Asianet News TeluguAsianet News Telugu

ఓరి నాయనో.. మూత్ర విస‌ర్జ‌న స‌మ‌యంలో నొప్పి.. జ‌న‌నాంగాన్ని గొడ్డ‌లితో న‌రుక్కున్న వృద్ధుడు..

మూత్ర విజర్జన సమయంలో నొప్పిగా ఉందని ఓ వృద్ధుడు తన జననాంగాన్ని గొడ్డలితో నరికేశాడు. దీంతో అతడికి తీవ్ర రక్తస్రావం అయ్యింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

Pain during urination.. Old man who cut his genitals with an axe..
Author
First Published Sep 4, 2022, 11:21 AM IST

మధ్యప్రదేశ్ లోని  దామోహ్ లో ఒక ఆశ్చర్యకరమైన ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. మూత్రం పోయ‌డంలో ఇబ్బంది అవుతోంద‌ని, నొప్పి క‌లుగుతోంద‌ని ఓ వృద్ధుడు జ‌న‌నాంగాన్ని ప‌దునైన గొడ్డ‌లితో న‌ర‌క్కున్నాడు. ఈ చ‌ర్య వృద్ధుడి ప్రాణాల మీదికి తీసుకొచ్చింది. వెంట‌నే అత‌డిని హాస్పిట‌ల్ లో చేర్పించాల్సి వ‌చ్చింది.

పుదుచ్చేరిలో దారుణం: స్కూల్ టాపర్‌గా నిలిచిన విద్యార్ధిని చంపిన తల్లి

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. దామోహ్ జిల్లా లోని మహ్రాన్ పోలీస్ స్టేషన్ ప‌రిధిలో నివ‌సిస్తున్న 75 ఏళ్ల వృద్ధుడి కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ‌పడుతున్నాడు. అత‌డికి కిడ్నీలో రాళ్లు ఉన్నాయి. దీంతో మూత్ర విసర్జన‌కు ఇబ్బంది పడుతున్నాడు. మూత్రం పోసే స‌మ‌యంలో మంట‌తో తీవ్ర అవ‌స్థ ప‌డుతున్నాడు. ఈ క్ర‌మంలో సెప్టెంబ‌ర్ 2వ తేదీన రాత్రికూడా మూత్రం పోసే స‌మ‌యంలో నొప్పిని అనుభ‌వించాడు. దీనిని భ‌రించ‌లేక వృద్ధుడు ఇంట్లో ఉన్న గొడ్డ‌లితో త‌న జ‌న‌నాంగాన్ని న‌రుక్కున్నాడు. 

ఘోరం.. బైక్ ను ముట్టుకున్నాడ‌ని ద‌ళిత విద్యార్థిని ఇనుప రాడ్ తో చిత‌క‌బాదిన టీచ‌ర్..

అనంత‌రం పెద్ద‌గా కేక‌లు వేయ‌డంతో కుటుంబ స‌భ్యులు అంద‌రూ నిద్ర‌లో నుంచి మేల్కొన్నారు. వృద్ధుడి ద‌గ్గ‌రికి ప‌రిగెత్తారు. ఆ ప్రాంతమంతా ర‌క్తం క‌నిపించ‌డంతో అంద‌రూ షాక్ అయ్యారు. ఏం జ‌రిగిందో అర్థం చేసుకున్నారు. వెంట‌నే బాధితుడిని సమీపంలోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తీవ్ర గాయ‌మైన వృద్దుడిని చూసి డాక్ట‌ర్లు అత‌డిని దమోహ్ జిల్లా హాస్పిట‌ల్ కు రెఫ‌ర్ చేశారు. 

ద్రవ్యోల్బణం, జీఎస్టీపై నేడు కాంగ్రెస్ భారీ నిర‌స‌న‌.. ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో మెగా ర్యాలీ

వృద్ధుడి జ‌న‌నాంగాలు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయ‌ని దామోహ్ జిల్లా హాస్పిట‌ల్ డాక్ట‌ర్ ముఖేష్ సాహ్ని తెలిపారు. దానికి ఆప‌రేష‌న్లు చేయాల్సి ఉంటుంద‌ని చెప్పారు. ప్ర‌స్తుతం ర‌క్త స్రావాన్ని అరిక‌ట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. తీవ్ర రక్తస్రావం జరిగిందని, బాధితుడికి రక్తం ఎక్కిస్తున్నామని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios