అదానీ సమస్యపై చర్చ జరగకూడదనే ఉద్దేశంతోనే పార్లమెంట్ సమావేశాలను ప్రభుత్వం కొనసాగినవ్వడం లేదని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. అధికార పార్టీ సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం ఎప్పుడూ చూడలేదని తెలిపారు. 

అదానీ వ్యవహారం, దాని వైఫల్యాలపై చర్చ జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రతిపక్షాలను రెచ్చగొడుతోందని, పార్లమెంటును పనిచేయనివ్వడం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. యూకేలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ఆయన పునరుద్ఘాటించారు. 

భారత్‌లో పెరిగిన కరోనా కేసులు.. నాలుగు నెలల తర్వాత ఇదే అత్యధికం..!

పార్లమెంటరీ కార్యకలాపాలు ప్రారంభానికి ముందు ఉదయం ఖర్గే మీడియాతో మాట్లాడుతూ. “అధికార పార్టీకి చెందిన వ్యక్తులు ప్రతిరోజూ సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగిస్తారని మీరు ఎప్పుడైనా విన్నారా ? ముందుగా లేచి 'మాఫీ మాంగో', 'మాఫీ మాంగో' (క్షమాపణ) అనడం మొదలుపెడతారు. ఇదేమిటి? వారే ముందు నిలబడి క్షమాపణలు చెప్పాలి. ప్రభుత్వం రెచ్చగొడుతోంది. ప్రజాస్వామ్యం గురించి ఇతరులకు బోధిస్తున్నారు’’ అని ఆయన మండిపడ్డారు.

పార్లమెంటులో ఉత్కంఠ: దేశానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, వారు అనుమతిస్తే పార్లమెంటులోనే..!: రాహుల్ గాంధీ

‘‘దేశంలో అంటరానితనం ఉందా ? లేదా ? అది ఉంది కాబట్టే ఎవరైనా విదేశాలకు వెళితే అతడు దాని గురించి మాట్లాడుతాడు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతున్నారు, మేము నిన్న శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం. మమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు? మమ్మల్ని అడ్డుకునేందుకు మహిళా కానిస్టేబుళ్లను రంగంలోకి దింపారు’’ అని ఖర్గే ఆరోపించారు. కాగా.. మధ్యాహ్నం సమయంలో పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష పార్టీల నాయకులు అంతా మానవహారం నిర్వహించారు. అదానీ వివాదంపై విచారణ జరిపించాలని నినదించారు. బుధవారం కూడా అదానీ వ్యవహారంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేసేందుకు కాంగ్రెస్ తో పాటు పలు ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ హౌస్ నుంచి నిరసన ర్యాలీ చేపట్టాయి. అయితే విజయ్ చౌక్ వద్ద పోలీసులు వారిని అడ్డుకున్నారు.

Scroll to load tweet…

రాహుల్ గాంధీ ఇటీవల యూకేలో పర్యటిస్తున్న సమయంలో.. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలు క్రూరమైన దాడికి గురవుతున్నాయని, దేశ వ్యవస్థలపై పూర్తి స్థాయిలో దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. లోక్ సభలో ప్రతిపక్ష సభ్యుడు ముఖ్యమైన అంశాలను లేవనెత్తినప్పుడు మైక్ లు తరచుగా ఆఫ్ అవుతాయని లండన్ లోని బ్రిటిష్ పార్లమెంటేరియన్లతో అన్నారు.

లంచం, బెదిరింపు ఆరోప‌ణ‌ల‌తో డిజైన‌ర్ పై కేసు పెట్టిన అమృతా ఫ‌డ్న‌వీస్

అయితే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కొన్ని రోజులుగా రాజకీయ దుమారం రేపుతున్నాయి. బడ్జెట్ సమావేశాల రెండో అర్ధభాగం మొదటి మూడు రోజుల్లో ఉభయ సభలు పెద్దగా కార్యకలాపాలను నిర్వహించలేదు. విదేశీ గడ్డపై భారత్ ను కించపరుస్తున్నారని, విదేశీ జోక్యాన్ని కోరుతున్నారని బీజేపీ ఆరోపించింది. ప్రధాని నరేంద్ర మోడీ విదేశాల్లో అంతర్గత రాజకీయాలను లేవనెత్తిన సందర్భాలను గుర్తుచేస్తూ కాంగ్రెస్ అధికార పార్టీపై ఎదురుదాడికి దిగుతోంది.