కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీ సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. అయితే బెళగావిలో జరిగిన విజయోత్సవ సంబరాల్లో పలువురు యువకులు ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఈ దక్షిణాది రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందని అంచనా వేసినప్పటికీ.. దానికి విరుద్ధంగా కాంగ్రెస్ కు మెజారిటీ దక్కింది. దీంతో ఆ పార్టీ సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే అవకాశం లభించింది. నేడు సీఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. రేపు కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.

విషాదం.. ఈత కోసం వెళ్లి.. కృష్ణసాగర్ సరస్సులో మునిగి ఐదుగురు బాలుల మృతి..

కాంగ్రెస్ ఘన విజయంతో దేశ వ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు సంబంరాలు చేసుకున్నారు. అయితే కర్ణాటకలోని బెళగావిలో జరిగిన విజయోత్సవ ర్యాలీలో చోటు చేసుకున్న పరిణామం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విజయోత్సవ సంబరాల్లో పలువురు యువకులు ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారని ‘ఇండియా టీవీ’ నివేదించింది. బెళగావిలోని తిలక్వాడిలోని కౌంటింగ్ కేంద్రం ఇది చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

జూనియర్ పంచాయతీ సెక్రటరీల కీలక నిర్ణయం.. సమ్మె విరిమించి, విధుల్లో చేరుతామంటూ ప్రకటన..

కాగా.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోలో పోలీసులు ఉండగానే గుర్తు తెలియని వ్యక్తులు పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడం గమనార్హం. ఆ నినాదాలు చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హిందూ సంఘాల సభ్యులు పోలీసుల ఎదుట ఆందోళనకు దిగారు. గుర్తుతెలియని వ్యక్తులపై ఐపీసీ సెక్షన్ 153 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

Scroll to load tweet…

అయితే ఈ వీడియోపై బీజేపీ ఐటీ వింగ్ చీఫ్ స్పందించారు. ఆ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. ‘మొహబ్బత్ కి దుకాన్’ ఇలా కనిపిస్తుందని, కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలు కర్ణాటక సామాజిక స్వరూపాన్ని చీల్చివేస్తాయని పేర్కొన్నారు. అయితే ఆయన మరో వీడియో కూడా ట్విట్టర్ లో షేర్ చేశారు. అందులో ఓ యువకుడు పాకిస్థాన్ జెండాను ఊపుతూ కనిపించాడు.

Karnataka Election 2023: ప్రత్యర్థులను చిత్తు చేసి.. 50 వేలకు పైగా మెజార్టీ సాధించిన అభ్యర్థులు వీరే..

ఇదిలా ఉండగా భారత ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ 136 స్థానాలను గెలచుకుంది. బీజేపీ 65 స్థానాల్లోనే విజయం సాధించగా.. జనతాదళ్ (సెక్యులర్) 19 సీట్లకు పరిమితం అయ్యింది. కాగా.. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీకి మే 10వ తేదీన ఎన్నికలు జరిగాయి. శనివారం ఓట్ల లెక్కింపు చేపట్టారు.