Asianet News TeluguAsianet News Telugu

24 ఏళ్ల తరువాత కాంగ్రెస్ కంచుకోటను కైవసం చేసుకున్న ఆప్.. డిపాజిట్ కోల్పోయిన బీజేపీ.. ఎక్కడంటే ?

24 ఏళ్ల పాటు జలంధర్ లోక్ సభ నియోజకవర్గంలో ఏకచక్రాధిపత్యం చెలాయించిన కాంగ్రెస్ చతికిలిపడిపోయింది. ఆ స్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కొల్లగొట్టింది. అయితే బీజేపీకి కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. 

jalandhar by-election.. After 24 years, AAP has captured the stronghold of Congress.. BJP has lost its deposit...ISR
Author
First Published May 14, 2023, 12:15 PM IST

పంజాబ్ లోని జలంధర్ లోక్ సభ నియోజకవర్గానికి ఇటీవల ఎన్నికలు జరగ్గా శనివారం ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో ఆప్ ఘన విజయం సాధించింది. 24 ఏళ్లుగా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ స్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కైవసం చేసుకుంది. అయితే ఇక్కడ జరిగిన ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ ను కోల్పోయింది. కానీ ఆ పార్టీకి ఓట్ల శాతం పెరిగింది. 

మహారాష్ట్రలోని అకోలాలో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. 144 సెక్షన్ విధించిన పోలీసులు.. 120 మందిపై కేసులు

ఆప్ అభ్యర్థి సుశీల్ కుమార్ రింకు తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి కరంజిత్ కౌర్ చౌదరిపై 58,691 ఓట్ల తేడాతో విజయం సాధించారు. పంజాబ్ లో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కొంత కాలానికే సంగ్రూర్ లోక సభ స్థానానికి ఉప ఎన్నికలో ఆప్ ఓడిపోయింది. అది భగవంత్ మాన్ సొంత నియోజకవర్గం కావడం, గతంలో ఆయన అక్కడి నుంచే ఎంపీగా ఉన్నప్పటికీ ఆ స్థానాన్ని ఆప్ కోల్పోవడంతో కొంత నిరాశకు లోనయ్యింది. అయితే తాజా విజయం ఆ పార్టీకి ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఇది లోక్‌సభకు ఆప్‌ రీఎంట్రీని సూచిస్తోంది.

ఈ ఏడాది ప్రారంభంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో జలంధర్ ఎంపీగా ఉన్న సంతోఖ్ సింగ్ చౌదరి మరణించారు. దీంతో ఇక్కడ ఎన్నిక నిర్వహించడం అనివార్యమైంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ తో పాటు ఈ లోక్ సభ ఉప ఎన్నికకు కూడా ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 10వ తేదీన ఇక్కడ ఎన్నికలు జరిగాయి.

కర్ణాటక ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన 13 మంది మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు.. ఎవరెవరంటే ?

ఈ ఉప ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే రింకూ ఆమ్ ఆద్మీ పార్టీ లోకి చేరారు. ఆయననే ఆ పార్టీ లోక్ సభ అభ్యర్థిగా నిలబెట్టింది. ఉప ఎన్నికల ప్రచారంలో అధికార ఆప్ గృహ వినియోగదారులకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న 580 ఆప్ క్లినిక్ లు, 28,000 ప్రభుత్వ ఖాళీల భర్తీ వంటి ఇటీవలి విజయాలను ప్రస్తావించింది. ఇక్కడ బీజేపీ దూకుడుగా ప్రచారం నిర్వహించినప్పటికీ డిపాజిట్ కోల్పోయి 4వ స్థానానికి పడిపోయింది. అయితే ఆ పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో 12 శాతంగా ఉన్న ఓట్ల శాతం.. ఈ ఉప ఎన్నికల్లో 15.19 శాతానికి పెరిగింది. బీఎస్పీతో పొత్తు పెట్టుకున్న దాని మాజీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ మూడో స్థానంలో నిలిచింది. 

ఈ ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతీ ఇంటికి చేరుకుంది. తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఏడాది మాత్రమే అయినందున.. వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలకు 11 నెలల ముందు జరిగే ఈ ఎన్నికల్లో తమకు బలాన్ని అందించాలని ఆ పార్టీ ఓటర్లను కోరింది.

కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీలో ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు.. కర్ణాటకలోని బెళగావిలో ఘటన.. వీడియో వైరల్

కాగా.. ఈ విజయంపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. పంజాబ్‌లో భగవంత్ మాన్ ప్రభుత్వం మంచి పని చేస్తోందని, అందుకే ఈ అపూర్వ విజయం సాధించామని అన్నారు. ‘‘మేము పని రాజకీయాలు చేస్తాము. మేము చేసిన పనికి ప్రజల నుంచి ఓట్లు అడుగుతాము. ప్రజలు కూడా ‘మేము మీతో ఉన్నాం’ అంటూ భగవంత్ మాన్ ప్రభుత్వ పని తీరుకు ఆమోద ముద్ర వేశారు. ఇది ఒక పెద్ద సందేశం’’ అని ఆయన అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios