటో డ్రైవ‌ర్ ఇంటికి డిన్న‌ర్ చేయ‌డానికి వెళ్లారు. ఈ విష‌యాన్ని నేను సోష‌ల్ మీడియాలో చూశాను. అయితే మీరు కూడా మా ఇంటికి డిన్న‌ర్ చేయ‌డానికి వ‌స్తారా ? ’’ అని ప్రశ్నించారు. దీనికి ఢిల్లీ సీఎం బదులిస్తూ డిన్నర్ చేయడానికి అంగీకరించారు. 

అనంతరం అహ్మదాబాద్ సిటీలోని ఘట్లోడియా ప్రాంతానికి చెందిన విక్రమ్ దంతా ఇంటికి వెళ్లి అర‌వింద్ కేజ్రీవాల్ భోజ‌నం చేశారు. అయితే అదే డ్రైవ‌ర్ తాజాగా మోడీ ర్యాలీలో క‌నిపించ‌డం మీడియా దృష్టిని ఆక‌ర్శించింది. ఆ డ్రైవ‌ర్ ను చూసిన అనేక మంది ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. ఆ ఆటోరిక్షా డ్రైవర్ తాను ప్రధానికి పెద్ద అభిమానినని, తాను ఎప్పుడూ బీజేపీకి ఓటేస్తానని మీడియాతో తేల్చి చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios