బస్టాప్‌లో వేచివున్న వారిపైకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురు మృతి
Texas: టెక్సాస్ లో బస్ స్టాప్ లో వేచి ఉన్న వారిపైకి ఎస్ యూవీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. టెక్సాస్ దక్షిణ అంచున ఉన్న సరిహద్దు నగరమైన బ్రౌన్స్ విల్లేలో బస్ స్టాప్ వద్ద వేచి ఉన్న పలువురిపై స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం దూసుకెళ్లిందని స్థానిక పోలీసు ప్రతినిధి మార్టిన్ శాండోవల్ ఏబీసీ అనుబంధ సంస్థకు తెలిపారు.
7 Killed As SUV Runs Over People: టెక్సాస్ లో బస్ స్టాప్ లో వేచి ఉన్న వారిపైకి ఎస్ యూవీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. టెక్సాస్ దక్షిణ అంచున ఉన్న సరిహద్దు నగరమైన బ్రౌన్స్ విల్లేలో బస్ స్టాప్ వద్ద వేచి ఉన్న పలువురిపై స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం దూసుకెళ్లిందని స్థానిక పోలీసు ప్రతినిధి మార్టిన్ శాండోవల్ ఏబీసీ అనుబంధ సంస్థకు తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. అమెరికాలోని టెక్సాస్ లో బస్ స్టాప్ లో వేచి ఉన్న వారిపైకి ఎస్ యూవీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. టెక్సాస్ దక్షిణ అంచున ఉన్న సరిహద్దు నగరమైన బ్రౌన్స్ విల్లేలో బస్ స్టాప్ వద్ద వేచి ఉన్న పలువురిపై స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం దూసుకెళ్లిందని స్థానిక పోలీసు ప్రతినిధి మార్టిన్ శాండోవల్ ఏబీసీ అనుబంధ సంస్థకు తెలిపారు. బాధితులు వలసదారులేనా అనే విషయం తెలియరాలేదు.
శరణార్థుల దరఖాస్తులను కూడా స్వీకరించకుండా సరిహద్దు గస్తీ అధికారులు వారిని బహిష్కరించడానికి లేదా తిప్పి పంపడానికి అనుమతించే డొనాల్డ్ ట్రంప్ కాలం నాటి ఫెడరల్ విధానాన్ని ఎత్తివేయడానికి అధికారులు గురువారం సన్నద్ధమవుతున్న సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. టైటిల్ 42గా పిలిచే ఈ నిబంధన గడువు ముగియడంతో అమెరికాలోకి అక్రమ వలసదారులు వచ్చే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదం జరిగిన వీధికి అడ్డంగా ఉన్న నిరాశ్రయుల ఆశ్రయం ప్రస్తుతం మెక్సికో నుండి సరిహద్దు దాటుతున్న ప్రజల ప్రవాహం కారణంగా కొంతమంది వలసదారులకు ఆశ్రయం కల్పిస్తోందని శాండోవల్ చెప్పారు. ఇదిలావుండగా, అమెరికాలోని టెక్సాస్ షాపింగ్ మాల్ లో దుండగుడు జరిపిన కాల్పుల్లో 9 మంది మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పులకు దిగిన దుండగుడు పోలీసుల కాల్పుల్లో మరణించాడు. మాల్ లో కాల్పులు జరిగిన సమయంలో అదే మాల్ లో ఉన్న ఓ పోలీస్ అధికారి దుండగుడిని కాల్పి చంపినట్టుగా పోలీసు అధికారులు ధృవీకరించారు. క్షతగాత్రులను మూడు ఆసుపత్రుల్లో చేర్పించారు. గాయపడిన వారిలో ఐదు నుండి 60 ఏళ్ల లోపు వారు ఉన్నారని అధికారులు చెప్పారు. ఈ ఘటనను అంతులేని విషాదంగా టెక్సాస్ గవర్నర్ పేర్కొన్నారు.