Asianet News TeluguAsianet News Telugu

Rakesh Tikait: ప్ర‌ధాని మోడీ నుంచి క్ష‌మాప‌ణ‌లు కోరడం లేదు కానీ.. రాకేష్ టికాయ‌త్ కీల‌క వ్యాఖ్య‌లు

 Rakesh Tikait: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి తాము క్ష‌మాప‌ణ‌లు కోర‌డం లేద‌ని రైతు నాయ‌కుడు, భారతీయ కిసాన్‌ యూనియన్‌ (BKU) నేత రాకేశ్‌ టికాయిత్ అన్నారు. అలాగే, విదేశాల్లో మన ప్రధాని ప్రతిష్ఠను దిగజార్చడం త‌మ‌కు ఇష్టం లేదని పేర్కొన్నారు.
 

Farmers Don't Want Apology from PM Modi, Don't Want to Tarnish His Image Abroad: BKU Leader Tikait
Author
Hyderabad, First Published Dec 28, 2021, 12:24 AM IST

 Rakesh Tikait: రైతు నాయ‌కుడు, భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ టికాయ‌త్ మీడియాతో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నుంచి తాము క్ష‌మాప‌ణ‌లు కోర‌డం లేద‌ని రాకేష్ టికాయ‌త్ అన్నారు. అలాగే,  విదేశాలలో ప్రధాని మోడీ ప్రతిష్టను దిగజార్చడం ఇష్టం లేదని తెలిపారు. కాగా, కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన వివాదాస్ప‌ద మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌నే డిమాండ్ తో ఏడాదికి పైగా రైతులు ఆందోళ‌న‌లు చేశారు. దేశ‌వ్యాప్తంగా త‌మ నిర‌స‌న‌లు, మ‌హాపంచాయ‌త్ ల‌తో హోరెత్తించారు. ఈ క్ర‌మంలోనే కేంద్రం దిగిరాక త‌ప్ప‌లేదు. మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వెన‌క్కి తీసుకుంటున్నామ‌ని ప్ర‌ధాని మోడీ ప్ర‌క‌టించారు. వివాదాస్ప‌ద మూడు సాగు చ‌ట్టాల ర‌ద్దు.. ఢిల్లీ స‌రిహ‌ద్దుల నుంచి రైతులు ఇండ్ల‌కు చేరిన కొన్ని రోజుల తర్వాత రాకేష్ టికాయ‌త్ ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం ఆసక్తిక‌రంగా మారింది.

Also Read: Omicron: కేర‌ళ‌లో ఒమిక్రాన్ టెన్ష‌న్‌.. నైట్ క‌ర్ఫ్యూ.. న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌పై ఆంక్ష‌లు

“ప్రధాని క్షమాపణలు చెప్పాల‌ని కోరుకోవ‌డం లేదు. విదేశాల్లో ఆయన ప్రతిష్టను దిగజార్చడం మాకు ఇష్టం లేదు. ఏదైనా నిర్ణయం తీసుకుంటే రైతుల అనుమతి లేకుండా జరగదు. మేము నిజాయితీగా పొలాలను సాగు చేస్తున్నాము, కానీ  కేంద్రంలోని ప్ర‌ధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ స‌ర్కారు  మా డిమాండ్లను పట్టించుకోలేదు.మ‌ద్ద‌తు ధ‌ర గురించి ప‌ట్టించుకోలేదు ”అని రైతు నాయ‌కుడు రాకేష్ టికాయ‌త్ పేర్కొన్నారు. కాగా, ఇటీవ‌ల ర‌ద్దు చేసిన వివాదాస్ప‌ద మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను తిరిగి తీసుకువ‌స్తామంటూ కేంద్ర వ్య‌వ‌సాయ మంత్రి పేర్కొన‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి వ్యాఖ్య‌ల‌పై ప్ర‌తిప‌క్షాలు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. కేవ‌లం ఎన్నిక‌ల కోస‌మే సాగు చ‌ట్టాల‌ను మోడీ స‌ర్కారు ర‌ద్దు చేసిందంటూ ఆరోప‌ణ‌లు చేస్తున్నాయి. కేంద్ర మంత్రి వ్యాఖ్య‌ల‌పై రాకేష్ టికాయ‌త్ స్పందిస్తూ...  ఈ వ్యాఖ్య రైతులను మోసం చేయడానికి ఉద్దేశించబడింది మరియు ప్రధాని మోడీని కూడా అవమానపరిచేలా ఉందని అన్నారు.

Also Read: Coronavirus: ఒక్కసారి సోకిందో.. 7 నెలలు దాటిన వదలదు.. కరోనా పై సంచలన విషయాలు వెలుగులోకి !

కాగా, నాగ్‌పూర్‌లో జరిగిన ఆగ్రో విజన్ ఎక్స్‌పో ప్రారంభోత్సవంలో కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి న‌రేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ, “మేము వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చాము. కొంతమందికి అవి నచ్చలేదు కానీ స్వాతంత్య్రం వచ్చిన 70 సంవత్సరాల తరువాత నరేంద్ర మోడీజీ నాయకత్వంలో ముందుకు సాగడం పెద్ద సంస్కరణ. కానీ ప్రభుత్వం నిరాశ చెందలేదు. మేము ఒక అడుగు వెనక్కి తీసుకున్నాము. మేము మళ్లీ ముందుకు సాగుతాము ఎందుకంటే రైతులు భారతదేశానికి వెన్నెముక. కాబ‌ట్టి ఆ వెన్నెముకను బలోపేతం చేస్తే, దేశం బలోపేతం అవుతుంది, ”అని అన్నారు. అయితే, వ్యవసాయ చట్టాలను తిరిగి ప్రవేశపెట్టే ఆలోచన కేంద్రానికి లేదని మంత్రి తరువాత స్పష్టం చేశారు. ఒక కార్యక్రమంలో తాను చేసిన ప్రకటన తప్పుగా పేర్కొన‌బ‌డిందంటూ ఆ త‌ర్వాత తోమ‌ర్ చెప్పుకొచ్చారు. ఇక వివాద‌స్ప‌ద వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను తిరిగి మ‌ళ్లీ తీసుకువ‌స్తే.. తాము మ‌ళ్లీ ఆందోళ‌న‌లు ప్రారంభిస్తామ‌ని రాకేష్ టికాయ‌త్ హెచ్చ‌రించారు. కాగా, వివాదాస్ప‌ద మూడు వ్యవసాయ చట్టాలను నవంబర్ 19న ప్రధాని నరేంద్ర మోదీ రద్దు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. నవంబర్ 23న ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లులను ఆమోదించారు. అనంత‌ర రాష్ట్రప‌తి గెజిట్ నోటిఫికేష‌న్ సైతం జారీ చేశారు.

Also Read: World Inequality Report: అస‌మాన భార‌త్.. పెరుగుతున్న అంత‌రాలు ! 

Follow Us:
Download App:
  • android
  • ios