Asianet News TeluguAsianet News Telugu

మహారాష్ట్రలోని అకోలాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. 144 సెక్షన్ విధించిన పోలీసులు.. 120 మందిపై కేసులు

మహారాష్ట్రలోని అకోలాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. రెండు వర్గాల మధ్య మొదలైన చిన్నపాటి గొడవ తీవ్ర ఘర్షణకు దారి తీసింది. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చింది పోలీసులు 144 సెక్షన్ విధించారు. 

Clash between two communities in Maharashtra's Akola.. Police imposed Section 144.. Cases against 120 people..ISR
Author
First Published May 14, 2023, 11:14 AM IST

మహారాష్ట్రలోని అకోలాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓల్డ్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం ఓ చిన్న వివాదంలో రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో రెండు గ్రూపుల సభ్యులు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. వాహనాలను ధ్వంసం చేశారు. వీధుల్లో అలజడి సృష్టించారు.

కర్ణాటక ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన 13 మంది మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు.. ఎవరెవరంటే ?

ఈ అల్లర్లకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అయితే ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. హింసాత్మక ఘర్షణల నేపథ్యంలో నగరంలో 144 సెక్షన్ విధించినట్లు అకోలా కలెక్టర్ నీమా అరోరా తెలిపారు. హింసాత్మక గుంపు కొన్ని వాహనాలను ధ్వంసం చేసిందని ఆయన చెప్పారు.

కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీలో ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు.. కర్ణాటకలోని బెళగావిలో ఘటన.. వీడియో వైరల్

ఓ మత పెద్దపై వివాదాస్పద పోస్టు చేయడంతో ఘర్షణలు చెలరేగాయి. ఆ తర్వాత ఆ పోస్టును డిలీట్ చేశారు. హింసాత్మక ఘర్షణల పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు కొంత బలప్రయోగం చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో ముగ్గురు పోలీసులు కూడా ఉన్నారు. పరిస్థితిని నియంత్రించడానికి యంత్రాంగం ఎస్ఆర్పీని మోహరించిందని ‘టైమ్స్ నౌ’ నివేదించింది.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 120 మందిపై కేసు నమోదు చేశారు. అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు 25 మందిని అరెస్టు చేశారు. అకోలా ప్రజలు శాంతి సామరస్యాలను కాపాడాలని, వదంతులను నమ్మవద్దని, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. గడిచిన కొన్ని రోజుల్లో అకోలాలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి. గతంలో కూడా అకోట్ ఫైల్ ప్రాంతంలోని శంకర్ నగర్ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది.

Follow Us:
Download App:
  • android
  • ios