Asianet News TeluguAsianet News Telugu

రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి మల్లికార్జున్ ఖర్గే రాజీనామా

Congress president election: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. "నేను నా నామినేషన్ దాఖలు చేయబోతున్నాను (కాంగ్రెస్ అధ్యక్ష పదవికి)" అని ఖర్గే పార్టీ కార్యాలయం వైపు వెళుతున్నప్పుడు మీడియా ప్రతినిధులతో అన్నారు. 
 

Congress : Mallikarjun Kharge resigns as Leader of Opposition in Rajya Sabha
Author
First Published Oct 1, 2022, 11:37 AM IST

Mallikarjun Kharge resigns: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభలో ప్రతిపక్ష నేత (ఎల్‌వోపీ) పదవికి శనివారం రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేసిన ఒక రోజు తర్వాత, కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జూర్ ఖర్గే శనివారం రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడి (LoP) పదవికి రాజీనామా చేసినట్లు సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియా గాంధీకి మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే త‌న రాజీనామా లేఖ‌ను  పంపిన‌ట్టు ఏఎన్ఐ నివేదించింది.

 

కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. "నేను నా నామినేషన్ దాఖలు చేయబోతున్నాను (కాంగ్రెస్ అధ్యక్ష పదవికి)" అని ఖర్గే పార్టీ కార్యాలయం వైపు వెళుతున్నప్పుడు మీడియా ప్రతినిధులతో అన్నారు. 

 

అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, జార్ఖండ్ నేత కేఎన్ త్రిపాఠిలు సైతం పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేయడానికి ముందు, థరూర్ మహాత్మా గాంధీకి నివాళులు అర్పించేందుకు రాజ్ ఘాట్‌ను సందర్శించారు. 

 

అలాగే, జార్ఖండ్ కాంగ్రెస్ నాయకుడు కేఎన్ త్రిపాఠి కూడా పార్టీ అత్యున్నత స్థానానికి తన నామినేషన్‌ను దాఖలు చేశారు. పార్టీ నాయకుల నిర్ణయాన్ని గౌరవిస్తారని త‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు. “నేను రైతు కుటుంబానికి చెందినవాడిని. భారత వైమానిక దళంలో పనిచేసిన అనుభవం ఉన్న, రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా, జార్ఖండ్ శాసనసభ ఉపనేతగా ఎన్నికైన ఓ రైతు కుమారుడు కూడా ఏఐసీసీ అధ్యక్ష పదవికి పోటీ చేయవచ్చని దేశం చూస్తోందని త్రిపాఠి చెప్పారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios