తమిళనాడు భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ధర్మపురి జిల్లాలో ఉన్న బాణసంచా తయారీ కంపెనీ గోడౌన్ లో నేటి ఉదయం పేలుడు సంభవించింది. దీంతో మంటలు అంటుకొని ఇద్దరు సజీవ దహనం అయ్యారు. మరొకరికి గాయాలయ్యాయి. 

తమిళనాడులోని ధర్మపురి జిల్లా నాగరసంపట్టి సమీపంలోని ఓ ప్రైవేటు బాణసంచా తయారీ కంపెనీ గోడౌన్ లో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. మరొకరికి గాయాలు అయ్యాయి. ఈ పేలుడు వల్ల భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. ఈ సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అనుమానితురాలు: పిళ్లైకి ఈ నెల 20 వరకు ఈడీ కస్టడీ పొడిగింపు

మృతులు నాగతసంపట్టి గ్రామానికి చెందిన పళనియమ్మాళ్, మునియమ్మాళ్‌గా గుర్తించారు. క్షతగాత్రులను రక్షించి సమీపంలోని జిల్లా ఆసుపత్రికి తరలించారు. పేలుడు కారణంగా ఆ ప్రాంతానికి 2 కిలో మీటర్ల సమీపంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పేలుడు కారణంగా సమీపంలోని భవనాల పైకప్పులు మరియు గోడలు పగుళ్లు ఏర్పడ్డాయి. 

అరుణాచల్ ప్రదేశ్ లో కూలిన ఇండియన్ ఆర్మీ చీతా హెలికాప్టర్.. కొనసాగుతున్న సహాయక చర్యలు

ఎప్పటిలాగే యథావిధిగా ఉద్యోగులు యూనిట్ కు వచ్చి పని చేస్తున్నారని, కానీ గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఒక్క సారిగా ఈ పేలుడు సంభవించిందని పోలీసులు తెలిపారు. భారీ స్థాయిలో ఉన్న మంటలను పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు.

కాగా.. ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుడికి రూ.లక్ష ఆర్థిక సాయం అందజేస్తామని పేర్కొన్నారు. 
కాగా..అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ధర్మపురి జిల్లా పెన్నాగారం ప్రాంతంలో 20కి పైగా పటాకుల గోడౌన్లు ఉన్నాయి. శివకాశితో పాటు పలు ప్రాంతాల నుంచి కొనుగోలు చేసిన పటాకులను ఆ ప్రాంతంలో పండుగలు, కార్యక్రమాల సమయంలో విక్రయించేందుకు నిల్వ ఉంచుతారు. 

అదానీ సమస్యపై చర్చ జరగకూడదనే పార్లమెంటును నడపనివ్వడం లేదు - కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే

ఇదే తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో ఉన్న విడిభాగాల గోడౌన్‌లో గత సోమవారం సాయంత్రం మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది చాలా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారని తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. రెండు రోజుల కిందట గుజరాత్‌లో ఇలాంటి ప్రమాదమే చోటు చేసుకుంది. వల్సాద్‌లోని సుమారు 10 గోడౌన్లలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.