ఆటల పీరియడ్ కు రాలేదని ఆ వార్డెన్ విద్యార్థినులకు పెద్ద శిక్షే వేసింది. 200 సార్లు సిట్ అప్ లు తీయాలని ఆదేశించింది. ఇక చేసేదేమీ లేక ఆ బాలికలందరూ సిట్ అప్ లు తీశారు. దీంతో వారంతా అస్వస్థతకు గురయ్యారు. 

పీటీ క్లాస్ కు హాజరు కాలేదని ఓ వార్డెన్ విద్యార్థినుల పట్ల అమానుషంగా ప్రవర్తించింది. బాలికలతో 200 సార్లు సిట్ అప్ లు చేయించింది. దీంతో వారంతా అస్వస్థతకు గురయ్యారు. ఆ బాలికల్లో 10 మంది పరిస్థితి ప్రస్తుతం విషమంగా మారింది. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం బాలికలు చికిత్స పొందుతున్నారు. 

24 ఏళ్ల తరువాత కాంగ్రెస్ కంచుకోటను కైవసం చేసుకున్న ఆప్.. డిపాజిట్ కోల్పోయిన బీజేపీ.. ఎక్కడంటే ?

‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ కథనం ప్రకారం.. లతేహర్ జిల్లాలోని జార్ఖండ్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ లో వార్డెన్ ఎలిజబెత్ కుముద్ టోప్పో గురువారం గేమ్స్ క్లాసులు నిర్వహించింది. అయితే ఆ క్లాసుకు 170 మంది విద్యార్థినులు హాజరు కాలేదు. కేవలం ఆరుగురు మాత్రమే వచ్చారు. దీంతో ఆమెకు కోపం వచ్చింది. 

మహారాష్ట్రలోని అకోలాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. 144 సెక్షన్ విధించిన పోలీసులు.. 120 మందిపై కేసులు

తరువాత ఆ బాలికలందరికీ శిక్ష విధించింది. గేమ్స్ క్లాసుకు హాజరుకానందుకు శిక్షగా 200 సిట్ అప్ లు చేయాలని 170 మందిని ఆదేశించింది. దీంతో వారంతా వార్డెన్ చెప్పినట్టు చేశారు. సిట్ అప్ లు పూర్తయిన తరువాత చాలా మంది బాలికలు స్పృహ కోల్పోయారు. వారిలో చాలా మందికి కాళ్ల నొప్పులు రావడంతో పాఠశాల సిబ్బంది హాస్టల్ లో ప్రథమ చికిత్స చేశారు. అయితే వీరిలో 10 మంది బాలికల పరిస్థితి మరింత విషమించడంతో మరుసటి రోజు శుక్రవారం చికిత్స నిమిత్తం స్థానిక హెల్త్ వెల్ నెస్ సెంటర్ కు తరలించారు.

కర్ణాటక ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన 13 మంది మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు.. ఎవరెవరంటే ?

ఈ ఘటనపై సమాచారం అందుకున్న బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్ దాస్ శుక్రవారం వెల్ నెస్ సెంటర్ కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గేమ్స్ క్లాసుకు హాజరకానందుకు వార్డెన్ వారిని శిక్షించారని, దీంతో వారిలో చాలా మంది అస్వస్థకు గురైనట్టు చెప్పారు. దీనిపై త్వరలోనే నివేదిక తయారు చేసి జిల్లా కేంద్రానికి అందజేస్తామని తెలిపారు.

కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీలో ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు.. కర్ణాటకలోని బెళగావిలో ఘటన.. వీడియో వైరల్

ఈ విషయమై వార్డెన్ ను సంప్రదించగా.. పాఠశాలలో విద్యార్థులందరికి ఆటలంటే భారం ఉన్నందున ఇకపై తాను అక్కడ పని చేయబోనని, తాను అక్కడి నుంచి బదిలీపై వెళ్తానని చెప్పినట్టు ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ పేర్కొంది. గేమ్స్ క్లాసుకు హాజరు కానందుకు విద్యార్థులను శిక్షించినట్లు ఆమె అంగీకరించింది. మొత్తం 176 మంది విద్యార్థుల్లో కేవలం ఆరుగురు బాలికలు మాత్రమే గేమ్స్ క్లాసుకు హాజరయ్యారని, అందుకే వారికి శిక్ష వేశానని వెల్లడించారు. కాగా.. ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వార్డెన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. గతంలో కూడా వార్డెన్ పై ఇలాంటి ఫిర్యాదులు చేశామని, అయినా అధికారులు చర్యలు తీసుకోలేదని వారు వాపోయారు.