మహారాష్ట్రలో ఓ బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 13 మంది చనిపోయారు. 25 మందికిపైగా గాయాపడ్డారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారు. 

మహారాష్ట్రలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయ్ గఢ్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఓ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. మరో 25 మందికి పైగా గాయాలు అయ్యాయి. పూణేలోని పింప్లే గురవ్ నుంచి బస్సు గోరేగావ్ వెళ్తుండగా పూణే-రాయ్ గఢ్ సరిహద్దులో తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ఘటన జరిగింది.

బైక్ ను వెనకాల నుంచి ఢీకొట్టిన బస్సు.. ఇన్ స్పెక్టర్ మృతి, డ్రైవర్ అరెస్టు.. ఎక్కడంటే ?

ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ టీం సభ్యులు అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఢిల్లీలో సబ్సిడీ విద్యుత్ కు బ్రేకులు..? ఫైలును ఇంకా ఆమోదించని ఎల్జీ సక్సేనా.. విమర్శించిన ఆమ్ ఆద్మీ పార్టీ..

బస్సు రాయ్ గఢ్ లోని ఖోపోలి ప్రాంతంలో ఉన్న లోయలో అదుపుతప్పి పడిపోయిందని రాయ్ ఘడ్ ఎస్పీ సోమనాథ్ ఘర్గే తెలిపారని ‘ఇండియా టుడే’ నివేదించింది. అయితే ఏడుగురే చనిపోయారని, 25 మందికి పైగా గాయపడ్డారని పేర్కొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని తెలిపారు. కాగా.. ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో అంబులెన్స్ లు, పోలీసు వాహనాలు రోడ్డు పక్కన నిలిపి ఉంచడం పలు వీడియోల్లో కనిపిస్తున్నాయి. 

అధికారాన్ని దుర్వినియోగం చేసి, భారతీయులను విభజించేవారే నిజమైన దేశ ద్రోహులు - సోనియా గాంధీ

ఈ ప్రమాదంలో బస్సు కిటికీలు, పైకప్పు పూర్తిగా దెబ్బతిందని వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ నివేదించింది. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన వారిని రెస్క్యూ సిబ్బంది తాళ్ల సహాయంతో సురక్షితంగా తీసుకెళ్తున్నారు. బస్సులోని ప్రయాణికులు గోరేగావ్ ప్రాంతానికి చెందిన ఓ సంస్థకు చెందినవారు. వీరంతా ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి పూణెకు వెళ్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కేజీఎఫ్ బాబు భార్య పోటీ.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు.. వీరెవరంటే ?

ఇదిలా ఉండగా, పంజాబ్‌లోని హోషియార్‌పూర్ జిల్లాలోని గర్‌శంకర్ ప్రాంతంలో శుక్రవారం నాడు ట్రక్కు ఢీకొనడంతో ఏడుగురు మృతి చెందగా, మరో 10 మందికి గాయాలయ్యాయి.