Asianet News TeluguAsianet News Telugu

కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి, 12 మంది పరిస్థితి విషమం.. బీహార్ లో ఘటన

బీహార్ లో కల్తీ మద్యం మాఫియాకు మరో ఐదుగురు బలయ్యారు. కల్తీ మద్యం తాగి వారంతా చనిపోయారు. మరో 12 మంది పరిస్థితి కూడా విషమంగా ఉంది. మోతీహరి జిల్లాలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

Five people died after drinking adulterated liquor, 12 people are in serious condition.. Incident in Bihar..ISR
Author
First Published Apr 15, 2023, 1:18 PM IST

కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతి చెందిన ఘటన బీహార్ లోని మోతీహరి జిల్లాలో చోటుచేసుకుంది. రాష్ట్రంలోని మోతీహరి జిల్లాలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఈ మరణాలు సంభవించాయి. మరో పన్నెండు మంది కూడా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని ‘ఇండియా టుడే’ నివేదించింది. 

ఎస్‌యూవీని ఢీకొట్టిన బస్సు.. నలుగురు మృతి.. ఎన్‌హెచ్‌-48పై ఘటన

ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం 2016 ఏప్రిల్ లో రాష్ట్రంలో మద్యం అమ్మకాలు, వినియోగంపై సంపూర్ణ నిషేధాన్ని విధించింది. ఈ చర్య గణనీయమైన సంఖ్యలో మహిళా ఓటర్ల మనసు గెలుచుకుంది. అయితే నిషేధం ఉన్నప్పటికీ రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్ లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే స్థానికంగా తయారైన కల్తీ మద్యం తాగి ఎంతో మంది ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం.. కాంగ్రెస్ నేత కాళ్లను తాకిన యడియూరప్ప కుమారుడు.. వీడియో వైరల్

ఈ ఏడాది జనవరిలో సివాన్ లో కల్తీ మద్యం తాగి నలుగురు మృతి చెందారు. ఈ ఘటన తర్వాత బీహార్ పోలీసులు రాష్ట్రంలో మద్యం వ్యాపారం, నిల్వ, కొనుగోళ్లకు సంబంధించి 16 మందిని అరెస్టు చేశారు. శానిటైజర్ తయారీ నెపంతో లిక్కర్ మాఫియా కోల్ కతా నుంచి ఇథనాల్ ను తీసుకొచ్చిందని, అయితే దానితో రాష్ట్రంలో కల్తీ మద్యం తయారు చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ 15 మందిని అరెస్టు చేయగా, వీరిలో ఎనిమిది మంది మద్యం వ్యాపారులు ఉన్నారు. వారి నుంచి స్వదేశీ, విదేశీ బ్రాండెడ్ మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ.. ఎన్నికల బరిలోకి మిత్రపక్షం ఎన్సీపీ..

గత ఏడాది డిసెంబర్ లో చాప్రాలో కల్తీ మద్యం సేవించి 80 మంది చనిపోయారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. రాష్ట్రంలోని ప్రతిపక్షాలు అధికార జేడీయూ, ఆర్జేడీ ప్రభుత్వంపై విమర్శలు కురిపించాయి. అసెంబ్లీ లోపల, బయట కూడా బీజేపీ నుంచి తీవ్ర నిరసనను ప్రభుత్వం ఎదుర్కొంది. 

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. లోయలో పడిపోయిన బస్సు.. 13 మంది మృతి, 25 మందికి గాయాలు

ఆ సమయంలో సీఎం నితీష్ కుమార్ యాదవ్ స్పందించారు. కల్తీ మద్యం తాగి మరణించినవారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలనే డిమాండ్‌ను ఆయన కొట్టిపారేశారు. రాష్ట్రంలో 2016 నుంచి మద్యపానంపై నిషేధం ఉందని, ప్రజలు మరింత జాగరూకతగా మెలగాల్సిన అవసరం ఉన్నది అని ఆయన అన్నారు. అంతేకాదు, లిక్కర్ తాగితే చస్తారు కదా అని పేర్కొన్నారు.  లిక్కర్ అమ్మకాలపై మేం కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, నిషేధం అములలో ఉన్నప్పుడు లభిస్తున్న లిక్కర్ లో ఏదో తేడా ఉంటుందని అర్థం చేసుకోవాలని సూచించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios