Asianet News TeluguAsianet News Telugu

జార్ఖండ్ లో ఘోరం.. గిరిజన బాలిక‌ను రేప్ చేసి, చెట్టుకు ఉరేసిన దుండ‌గుడు..

గిరిజన బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన జార్ఖండ్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు పార్టీల నాయకులు డిమాండ్ చేశారు.

Horrific in Jharkhand.. The thug who raped a tribal girl and hanged her on a tree..
Author
First Published Sep 4, 2022, 1:22 PM IST

ఆడ‌పిల్ల‌లపై అఘాయిత్యాలు ఆగ‌డం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు మ‌హిళ‌ల కోసం ఎన్ని చ‌ట్టాలు తెచ్చినా వారిపై లైంగిక వేధింపులు అరిక‌ట్ట‌లేక‌పోతున్నాయి. ప్ర‌తీ రోజు దేశంలో అనేక చోట్ల అత్యాచార ఘ‌ట‌న‌లు వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా జార్ఖండ్‌లో ఓ అత్యాచార ఘ‌ట‌న వెలుగుచూసింది. పెళ్లి సాకుతో 14 ఏళ్ల గిరిజన బాలిక‌పై ఓ దుండ‌గుడు అత్యాచారం చేశాడు. అయితే బాధితురాలు శ‌నివారం ఓ చెట్టుకు ఉరేసుకొని వేలాడుతూ క‌నిపించింది.

ధరల పెరుగుదల.. ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌ట్ట‌ని ప్ర‌ధాని.. : రాహుల్ గాంధీ

దుమ్కా జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 14 ఏళ్ల గిరిజన బాలికను ఓ వ్య‌క్తి పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి ఆమెపై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు. ఏం జ‌రిగిందో తెలియ‌దు గాని శుక్ర‌వారం రోజు ఆమె అనుమాన‌స్ప‌దంగా చెట్టుగా వేలాడుతూ మృతి చెంది క‌నిపించింది. అయితే త‌న కూతురును అర్మాన్ అన్సారీ అని వ్య‌క్తి అత్యాచారం చేసి, హ‌త్య  చేశాడ‌ని బాధితురాలి త‌ల్లి ఆరోపించింది.

ఈ ఘ‌ట‌న‌లో నిందితుడైన అర్మాన్ అన్సారీని పోలీసులు అరెస్టు చేశారు. అత‌డు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడని పోలీసు సూపరింటెండెంట్ అంబర్ లక్రా వార్తా సంస్థ ‘పీటీఐ’కి తెలిపారు. నిందితుడిపై IPC సెక్షన్లు 376 (అత్యాచారం), 302 (హత్య), SC/ST చట్టం, POCSO చట్టంలోని నిబంధనల ప్రకారం అభియోగాలు మోపినట్లు లక్రా తెలిపారు.

ఓరి నాయనో.. మూత్ర విస‌ర్జ‌న స‌మ‌యంలో నొప్పి.. జ‌న‌నాంగాన్ని గొడ్డ‌లితో న‌రుక్కున్న వృద్ధుడు..

కాగా ఈ ఘటనపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘‘ దుమ్కాలో జరిగిన సంఘటన పట్ల నేను చాలా బాధపడ్డాను. నిందితుడిని అరెస్టు చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను దుమ్కా పోలీసులను ఆదేశించాను. భగవంతుడు మరణించిన బాలిక ఆత్మకు శాంతి, బాధిత కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుతున్నాను ’’ అని సోరెన్ ట్వీట్ చేశాడు.

బాలికను అత్యాచారం చేసిన తర్వాత నిందితుడు ఉరి తీశాడని బీజేపీ సీనియర్ నేత బాబులాల్ మరాండీ ఆరోపించారు. ఈ మేర‌కు ఆయ‌న ట్విట్ట‌ర్ లో ట్వీట్ చేశారు. ‘‘ మీరు ఎవరిని కాపాడుతున్నారు? సిగ్గుపడండి ! మీరు, మీ పోలీసులు ఏది దాచినా మేము ఆమెకు న్యాయం చేస్తాము ’’ అని మాజీ సీఎం ట్వీట్ చేశారు.

పుదుచ్చేరిలో దారుణం: స్కూల్ టాపర్‌గా నిలిచిన విద్యార్ధిని చంపిన తల్లి

బీజేపీ  జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ సీఎం రఘుబర్ దాస్ కూడా హేమంత్ సోరెన్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రిసార్ట్ రాజకీయాల్లో స‌మ‌యం దొరిక‌న‌ప్పుడు జార్ఖండ్‌లో శ్రద్ధ వహించండని ఆయ‌న ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు. కాగా. ఆదివాసీ బాలిక మృతిపై నేడు (ఆదివారం) త‌మ స్పందన తెలియజేస్తామని జేఎంఎం అధికార ప్రతినిధి సుప్రియా భట్టాచార్య తెలిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios