ఓ ఎస్‌యూవీని బస్సు ఎదురుగా ఢీకొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ప్రమాదం కర్ణాటకలోని తుమకూరులో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాలను తుమకూరు జిల్లా హాస్పిటల్ కు తీసుకెళ్లారు. 

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుమకూరులోని హీరేహళ్లి సమీపంలో ఎన్‌హెచ్‌-48లో ఎస్‌యూవీని, ప్రైవేట్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు చనిపోయారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను హాస్పిటల్ కు తరలించారు. 

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం.. కాంగ్రెస్ నేత కాళ్లను తాకిన యడియూరప్ప కుమారుడు.. వీడియో వైరల్

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నలుగురు వ్యక్తులు ప్రయాణిస్తున్న ఎస్ యూవీ బెంగళూరు నుంచి తుమకూర్ కు శుక్రవారం వెళ్తోంది. ఇదే సమయంలో ఓ ప్రైవేట్ బస్సు సిరా నుంచి తుమకూరు మీదుగా బెంగళూరు వెళ్తోంది. ఈ రెండు వాహనాలు నేషనల్ హైవే నెంబర్ 48పై ఎదురెదురుగా ప్రయాణిస్తున్నాయి. ఈ క్రమంలో హిరేహళ్లి సమీపంలోకి చేరుకున్న కారును బస్సు ఎదురుగా ఢీకొట్టింది. 

కర్ణాటకలో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ.. ఎన్నికల బరిలోకి మిత్రపక్షం ఎన్సీపీ..

ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను తుమకూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ మార్చురీలో భద్రపరిచారు. ఈ ప్రమాదంపై క్యాతసంద్ర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతున్నట్టు వారు తెలిపారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Scroll to load tweet…

మహారాష్ట్రలో కూడా శనివారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది చనిపోయారు. రాయ్ గఢ్ జిల్లాలో ఓ బస్సు లోయలో పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న అనేక మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. . ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ టీం సభ్యులు అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపడుతున్న క్రమంలో 13 మంది చనిపోయారని గుర్తించారు. వారి మృతహాలను బయటకు తీశారు.

బైక్ ను వెనకాల నుంచి ఢీకొట్టిన బస్సు.. ఇన్ స్పెక్టర్ మృతి, డ్రైవర్ అరెస్టు.. ఎక్కడంటే ?

మరో 25 మందికి పైగా గాయాలు కావడంతో వారిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పూణేలోని పింప్లే గురవ్ నుంచి గోరేగావ్ వెళ్తున్న ఈ బస్సులో 41 మంది ప్రయాణికులు ఉన్నారు. తెల్లవారు జామున 4.30 గంటలకు బస్సు రాయ్ గఢ్ లోని ఖోపోలి ప్రాంతంలో ఉన్న లోయలో అదుపుతప్పి పడిపోయిందని రాయ్ ఘడ్ ఎస్పీ సోమనాథ్ ఘర్గే తెలిపారని ‘ఇండియా టుడే’ నివేదించింది. అయితే ఏడుగురే చనిపోయారని, 25 మందికి పైగా గాయపడ్డారని పేర్కొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని తెలిపారు.