Coronavirus: ఒక్కసారి సోకిందో.. 7 నెలలు దాటిన వదలదు.. కరోనా పై సంచలన విషయాలు వెలుగులోకి !

Coronavirus: ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా క‌ల్లోలం రేపుతున్న‌ది. అనేక మ్యూటేష‌న్ల‌కు లోన‌వుతూ ప్ర‌మాద‌క‌ర వేరియంట్ గా రూపాంత‌రం చెందుతున్న‌ది. ఇప్ప‌టికే ఈ వైర‌స్ గురించి పూర్తి స్థాయి స‌మాచారం లేదు. తాజా పరిశోధనల్లో క‌రోనా వైర‌స్ గురించి మ‌రో సంచ‌ల‌న విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది అమెరికాకు చెందిన ఓ అధ్య‌య‌నం. 
 

Covid19 virus remains in body for months after it invades replicates across organs Study

Coronavirus: 2019లో చైనాలో వెలుగుచూసిన క‌రోనా వైర‌స్.. అనేక మ్యూటేష‌న్ల‌కు లోన‌వుతూ అత్యంత ప్ర‌మాద‌క‌రంగా మారుతోంది. మాన‌వాళి మ‌నుగ‌డ‌కు స‌వాలు విసురుతున్న‌ది. ఇప్ప‌టికే క‌రోనాకు చెందిన డెల్టా, డెల్టా ప్ల‌స్ వేరియంట్ లు ల‌క్ష‌లాది మందిని బ‌లితీసుకోగా, కోట్లాది మందిని అనారోగ్యానికి గురిచేసింది. ప్ర‌స్తుతం ప‌లు మ్యుటేష‌న్ల‌కు గురైన క‌రోనా వైర‌స్‌.. ఒమిక్రాన్ వేరియంట్ చాలా దేశాల్లో వేగంగా వ్యాపిస్తోంది. ఒమిక్రాన్ ను అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన వేరియంట్ గా భావిస్తున్న త‌రుణంలో దీని వ్యాప్తి రికార్డు స్థాయిలో వుండ‌టంతో స‌ర్వ‌త్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇక క‌రోనా వైర‌స్ వేరియంట్ల గురించి ఇప్ప‌టికీ పూర్తి స్థాయి స‌మాచారం లేదు. కోవిడ్‌-19 ప‌రిశోధ‌న‌ల్లో నిత్యం ఏదో ఒక కొత్త విష‌యం వెలుగుచూస్తూనే ఉంది. ఈ క్ర‌మంలోనే క‌రోనా వైర‌స్ కు సంబంధించిన మ‌రో షాకింగ్ విష‌యాన్ని అమెరికా అధ్య‌య‌నం వెల్ల‌డించింది. క‌రోనా వైర‌స్ ఒక్క‌సారి సోకితే  అది నెలలపాటు శ‌రీరంలోనే ఉండి వివిధ శరీర భాగాలపై ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనంలో తేలింది. అమెరికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల అధ్యయనం ఈ వివ‌రాలు వెల్ల‌డించింది.

Also Read: World Inequality Report: అస‌మాన భార‌త్.. పెరుగుతున్న అంత‌రాలు !

 

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్-అమెరికా ప‌రిశోధ‌కుల అధ్య‌య‌నంలో వెల్ల‌డైన వివ‌రాలు ఇలా ఉన్నాయి... క‌రోనా వైర‌స్ ఒక్క‌సారి సోకితే అది చాలా కాలం పాటు శ‌రీరంలోనే ఉండిపోతుంది.  కరోనా సోకినప్పటినుంచి ఏకంగా 230 రోజులపాటు (ఏడున్నర నెలలు) వైరస్‌ మానవ శరీరంలో ఉంటున్నట్లు ప‌రిశోధ‌కులు గుర్తించారు.  శరీరంలోని పలు అవయవాలు ఇది ఉంటుంద‌ని తెలిపారు. ప్ర‌ధాన అవ‌య‌వాల‌తో పాటు మెదడులోనూ వైర‌స్ ఉంటున్న‌ద‌ని తెలిపారు.  లక్షణం లేనివారు, తేలికపాటి లక్షణాలు ఉన్నవారిలోనూ అదే స్థాయిలో వైరస్ ఉంటున్న‌ద‌ని వెల్ల‌డించారు.  అయితే, వైరస్‌ లోడు అత్యధికంగా శ్వాసకోశంలో  ఉటుంద‌ని సైంటిస్టులు గుర్తించారు. శ్వాస‌కోశం త‌ర్వాత గుండె రక్తనాళ కణజాలం, లింఫోయిడ్, జీర్ణశయాంతర కణజాలాలు, మూత్రపిండం, ఎండోక్రైన్ కణజాలంలో అధికంగా ఉంటున్న‌ద‌ని తెలిపారు.

Also Read: మొద‌ట‌గా బూస్ట‌ర్ డోసులు అందుకునేది వీళ్లే.. 20 రకాల్లో ఏ వ్యాధి ఉన్నాబూస్టర్‌ డోసు !

అలాగే, పునరుత్పత్తి కణజాలం, కండరాలు, చర్మం, కొవ్వులోనూ క‌రోనా వైర‌స్ ఉండటాన్ని గుర్తించామ‌ని షాకింగ్ విష‌యాన్ని వెల్ల‌డించారు ప‌రిశోధ‌కులు.  మెదడు కణజాలంలోనూ ఏడు నెలలపాటు ఉంటోందని తెలిపారు. ఈ స‌మ‌యంలో శ‌రీరంలోని ప‌లు అవ‌య‌వాల‌పై నెమ్మ‌దిగా దాడి చేస్తూ.. ఇన్ఫెక్ష‌న్ కు గురిచేస్తున్న‌ద‌ని వెల్ల‌డించారు. అయితే, ఊపిరితిత్తులపై మాత్రం ఎలాంటి ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించలేదని చెప్పారు.  ఈ అధ్య‌య‌న బృదం ఈ ప‌రిశోధ‌న కోసం క‌రోనా వైర‌స్ కార‌ణంగా చ‌నిపోయిన వారి మృత దేహాల‌ను ప‌రిశోధించి.. ఈ వివ‌రాలు వెల్ల‌డించింది. తమ ప‌రిశోధ‌న‌లో భాగంగా క‌రోనా వైర‌స్ కార‌ణంగా చ‌నిపోయిన మొత్తం 44 మృత దేహాల‌ను కొన్ని రోజుల పాటు ప‌రిశోధించి ఈ రిపోర్టును త‌యారుచేసిన‌ట్టు అధ్య‌య‌న బృందం వెల్ల‌డించింది.  ఇదిలావుండ‌గా, ఇప్ప‌టికే క‌రోనా వైర‌స్ సోకిన వారు ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా కోలుకున్న‌ప్ప‌టికీ.. కొన్ని నెల‌ల త‌ర్వాత వారిలో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను గుర్తించిన‌ట్టు ప‌లు అధ్య‌య‌నాలు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. క‌రోనా వైర‌స్ పై చేస్తున్న ప‌రిశోధ‌న‌ల్లో ఇప్ప‌టికీ అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌లు చాలానే ఉన్నాయ‌ని ప‌లువురు నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఒమిక్రాన్ గురించి పూర్తి స‌మాచారం తెలియ‌క‌పోవ‌డంతో స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

Also Read: Manikka Vinayagam: సినీ పరిశ్రమలో మ‌రో విషాదం.. ప్రముఖ సింగర్, నటుడు మాణిక్య వినాయగం మృతి 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios