Omicron: కేర‌ళ‌లో ఒమిక్రాన్ టెన్ష‌న్‌.. నైట్ క‌ర్ఫ్యూ.. న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌పై ఆంక్ష‌లు

Omicron: గ‌త నెల‌లో ద‌క్షిణాఫ్రికాలో వెలుగుచేసిన ఒమిక్రాన్ వేరియంట్ చాలా దేశాల్లో త‌న పంజా విసురుతోంది. భార‌త్ లోనూ ఈ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే చాలా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆంక్ష‌లు విధించాయి. కేర‌ళ స‌ర్కారు సైతం రాష్ట్రంలో నైట్ క‌ర్ఫ్యూ విధించ‌డంతో పాటు కొత్త సంవ‌త్స‌ర వేడుక‌ల‌పై ఆంక్ష‌లు విధించింది. 
 

Amid Omicron worry, Kerala imposes night curfew from December 30; no New Year celebration

Omicron: క‌రోనావైర‌స్ అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్ గా భావిస్తున్న ఒమిక్రాన్ ప్ర‌పంచ వ్యాప్తంగా పంజా విసురుతోంది. మ‌రీ ముఖ్యంగా ద‌క్షిణాఫ్రికా, బ్రిట‌న్‌, అమెరికాల‌తో పాటు యూర‌ప్ దేశాల్లో ఒమిక్రాన్ కేసుల రికార్డుస్థాయిలో న‌మోద‌వుతున్నాయి. భార‌త్ లోనూ ఒమిక్రాన్ వేరియంట్ క‌ల‌క‌లం రేపుతున్న‌ది. నిత్యం ప‌దుల సంఖ్య‌లో కొత్త వేరియంట్ కేసులు న‌మోదుకావ‌డంపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న‌ది. సాధార‌ణ క‌రోనావైర‌స్ కేసులు సైతం క్ర‌మంగా పెరుగుతున్నాయి. ఇలాంటి ప‌రిస్థితులు వుండ‌గా, కొత్త సంవ‌త్స‌రం వ‌స్తుండ‌టం.. ప్ర‌జ‌లు వేడుక‌లు సిద్ధం కావ‌డం మ‌రింత ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మై చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ఇప్ప‌టికే చాలా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఒమిక్రాన్ ను దృష్టిలో ఉంచుకుని ఆంక్ష‌లు విధించాయి. న్యూఇయ‌ర్ వేడుక‌ల‌ను సైతం నిషేధించాయి. కేర‌ళ‌లోనూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండ‌టంతో రాష్ట్రంలో ఆంక్ష‌లు విధిస్తున్నామ‌ని ఆ రాష్ట్ర స‌ర్కారు ప్ర‌క‌టించింది. 

Also Read: Coronavirus: ఒక్కసారి సోకిందో.. 7 నెలలు దాటిన వదలదు.. కరోనా పై సంచలన విషయాలు వెలుగులోకి !

కేర‌ళ‌లో క‌రోనావైర‌స్ కొత్త వేరియంట్ కేసులు క్ర‌మంగా పెరుగుతుండ‌టంతో రాష్ట్రంలో నైట్ క‌ర్ఫ్యూ తో పాటు న్యూ ఇయ‌ర్ వేడుక‌ల‌పై ఆంక్ష‌లు విధిస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ స‌ర్కారు ప్ర‌క‌టించింది. డిసెంబ‌ర్ 30 నుంచి నాలుగు రోజుల పాటు రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు కేరళ సోమవారం ప్రకటించింది. దీనికి సంబంధించిన ఉత్త‌ర్వులు సైతం జారీ చేసింది. ఆ వివ‌రాల ప్ర‌కారం.. డిసెంబ‌ర్ 30 నుంచి జ‌న‌వ‌రి 2 వ‌ర‌కు కేర‌ళ‌లో రాత్రి 10 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు నైట్ క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉంటుంది. అలాగే, క‌రోనా కేసులు పెర‌గ‌కుండా ఉండేందుకు న్యూ ఇయ‌ర్ పార్టీల‌పై ఆంక్ష‌లు విధించింది. డిసెంబ‌ర్ 31 రాత్రి 10 గంట‌ల త‌ర్వాత కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు కొన‌సాగించ‌రాద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. సోమ‌వారం రాష్ట్ర ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ అధ్య‌క్ష‌త క‌రోనావైర‌స్ పై స‌మీక్ష స‌మావేశం జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే క‌రోనావైర‌స్ ఆంక్ష‌లు విధించే నిర్ణ‌యం తీసుకున్నారు.

Also Read: World Inequality Report: అస‌మాన భార‌త్.. పెరుగుతున్న అంత‌రాలు ! 

దుకాణాలు, సంస్థలు రాత్రి 10 గంటలకు మూసివేయాలని కేర‌ళ స‌ర్కారు త‌మ ఆదేశాల్లో స్ప‌ష్టం చేసింది. లేకుంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ హెచ్చ‌రించింది. అనవసర ప్రయాణాల‌ను మానుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించింది. అలాగే, కారణం లేకుండా బహిరంగంగా గుమిగూడవద్దని కేరళ ప్రభుత్వం పౌరులను కోరింది. డిసెంబర్ 31న  బార్‌లు, క్లబ్‌లు, హోటళ్లు, రెస్టారెంట్‌లు, తినుబండారాలలో సీటింగ్ కెపాసిటీ 50%గా ఉంటుందని ఒక ప్రకటన తెలిపింది. నూతన సంవత్సర వేడుకలకు పెద్దఎత్తున జనం వచ్చే అవకాశం ఉన్న బీచ్‌లు, షాపింగ్ మాల్స్, పబ్లిక్ పార్కులు వంటి ప్రాంతాల్లో పోలీసు అధికారుల నుంచి తగిన సహకారంతో జిల్లా కలెక్టర్లు సెక్టోరల్ మేజిస్ట్రేట్‌లను మోహరించాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. క‌రోనావైర‌స్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకునీ, స్థానిక ప‌రిస్థితుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని కంటైన్‌మెంట్ జోన్‌లుగా విభ‌జించ‌డం,  అక్కడ ఆంక్షలు కఠినతరం చేయాలని ముఖ్యమంత్రి ఈ సమావేశంలో అధికారుల‌ను ఆదేశించారు.

Also Read: మొద‌ట‌గా బూస్ట‌ర్ డోసులు అందుకునేది వీళ్లే.. 20 రకాల్లో ఏ వ్యాధి ఉన్నాబూస్టర్‌ డోసు !

 

ఇదిలావుండ‌గా, కేర‌ళ‌లో ఒమిక్రాన్ క‌ల‌వ‌రం మొద‌లైంది. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ కేసులు రాష్ట్రంలో అధికంగా న‌మోద‌వుతున్నాయి. దీనికి తోడు ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు కేర‌ళ‌లో మొత్తం 57 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, కొత్త‌గా క‌రోనాకేసులు సైతం 1,636 వెలుగుచేశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్-19 సోకిన వారి సంఖ్య 52,24,929కి చేరుకుంది.

Also Read: Manikka Vinayagam: సినీ పరిశ్రమలో మ‌రో విషాదం.. ప్రముఖ సింగర్, నటుడు మాణిక్య వినాయగం మృతి 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios