Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటకలో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ.. ఎన్నికల బరిలోకి మిత్రపక్షం ఎన్సీపీ..

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మిత్రపక్షం ఎన్సీపీ పోటీ చేయబోతోంది. దీంతో కాంగ్రెస్ ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. జాతీయ పార్టీ హోదాను తిరిగి పొందేందుకు ఎన్నికల్లో పోటీ చేయాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. 

Backlash to Congress in Karnataka.. Ally NCP enters the election ring.. Announcement of the 'Unity of the Opposition' meeting..ISR
Author
First Published Apr 15, 2023, 10:08 AM IST

కర్ణాటకలో కాంగ్రెస్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి మిత్రపక్షంగా భావిస్తున్న ఎన్సీపీ ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తోంది. 'ప్రతిపక్ష ఐక్యత' పేరిట శరద్ పవార్ కాంగ్రెస్ నేతలతో సమావేశమైన మరుసటి రోజే ఆయనకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వచ్చే నెలలో జరిగే కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించడం కొసమెరుపు.

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. లోయలో పడిపోయిన బస్సు.. 13 మంది మృతి, 25 మందికి గాయాలు

బీజేపీ, కాంగ్రెస్, జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) ముక్కోణపు పోటీ ఉన్న ప్రాంతాల్లో మే 10న జరిగే కర్ణాటక ఎన్నికల్లో ఎన్సీపీ 40-45 స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తోందని ‘ఎన్డీటీవీ’ కథనం పేర్కొంది. విపక్షాల ఐక్యతకు పెద్ద దెబ్బగా భావిస్తున్న ఈ నిర్ణయం ఇటీవల ఎన్సీపీ జాతీయ హోదాను కోల్పోవడానికి కారణమని తెలుస్తోంది. ఇటీవల జాతీయ పార్టీ హోదాను తిరిగి పొందేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ అన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీ చేయాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. 

బైక్ ను వెనకాల నుంచి ఢీకొట్టిన బస్సు.. ఇన్ స్పెక్టర్ మృతి, డ్రైవర్ అరెస్టు.. ఎక్కడంటే ?

కర్ణాటక ఎన్నికల్లో ఎన్సీపీకి అలారం క్లాక్ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. గణనీయమైన మరాఠీ జనాభా ఉన్న మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో మహారాష్ట్ర ఏకీకరణ సమితితో ఎన్సీపీ భాగస్వామ్యం కుదుర్చుకోనుంది. అధికార బీజేపీ అవినీతి, అధికార వ్యతిరేకత ఆరోపణలతో పోరాడుతున్న నేపథ్యంలో ఎన్సీపీ ఉనికి ఈ ఎన్నికల్లో తన విజయావకాశాలను అంచనా వేస్తున్న మిత్రపక్షం కాంగ్రెస్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఢిల్లీలో సబ్సిడీ విద్యుత్ కు బ్రేకులు..? ఫైలును ఇంకా ఆమోదించని ఎల్జీ సక్సేనా.. విమర్శించిన ఆమ్ ఆద్మీ పార్టీ..

అదానీ-హిండెన్ బర్గ్ వివాదంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేయాలన్న డిమాండ్ పై ఎన్సీపీ చీఫ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాల్లో చీలికను సూచిస్తున్న తరుణంలో శరద్ పవార్ నిన్న సాయంత్రం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలతో సమావేశమయ్యారు. అయితే కాంగ్రెస్ ఓట్లను చీల్చే అవకాశం ఉన్న ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఎన్సీపీ ఎత్తుగడ మిత్రపక్షానికి మింగుడు పడకపోవచ్చు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కేజీఎఫ్ బాబు భార్య పోటీ.. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు.. వీరెవరంటే ?

గోవా, మణిపూర్, మేఘాలయ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయం పొందటంతో ఎన్సీపీ జాతీయ పార్టీ హోదాను, రాష్ట్ర పార్టీ హోదాను కోల్పోయింది. ‘జాతీయ పార్టీ’ గుర్తింపు వల్ల ఓ పార్టీకి దేశవ్యాప్తంగా ఒకే ఉమ్మడి ఎన్నికల గుర్తు లభిస్తుంది. అలాగే ఎక్కువ మంది స్టార్ క్యాంపెయినర్లు నియమించుకునే అవకాశం ఉంటుంది. దీంతో ఢిల్లీలోని కన్వెన్షన్ ఆఫీస్ స్పేస్ ద్వారా ఎన్నికల ప్రచారాల కోసం జాతీయ బ్రాడ్ కాస్టర్లలో ఉచిత ప్రసార సమయం పొందడానికి అనుమతి ఉంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios