కటక్: దేశవ్యాప్తంగా జరుగుతున్న అత్యాచార ఘటనలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా ఒడిశాలోని కటక్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది 17 ఏళ్ల బాలికను ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత ఫామ్ హౌస్ కు తీసుకుని వెళ్లాడు. అక్కడ తన మిత్రుడితో కలిసి 22 రోజుల పాటు పలుమార్లు సామూహిక అత్యాచారం చేశాడు.

ఒడిశాలోని జగత్ సింగ్ పూర్ జిల్లాలోని తిర్తోల్ కు చెందిన బాలిక తల్లిదండ్రులతో గొడవ పెట్టుకునిఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇంటికి తిరిగి వెళ్లడానికి బస్సు కోసం కటక్ లోని ఓఎంపీ స్క్వేర్ వద్ద ఎదురు చూస్తుండగా తన మోటార్ సైకిల్ మీద ఇంటి వద్ద దింపుతానని ఓ వ్యక్తి ఆమెను నమ్మించాడని బాదితురాలు జిల్లా శిశు సంక్షేమ అధికారులతో చెప్పింది. 

తనను అతను తిర్తోల్ కు తీసుకుని వెళ్లడానికి బదులు గటిరౌట్ పట్నా గ్రామంలోని పౌల్ట్రీ ఫామ్ కు తీసుకుని వెళ్లాడని, 22 రోరోజుల పాటు గదిలో నిర్బంధించాడని ఆమె చెప్పింది. ఫామ్ హౌస్ లో ఇద్దరు వ్యక్తులు తనపై పదే పదే అత్యాచారం చేసినట్లు ఆరోపించింది. 

ఫామ్ లో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని అనుమానించి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు ఫామ్ హౌస్ మీద దాడి చేశారు. ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. 

బాలికను పోలీసులు జి్లాల శిశు సంక్షేమ కమిటీ ముందు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఆమెను అనాథాశ్రమానికి తరలించారు. ఈ సంఘటనపై  ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెసు నేతలు బిజెడి ప్రభుత్వం మీద విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నారు.