Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం.. కాంగ్రెస్ నేత కాళ్లను తాకిన యడియూరప్ప కుమారుడు.. వీడియో వైరల్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కుమారుడు, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి కాళ్లను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Karnataka assembly elections.. Yeddyurappa's son touches Congress leader's legs.. Video goes viral..ISR
Author
First Published Apr 15, 2023, 11:40 AM IST

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర శుక్రవారం తుమకూరులోని ఓ ఆలయంలో కాంగ్రెస్ సీనియర్ నేత పరమేశ్వర ఆశీస్సులు తీసుకున్నారు. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయేంద్ర తన తండ్రికి కంచుకోట అయిన షికారిపుర నుంచి పోటీ చేస్తున్నారు. అయితే బీజేపీ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడి కాళ్లు తాకుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

కర్ణాటకలో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ.. ఎన్నికల బరిలోకి మిత్రపక్షం ఎన్సీపీ..

షికారిపుర నుంచి నామినేషన్‌ దాఖలు చేసేందుకు మూడు రోజుల ముందు విజయేంద్ర యెడియూరులోని సిదలింగేశ్వర ఆలయానికి వచ్చారు.  ఇదే సమయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, కర్ణాటకలో ప్రముఖ షెడ్యూల్డ్ కులాల నేత అయిన పరమేశ్వర విజయేంద్ర అక్కడ ఉండటంతో ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. 

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. లోయలో పడిపోయిన బస్సు.. 13 మంది మృతి, 25 మందికి గాయాలు

కాగా.. ఎన్నో ఊహాగానాలు, డ్రామాల తర్వాత బీజేపీ శికారిపుర నుంచి విజయేంద్రను బరిలోకి దింపింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై వరుణ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని పలువురు పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేయగా, కేంద్ర నాయకత్వం అందుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. యడ్యూరప్ప కూడా సిద్ధరామయ్యపై తన కుమారుడు పోటీ చేసే అవకాశాలను తోసిపుచ్చారు. 1983 నుంచి యడ్యూరప్ప ఏడుసార్లు విజయం సాధించడంతో శికారిపుర బీజేపీకి సేఫ్ సీటుగా భావిస్తున్నారు. అయితే టికెట్ ఆశించిన కొందరు స్థానిక నేతల నుంచి విజయేంద్రకు కొంత వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉంది.

‘‘ 40 ఏళ్లుగా మా నాన్న ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం నుంచి పోటీ చేయడం నా అదృష్టం. షికారిపూర్ నుంచి పోటీ చేయడం సంతోషంగా ఉంది. నా కల సాకారమైంది... నేను యడ్యూరప్ప కుమారుడిని కాబట్టి నాకు టికెట్ ఇచ్చారని చెప్పడం సరికాదు’’ అని విజయేంద్ర శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ‘‘ఈ రోజు బీఎస్ యడియూరప్ప, ఇతర సీనియర్ నాయకుల కారణంగా బీజేపీ కర్ణాటకలోని ప్రతీ మూలకు చేరుకుంది. నేడు, ప్రధాని మోడీ నాయకత్వం, డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో కర్ణాటక సంతోషంగా ఉంది’’ అని ఆయన అన్నారు.

అమ్మాయి అనుకొని ప్రేమించాడు.. తీరా ముసుగుతీసి చూస్తే..!

కర్ణాటకలో అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉండగా.. ప్రస్తుత అధికార బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న కాంగ్రెస్‌కు 75, జేడీఎస్‌కు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే మరోసారి అధికారం నిలుపుకోవాలని  బీజేపీ భావిస్తుండగా.. కాంగ్రెస్ తిరిగి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చూస్తుంది.  ఇక, కర్ణాకటలో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 13న వెలువడనుంది. మే 10న పోలింగ్ జరుగనుంది. ఓట్ల లెక్కింపు మే 13న చేపట్టనున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios