విశ్వాసం చాటుకున్న శునకం..ఆత్మహత్యకు పాల్పడ్డ యజమానిని కాపాడేందుకు 4 గంటలు తీవ్రంగా ప్రయత్నించి.. చివరికి
యజమాని ఆత్మహత్యకు పాల్పడటంతో ఆ పెంపుడు శునకం తట్టుకోలేకపోయింది. అతడిని కాపేడేందుకు తీవ్ర ప్రయత్నం చేసింది. ఇలా నాలుగు గంటల పాటు శ్రమిస్తూనే ఉంది. కానీ ఫలితం లేకపోయింది. చివరికి అది కూడా చనిపోయింది.
ఆ శునకానికి యజమాని అంటే ప్రేమ, విశ్వాసం. ఇంట్లో కుటుంబ సభ్యులు సమయం చూసి యజమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిని ఆ శునకం గమనించింది. అతడిని కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. సుమారు నాలుగు గంటల పాటు తీవ్రంగా శ్రమించింది. అయినా దాని వల్ల కాలేదు. చివరికి పోలీసులు, స్థానికులు వచ్చి యజమాని డెడ్ బాడీని బయటకు తీసుకొచ్చారు. అయితే కొంత సమయానికే ఆ శునకం కూడా చనిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగులోకి వచ్చింది.
వివరాలు ఇలా ఉన్నాయి. ఝాన్సీ జిల్లా కేంద్రంలోని పంచవటిలోని పోష్ కాలనీలో 25 ఏళ్ల అగ్నిహోత్రి యూపీఎస్సీ పరీక్షకు సిద్ధమవుతున్నాడు. అయితే అతడి తల్లి కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో తండ్రి ఆనంద్ ఆమెను తీసుకొని భోపాల్ వెళ్లాడు. దీంతో స్థానిక నలంద గార్డెన్ లో సంభవ్ ఒంటరిగా చాలా సేపు కూర్చొని ఇంటికి వెళ్లాడు. ఈ సమయంలో తండ్రి అతడికి ఫోన్ చేసినా ఎత్తలేదు.
అయితే ఇంటికి వెళ్లిన తరువాత అగ్నిహోత్రి ఆత్మహత్యకు ఒడిగట్టాడు. అయితే దీనిని అతడి పెంపుడు కుక్క అలెక్స్ గమనించింది. దానికి చేతగాకపోయినా యజమానిని కాపాడేందుకు తీవ్ర ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కుక్క బాగా అరిచింది. ఈ అరుపులు పక్కింట్లో నివసించేవారికి వినిపించాయి. ఇదే సమయంలో తండ్రి చుట్టుపక్కల నివసించే వారికి కాల్ చేశాడు. తమ కుమారుడు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని, వెంటనే ఇంటికి వెళ్లి చూడాలని సూచించాడు. దీంతో వారందరూ ఇంటికి వెళ్లి చూశారు.
బస్టాప్‌లో వేచివున్న వారిపైకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురు మృతి
ఓ గదిలో అగ్నిహోత్రి ఆత్మహత్య చేసుకొని కనిపించాడు. అయితే వారిని ఆ శునకం లోపలికి రానివ్వలేదు. దీంతో వారంతా కలిసి పోలీసులకు ఫోన్ చేశారు. వారిని కూడా అలెక్స్ అడ్డుకుంది. చివరికి దానికి మత్తు మందు ఇచ్చి లోపలికి వెళ్లారు. అగ్నిహోత్రి బట్టలపై, కాళ్లపై గీతలు కనిపించాయి. అక్కడ ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించలేదు. అయితే మృతుడు తన పుస్తకాల్లో పలు విషయాలు రాసుకొచ్చాడు. తాను గతేడాది యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించలేకపోయానని బాధపడ్డాడు. కాగా.. అప్పటి నుంచి తీవ్ర ఒత్తిడితో ఉన్న అతడిని కుటుంబ సభ్యులు ఓదార్చేందుకు ప్రయత్నించారు. కానీ వారు లేని సమయంలో చూడా అతడు ఇలాంటి అఘాయిత్యానికి ఒడిగట్టాడు.
దారుణం.. టిక్కెట్ డబ్బులు ఇవ్వలేదని కదులుతున్న బస్సులో నుంచి తోసేయడంతో యువకుడి మృతి
ఈ ఘటన జరిగిన కొంత సమయానికే అలెక్స్ కూడా చనిపోయింది. అయితే మత్తు మందు డోస్ ఎక్కువవడంతోనే అది మరణించదని స్థానికులు ఆరోపించారు. ఒకే రోజు కుమారుడు, పెంపుడు జంతువు చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదించారు. ఆ కాలనీ మొత్తం విషాదంలో మునిగిపోయింది.
జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.