ముజఫర్ పూర్: బీహార్ లోని ముజఫర్ పూర్ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నలుగురు వ్యక్తులు ఓ బాలికపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెను సజీవంగా దహనం చేశారు. వారు ఈ నెల 21వ తేదీన ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 

తీవ్రంగా గాయపడిన బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారంనాడు మరణించింది. ఈ సంఘటనపై బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. 

కేసు విచారణ సాగుతోందని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. గుల్షన్ కుమార్, చంచల్ కుమార్ ఈ నేరానికి ప్రణాళిక రచించి, బాలికపై అత్యాచారం చేశారని అంటున్నారు. బాలిక నివాసంలో నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. నిందితులను పట్టుకోవడానికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని పోలీసులు చెబుతున్నారు.